E-Paper
Advertisement

Singer Mano: సింగర్ మనో కొడుకులపై కేసు.. షాకింగ్ నిజాలు వెలుగులోకి

Singer Mano: సింగర్ మనో కొడుకులపై కేసు.. షాకింగ్ నిజాలు వెలుగులోకి
Advertisement

Singer Mano: సింగర్ మనో కొడుకులపై కేసు నమోదు అయిన విషయం తెల్సిందే. చెన్నై ఆలప్పాక్కంకి  చెందిన 20 ఏళ్ల కృపాకరన్‌ , మదురవాయల్‌కు చెందిన 16 ఏళ్ల కాలేజీ విద్యార్థి వళసరవాక్కం శ్రీదేవి కుప్పంలోని ఫుట్‌బాల్‌ అకాడమీలో శిక్షణ తీసుకొని ఇంటికి వస్తుండగా.. మనో కుమారులు అయిన షకీర్, రఫీ  మద్యం మత్తులో వారితో గొడవపడ్డారు. ఆ గొడవ మరింత ముదిరి.. ఒకరిపై ఒకరు దాడికి పాల్పడ్డారు.

ఆ ఇద్దరు కుర్రాళ్లను.. షకీర్, రఫీ తో పాటు వారి ఫ్రెండ్స్ అయిన మరో ముగ్గురు చితకబాదారు. ఈ దాడిలో కృపాకరన్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న  పోలీసులు  రఫీ, షకీర్‌.. వారి స్నేహితులు విఘ్నేష్‌, ధర్మ, జహీర్‌పై కేసు నమోదు చేశారు. ఇక ఈ కేసు తరువాత మనో కుమారులు ఇద్దరు పరారీలో ఉన్నారు.

Advertisement

తాజాగా నేడు  ఆ ఇద్దరినీ పోలీసులు అరెస్ట్  చేసారు.  అయితే ఈ గొడవకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ పోలీసులకు దొరికింది. ఇందులో  4 ద్విచక్ర వాహనాలపై వచ్చిన 10 మందికి పైగా వ్యక్తులు   రఫి, షకీర్‌ పై దాడికి పాల్పడుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. మనో ఇద్దరు కుమారులపై 16 ఏళ్ల బాలుడితో సహా 8 మంది వ్యక్తులు రాళ్లు, కర్రలతో దాడి చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

ఇక ఈ వీడియో ఆధారంగా రఫీ, షకీర్‌ ఈ దాడికి పాల్పడలేదని తెలుస్తోంది. ఇదే విషయాన్నీ మనో భార్య తెలిపింది. తన కొడుకులు ఈ దాడి చేయలేదని, ఈ కేసు వెనుక  పెద్ద కుట్ర జరుగుతుందని ఆమె వాపోయింది. అసలు ఈ దాడి వెనుక ఉన్నది ఎవరు.. ? ఎందుకు ఇదంతా చేస్తున్నారు.. ? మొన్నటికి మొన్న మనో కుమారులే దాడి చేశారు అని కేసు పెట్టారు. ఇప్పుడు  విజువల్స్ లో వారినే కొడుతున్నట్లు కనిపిస్తుంది. తాము తప్పు చేయలేదు అన్నప్పుడు  రఫి, షకీర్‌ ఎందుకు పరారు అయ్యినట్లు అని  నెటిజన్స్ అనుమానిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉన్నాయి.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×