BigTV English

Lokesh Kanagaraj: లోకేష్ కనగరాజ్ డ్రీమ్ ప్రాజెక్ట్ సెట్, ఇది నెక్స్ట్ లెవెల్

Lokesh Kanagaraj: లోకేష్ కనగరాజ్ డ్రీమ్ ప్రాజెక్ట్ సెట్, ఇది నెక్స్ట్ లెవెల్

Lokesh Kanagaraj: కేవలం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా తమిళ్ ఫిలిమ్ ఇండస్ట్రీలో కూడా షార్ట్ ఫిలిం బ్యాక్ గ్రౌండ్ తో వచ్చి డైరెక్టర్స్ గా ప్రూవ్ చేసుకున్న వాళ్లు ఉన్నారు. ఇప్పుడు తమిళ్ ఫిలిమ్ ఇండస్ట్రీలో ఉన్న స్టార్ డైరెక్టర్స్ లో లోకేష్ కనకరాజ్ ఒకరు. మా నగరం సినిమాతో తమిళ్ ఫిలిమ్ ఇండస్ట్రీకి దర్శకుడుగా పరిచయం అయ్యాడు లోకేష్. ఈ సినిమాను తెలుగులో నగరం పేరుతో విడుదల చేశారు. ఈ సినిమాలో సందీప్ కిషన్ రెజీనా కసాండ్రా కలిసిన నటించారు. ఇకపోతే ఫస్ట్ సినిమా తోనే టెక్నికల్ గా చాలా బ్రిలియంట్ డైరెక్టర్ అని అనిపించుకున్నాడు లోకేష్. మొదటి సినిమాకే లోకేష్ టాలెంట్ ఏంటో అందరికీ తెలిసి వచ్చింది. ఆ తర్వాత వచ్చిన ఖైదీ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఒక రాత్రి ప్రయాణాన్ని చాలా ఆసక్తికరంగా చూపించి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచాడు.


ఖైదీ సినిమా సక్సెస్ కొట్టిన తర్వాత ఏకంగా మల్టీ స్టారర్ సినిమా చేసే అవకాశాన్ని పొందుకున్నాడు. తలపతి విజయ్, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలలో కలిసి నటించిన సినిమా మాస్టర్. సంక్రాంతి కానుక విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్స్ సాధించింది. ఈ సినిమాలో విజయ్ కి లోకేష్ రాసిన ఎలివేషన్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయి. ఆ కేరక్టరైజేషన్ కూడా చాలామంది ప్రేక్షకులకు విపరీతంగా కనెక్ట్ అయింది. ఈ సినిమా తర్వాత లోకేష్ దర్శకత్వం వహించిన సినిమా విక్రమ్. కమలహాసన్ తో లోకేష్ సినిమా అన్నప్పుడు చాలామందికి అంచనాలు విపరీతంగా పెరిగాయి. కమల్ తో సినిమా అన్నప్పుడు ఇదివరకే కమల్ చేసిన విక్రమ్ సినిమా రిఫరెన్స్ గా తీసుకొని ఒక కథను సిద్ధం చేశాడు లోకి. కమల్ హాసన్ నటించిన విక్రమ్ సినిమా బ్లాక్ బస్టర్ అయింది. కమల్ హాసన్ సినిమాల్లోనే హైయెస్ట్ కలెక్షన్స్ వసూలు చేసింది. ఒక ప్రస్తుతం లోకేష్ రజనీకాంత్ హీరోగా కూలీ అనే సినిమాను చేస్తున్నాడు.

లోకేష్ డ్రీమ్ ప్రాజెక్ట్


ప్రతి దర్శకుడికి కూడా ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ ఉంటుంది. అలానే లోకేష్ కి సంబంధించి అమీర్ ఖాన్ తో సినిమా చేయాలి అని ఒక డ్రీమ్ ఉంది. అది ఎట్టకేలకు నెరవేరుతుంది. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనుంది. హీరోకు మరియు దర్శకుడు కి ఇదివరకే అడ్వాన్స్ ఇచ్చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన ఆఫీస్ కూడా త్వరలో చెన్నైలో ఓపెన్ చేయనున్నారు. లోకేష్ కనకరాజ్ ఖైదీ టు పూర్తయిన తర్వాత ఇమ్మీడియేట్ గా అమీర్ ఖాన్ తో సినిమా ఉంటుంది అని వార్తలు వస్తున్నాయి. దీని గురించి అధికారిక ప్రకటన త్వరలో రావాల్సి ఉంది. సీనియర్ స్టార్ హీరో కమల్ హాసన్ కు బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన లోకేష్ అమీర్ ఖాన్ తో ఎటువంటి సినిమా ప్లాన్ చేశాడు అని చాలామందికి క్యూరియాసిటీ మొదలైంది.

Also Read : Thaman: తమన్ ఆవేదన, నాకు తెలియకుండా నా పేరు మార్చేశారు

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×