Hyderabad Formula E Race Case: ఎట్టకేలకు ఫార్ములా ఈ కారు రేసు వ్యవహారంపై ఎన్‌ఫోర్స్ డైరెక్టరేట్ దృష్టి సారించింది. ఈ కేసుకు సంబందించి డీటేల్స్‌ను ఏసీబీ నుంచి తీసుకుంది. కేసు నమోదు చేసిన నుంచి ఇప్పటివరకు సేకరించిన ఆధారాలన్నింటినీ అందజేసింది.
ఆర్థిక శాఖ రికార్డ్స్, హెచ్ఎండీఏ చెల్లింపుల వివరాలు, కంపెనీతో చేసుకున్న ఒప్పంద పత్రాలతోపాటు ఎఫ్ఐఆర్ కాపీని ఈడీకి అందజేసింది. పత్రాలను స్టడీ చేసిన తర్వాత నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమవుతోంది ఈడీ.
మరోవైపు ఫార్ములా ఈ కారు రేసింగ్ వ్యవహారంపై హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసింది. కౌంటర్‌లో కీలక అంశాలను ప్రస్తావన చేసింది ఏసీబీ. ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగించడంతో పాటు నేరపూరిత దుష్ప్రవర్తనకు కేటీఆర్ పాల్పడ్డాడని పేర్కొంది. కేబినెట్ నిర్ణయం, ఆర్థిక శాఖ అనుమతి లేకుండానే చెల్లింపులు చేయాలని అధికారులపై కేటీఆర్ ఒత్తిడి చేసినట్టు ప్రస్తావించింది.
అనుమతులు లేకుండా విదేశీ సంస్థకు 55 కోట్లు బదిలీ చేశారని, దీనివల్ల హెచ్ఎండిఏ కు 8 కోట్లు అదనపు భారం పడినట్టు ప్రస్తావించింది. అసంబద్ధమైన కారణాలు చూపి కేసును కొట్టివేయాలని అడగడం దర్యాప్తును అడ్డుకోవడమేనని పేర్కొంది. కేటీఆర్ వేసిన పిటిషన్‌కు విచారణ అర్హత లేదని ఏసీబీ కౌంటర్ దాఖలు చేసింది.
ALSO READ: ధరణి ప్లేస్‌లో భూ భారతి పోర్టల్.. జనవరి ఒకటి నుంచి సేవలు, కదలనున్న డొంక
అనుమతి పొందిన తర్వాతే కేటీఆర్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేశామని తెలిపిన ఏసీబీ, రాజకీయ కక్ష, అధికారులపై ఒత్తిళ్లతో కేసు నమోదు చేశామనడం సరైనది కాదని ప్రస్తావించింది. ఫార్ములా రేసు వ్యవహరంలో మున్సిపల్ శాఖ ఒప్పందాలు కుదుర్చుకున్నప్పుడు బిజినెస్ రూల్స్‌ను ఎందుకు ఉల్లంఘించారని అందులో వెల్లడించింది.
ఎఫ్ఈఓకు చెల్లింపులు జరపాలని స్వయంగా కేటీఆర్ చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసింది. FIR నమోదు ప్రక్రియ ఆలస్యం అయినందున కేసు కొట్టివేయాలని కోరడం సరైందని కాదని పేర్కొంది. తీవ్రమైన అభియోగాలు ఉన్నప్పుడు ప్రాథమిక విచారణ లేకుండానే కేసు నమోదు చేయవచ్చని సుప్రీంకోర్టు ఆదేశాలు ఈ సందర్భంగా ప్రస్తావించింది ఏసీబీ.