BigTV English

Simran:హేమా కమిటీ.. నేను కూడా బాధితురాలినే

Simran:హేమా కమిటీ.. నేను కూడా బాధితురాలినే

Simran: మలయాళంలో హేమా కమిటీ రిపోర్ట్ ఎంత  సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నటీమణులపై వేధింపులు,  అసభ్య పదజాలం ఉపయోగించి పైశాచిక ఆనందం పొందడం..  ఇలా ఒకటి  కాదు  రెండు కాదు. ఇక హేమా కమిటీ రిపోర్ట్ బయటకు వచ్చాకా.. చిన్న చిన్న పాత్రలు చేసే క్యారెక్టర్ ఆర్టిస్ట్స్ నుంచి హీరోయిన్లు వరకు  తాము అనుభవించిన ఆవేదనను బయటపెడుతున్నారు.


హీరోలు, డైరెక్టర్లు, నిర్మాతలు, సహా నటులు.. ఇలా ఎవరెవరు తమను వేధించారో  అంత పూస గుచ్చినట్లు చెప్పుకొస్తున్నారు.  మలయాళ  పరిశ్రమకు చెందిన  నటీమణులు మాత్రమే కాకుండా మిగతా భాషలకు చెందినవారు కూడా  తమ బాధలను చెప్పుకొస్తున్నారు. నిజం చెప్పాలంటే.. సీనియర్ నటీమణులు ఇన్నాళ్లు  దాచుకుంటూ వచ్చిన రహస్యాలను బయటపెట్టడం మరింత  ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.

ఖుష్బూ, రాధికా, సుమలత ఇలా ఒకరి తరువాత ఒకరు బయటకు వస్తున్నారు. తాజాగా సీనియర్ హీరోయిన్ సిమ్రాన్  కూడా తాను బాధితురాలినే  అని   చెప్పుకురావడం సంచలనంగా  మారింది. సిమ్రాన్ మాట్లాడుతూ.. ” బాధితులంతా  ఇప్పుడు బయటకు వస్తున్నారు.  అలాంటి బాధితుల్లో నేను కూడా ఒకదాన్ని. నేను కూడా ఇలాంటి వేధింపులను ఎదుర్కొన్నాను. అయితే ఇలాంటి వేధింపులు నేను చిన్న వయస్సులో ఎదుర్కొన్నాను. అందుకు సంబంధించిన వివరాలు ఇప్పుడు వివరించి చెప్పలేను.


అయితే అప్పుడెందుకు  చెప్పలేదు అనే ప్రశ్న నాకు ఎదురవుతుంది.  అప్పుడు .. ప్రశ్నించడం అనేది  ఒక దారుణమైన  చర్య అని చెప్పాలి. కొంతమంది వాటి అప్పటికప్పుడు చెప్పడానికి భయపడతారు. ఎందుకంటే .. ఆ సమయంలో మన చుట్టూ  ఏం జరుగుతుందో తెలుసుకోవ‌డానికే చాలా టైమ్ పడుతుంది.  సహనంగా ఆలోచించాకే రియాక్ట్ అవ్వగలం.

ఇక  ఘటన  జరిగిన వెంటనే ఏ మహిళ బయటికి చెప్పుకోలేదు. అది అందరు అర్ధం చేసుకోవాలి. ఇక ఇప్పుడెందుకు వచ్చి మాట్లాడుతున్నారు అంటే .. ఇప్పటివరకు వారు ఎంత బాధను అనుభవిస్తున్నారో  అర్ధం చేసుకోవాలి” అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం సిమ్రాన్ మాటలు  నెట్టింట  వైరల్ గా మారాయి.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×