OG : ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సినిమాల మీద దృష్టి ఎక్కువగా పెట్టట్లేదు అనే విషయం అందరికీ అర్థమవుతుంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ విషయంలో పూర్తిస్థాయిలో నిరాశలో ఉన్నారు. కానీ డిప్యూటీ సీఎం గా గెలవడం అనేది కొంతమేరకు సంతోషం ఇచ్చింది. ఏదేమైనా ఆన్ స్క్రీన్ పై పవన్ కళ్యాణ్ ని మిస్ అవ్వటం అనేది జీర్ణించుకోలేని విషయం. ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేతిలో చాలా ప్రాజెక్ట్ ఉన్నా కూడా అందరికీ విపరీతమైన నమ్మకాలు ఉన్న ప్రాజెక్ట్ ఓ జి. సుజిత్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై బీభత్సమైన అంచనాలు ఉన్నాయి. చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ ఒక గ్యాంగ్ స్టార్ రోల్ లో కనిపించబోతున్నారు అని క్యూరియాసిటీ మొదలైంది. ఈ సినిమాకి సంబంధించిన వీడియో కూడా అంచనాలను భారీ హైప్ చేసింది.
ఓజి లో స్టార్ హీరో సాంగ్
సుజిత్ దర్శకత్వంలో వస్తున్న ఓ జి సినిమాకి ఎస్ తమన్ సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే. అజ్ఞాతవాసి సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ ఇచ్చిన అన్ని సినిమాలకు సంగీత దర్శకుడుగా పనిచేసిన మ్యూజిక్ డైరెక్టర్ తమన్. త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అరవింద సమేత వీర రాఘవ సినిమా తర్వాత తమన్ రేంజ్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్లిపోయింది. వరుసగా పవన్ కళ్యాణ్ తో ప్రాజెక్ట్స్ రావడానికి కారణం కూడా ఒకరకంగా త్రివిక్రమ్ అని చెప్పాలి. ఇకపోతే ఓ జి సినిమాలో తమిళ్ స్టార్ హీరో శింబు ఒక పాటను పాడినట్లు కన్ఫర్మ్ చేశాడు తమన్. సినిమా నుంచి నెక్స్ట్ రిలీజ్ చేయబోయే పాట కూడా అదే. ఆ పాట పేరు ఫైర్ స్ట్రోమ్. ఓజి సినిమా షూటింగ్ కి వెళ్లే ముందు ఈ పాటను విడుదల చేయనున్నారు. ప్రస్తుతం ఈ పాట మీద కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి.
ఎన్టీఆర్ తర్వాత పవన్ కళ్యాణ్ కు
శింబు విషయానికి వస్తే కేవలం నటుడు గానే కాకుండా మిగతా విషయాల్లో కూడా మంచి అవగాహన ఉంది. ముఖ్యంగా తన పాడే పాటలు మంచి హైలెట్ గా మిగిలాయి. ఇదివరకే తమన్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన బాద్షా సినిమాలో ఒక పాటను పాడాడు. ఎన్టీఆర్ తర్వాత మళ్లీ ఇప్పుడు తమన్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ కు పాడారు. ఏదైనా సినిమా కోసం భారీ తారాగణంతో పాటు ఇలా టెక్నీషియన్స్ ని కూడా డిఫరెంట్ గా తీసుకోవడం అనేది సినిమా మీద అంచనాలను మరింత పెంచుతుంది. అంతేకాకుండా స్వతహాగా సుజిత్ కూడా పవన్ కళ్యాణ్ కి అభిమాని కావడంతో ఈ సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుందో అని అభిమానుల ఊహకు కూడా అందటం లేదు. అలానే తమన్ కూడా ఈ సినిమా గురించి ప్రతిసారి ఎక్స్పెక్టేషన్స్ పెంచుతూనే ఉన్నాడు.
Also Read : OG : ఓ జి సినిమాలో ఆ స్టార్ హీరో సాంగ్ పాడారు, రిలీజ్ ఎప్పుడంటే.?