Singer Sunitha:సింగర్ సునీత (Singer Sunitha).. తన గాత్రంతో శ్రోతలను అలరించడమే కాదు అంద చందాలతో ఆడియన్స్ ని ఆకట్టుకుంటూ ఉంటుంది. తెర వెనుకే ఉంటూ తన స్వరంతో ఎంతోమంది హీరోయిన్స్ క్యారెక్టర్లకి జీవం పోసింది. అలా ఒకవైపు సింగర్ గా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా మంచి పేరు దక్కించుకున్న సునీతకు హీరోయిన్ గా కూడా అవకాశాలు వచ్చాయి. కానీ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని స్టార్ డైరెక్టర్ల ఆఫర్లను కూడా సున్నితంగా తిరస్కరించింది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ నిత్యం ఏదో ఒక ఫోటో షేర్ చేస్తూ అభిమానులకు చేరువలో ఉంటుంది. ఇదిలా ఉండగా సునీత జీవితం అందరికీ తెరిచిన పుస్తకమే. సినిమా ఇండస్ట్రీలోకి రావాలనుకున్న సునీత 15 ఏళ్లకే సంగీతం నేర్చుకోవడం ఆరంభించింది.
విడాకుల తర్వాతే అసలు కష్టాలు..
గొప్ప సింగర్ అవ్వాలనుకున్న ఆమె.. ఇండస్ట్రీలో తనతో పాటు పనిచేసే కిరణ్ అనే వ్యక్తిని ప్రేమించి, పెద్దలను ఎదిరించి మరీ వివాహం చేసుకుంది. దాంతో సొంత కుటుంబానికి దూరమయింది సునీత. ఆ తర్వాత ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చిన తర్వాత.. భర్త నిజస్వరూపం తెలుసుకుని అతడిని కూడా దూరం పెట్టేసింది. ఆ తర్వాతే అసలు కష్టాలు మొదలయ్యాయి. పిల్లలను పోషించడం కోసం సింగర్ గా ఆమె ఇబ్బందులు పడింది. డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా పనిచేసింది. అదే సమయంలో కొన్ని మానవ మృగాల చూపులు మరింత ఇబ్బంది పెట్టాయి. ఒంటరిగా, ధైర్యంగా బ్రతకాలనుకున్నా.. ఆమెను బ్రతకనివ్వలేదు. ఎన్నో విమర్శలు వచ్చాయి. తన పని తాను చేసుకున్నా సరే.. కొంతమంది ఓర్వలేక ఆమెపై తప్పుడు రూమర్స్ సృష్టించారు. అలా ఒకానొక సమయంలో ఆ బాధలు భరించలేక ఆత్మహత్య కూడా చేసుకోవాలనుకుందట సునీత. ఇక తాను మరణిస్తే తన పిల్లల భవిష్యత్తు ఏంటి? అని ఆలోచించిన ఆమె, ఆ పిల్లల కోసం చావాలనే ఆలోచనను విరమించుకున్నట్లు సమాచారం. ఇకపోతే పిల్లలను పెద్దవాళ్ళను చేసింది. ఆ పిల్లలే తన తల్లికి తోడు కావాలని ఆలోచించి, సునీత స్నేహితుడు మ్యాంగో వీడియో అధినేత రామ్ వీరపనేని (Ram Veerapaneni) తో ఆమె వివాహం జరిపించారు. ఇకపోతే రెండవ వివాహం అనంతరం ఒక ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. గతంలో సింగర్ ఉష (Singer Usha)తో సునీతకి విభేదాలు ఉన్నాయంటూ వచ్చిన వార్తల పై క్లారిటీ ఇచ్చింది సునీత
విభేదాలు నిజమే.. క్లారిటీ ఇచ్చిన సునీత.
విభేదాలపై సునీత మాట్లాడుతూ.. సాధారణంగా నేను ఎవరితో కూడా విభేదించాలని అనుకోను.. ఒకరి ఎదుగుదలను చూసి జలసీ ఫీలవ్వను.అలాంటిది నాపై చాలామంది ఎన్నో తప్పుడు రూమర్స్ క్రియేట్ చేశారు. అందులో ఒకటి ఉషా ఎదుగుదలను చూసి నేను తట్టుకోలేక పోతున్నానని, అందుకే ఉష నాతో విభేదాలకు దిగింది అంటూ వార్తలు వచ్చాయి. కానీ నాకే గనుక జలసీ ఉండి ఉంటే, ఇప్పటికింకా నేను ఈ ప్రపంచంలో ఉండేదాన్ని కాదు. ముఖ్యంగా నాకు ఎవరి మీద జలసీ లేదు. ఏ వివాదాన్ని కూడా నేను పట్టించుకోను. ముఖ్యంగా ఎవరితో కూడా నాకు విభేదాలు లేవు” అంటూ క్లారిటీ ఇచ్చింది సునీత. మొత్తానికి అయితే ఉషతో విభేదాలు అంటూ వచ్చిన వార్తలకు చెక్ పెట్టింది సునీత.