BigTV English

Singer P.Susheela: ప్రముఖ గాయనికి అస్వస్థత.. ఆందోళనలో సినీ ప్రముఖులు

Singer P.Susheela: ప్రముఖ గాయనికి అస్వస్థత.. ఆందోళనలో సినీ ప్రముఖులు

Singer P Susheela Admitted to Hospital: ప్రముఖ గాయని పి.సుశీల స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమెను వెంటనే చెన్నై‌లోని మైలాపూర్ కావేరి ఆస్పత్రికి తరలించి మెరుగైన చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. గత కొంతకాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ తరుణంలో విపరీతమైన కడుపునొప్పి రావడంతో వెంటనే ఆస్పత్రికి తరలించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమె ఆరోగ్యం విషయంపై సినీవర్గాల ప్రముఖులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


కాగా, సుశీల..1950 నుంచి 1990 వరకు దక్షిణ భారతదేశంలో ప్రఖ్యాత గాయనిగా ఎదిగారు. ఎన్నో విజయాలు అందుకుని అభిమానుల్లో తిరుగులేని చోటు సంపాదించుకున్నారు. భారతీయ సినిమా రంగంలో తనదైన ముద్ర వేశారు. తెలుగు, తమిళ్, కన్నడ, మళయాళం వంటి భాషల్లో ఆమె తకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. సినిమా పరిశ్రమంలో సుశీల సేవలకు గుర్తింపుగా కేంద్రం ప్రభుత్వం ఆమెను 2008లో పద్మభూషణ్ అవార్డుతో సత్కరించింది. దీంతో పాటు ఆమె మరో ఐదు జాతీయ పురస్కారాలు అందుకున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరానికి చెందిన 86 ఏళ్ల సుశీల.. వయోభారంతో గత కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నారు. అయితే  సుశీల తెలుగులోనూ ఎన్నో అద్భుత గీతాలు ఆలపించారు. ఈ పాటలు యువతతోపాటు అందరినీ ఉర్రూతలూగించారు. తెలుగుతోపాటు తమిళ, కన్నడ, హిందీ, మలయాళం భాషల్లో మొత్తం 50వేలకు పైగా పాటలు పాడారు. సంగీత ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న అతికొద్ది మందిలో సుశీల కూడా ఒకరుగా గుర్తింపు పొందారు.


Also Read: ఇండస్ట్రీని షేక్ చేసిన ఈ డైరెక్టర్ ను గుర్తుపట్టండి చూద్దాం..

ఇక, సినమాల్లో సావిత్రి, పద్మిని, సరోజాదేవి వంటి దిగ్గజ నటీమణలకు సైతం ఈమె పాటలు పాడారు. ఉష్రేష్ మన్మాన్ మూవీలోని ‘లైక్ పాల్’ అనే పాటకు ఆమె మొదటిసారిగా ఉత్తమ ప్లే బ్యాక్ సింగర్‌గా జాతీయ అవార్డు గెలుచుకున్నారు. గత కొంతకాలంగా ఆమె వయసు భారం కారణంగా పాటలు పాడడం లేదు. కేవలం ఇంటికే పరిమితమయ్యారు. తాజాగా, అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నా సుశీల.. త్వరగా కోలుకోవాలని అభిమానులు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×