Garudan: ఇండస్ట్రీలో రీమేక్స్ కొత్తేమి కాదు. ఒక భాషలో హిట్ అయిన సినిమాను ఇంకో భాషలో రీమేక్ చేసి విజయాలను అందుకుంటున్నారు మేకర్స్. కథ నచ్చితే ఆదరిస్తున్నారు.. లేకపోతే విమర్శిస్తున్నారు ప్రేక్షకులు. అయినా రీమేక్స్ మాత్రం ఆగడం లేదు. తాజాగా మరో రీమేక్ పై టాలీవుడ్ హీరోలు కన్నేశారు. అదే గరుడన్.
కోలీవుడ్ కమెడియన్ సూరి, శశి కుమార్ , ఉన్ని ముకుందన్ హీరోలుగా ఆర్ ఎస్ దురై సెంథిల్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ ఏడాది మేలో రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమాను తెలుగులో విజయ్ కనకమేడల తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా కోసం టాలీవుడ్ కుర్రహీరోలను సెలెక్ట్ చేసిన విధానం మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి.
Comedian Ali: సండే గర్ల్ ఫ్రెండ్ అంటున్న ఆలీ
బెల్లంకొండ శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ హీరోలుగా నటిస్తుండగా.. స్టార్ డైరెక్టర్ శంకర్ ముద్దుల తనయ అదితి శంకర్ హీరోయిన్ గా తెలుగుతెరకు పరిచయం కానుంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఈ కథకు తగ్గట్టే దర్శకుడు ఈ ముగ్గురు హీరోలను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. గరుడన్ ముగ్గురు స్నేహితుల కథ.
సొక్క (సూరి), కరుణ (ఉన్ని ముకుందన్), ఆది (శశికుమార్) ముగ్గురు స్నేహితులు. హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్న వీరి జీవితాల్లోకి ఒక మినిస్టర్ వస్తాడు. చెన్నై సిటీ మధ్యలో ఉన్న కోట్ల విలువైన భూమిని తన సొంతం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. అతని ఆశను ఈ ముగ్గురు స్నేహితులు ఎలా నాశనం చేశారు. అందుకు అతడు పగ ఎలా తీర్చుకున్నాడు అనేది కథ.
Bigg Boss: ఒక హోస్ట్ కు రూ. 350 కోట్లా.. ఈ రికార్డ్ ను కొట్టే మొనగాడే లేడు
తెలుగులో ఈ ముగ్గురు హీరోలకు సినిమాలు లేవు. విజయాలు లేవు. అప్పుడెప్పుడో బెల్లంకొండ సాయి శ్రీనివాస్.. ఛత్రపతి హిందీ రీమేక్ లో కనిపించాడు. ఇప్పటివరకు పత్తా లేడు. ఇక మంచు మనోజ్ కుటుంబ సమస్యల వలన సినిమాలకు గ్యాప్ ఇచ్చాడు. పెళ్లి తరువాత ఇప్పుడిప్పుడే అవకాశాలను అందుకుంటున్నాడు. అందులో ఇది ఒకటి. ఇక నారా రోహిత్ కూడా ఇప్పుడిప్పుడే గాడిన పడుతున్నాడు. మరి ఈ ముగ్గురు హీరోలకు ఈ రీమేక్ ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.