Sitara..టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు(Maheshbabu ) తొలిసారి పాన్ వరల్డ్ చిత్రం చేస్తున్నారు.సుమారు రూ.1000 కోట్ల బడ్జెట్తో ఎస్ ఎస్ ఎం బి 29 (SSMB 29) అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా (Priyanka Chopra) కీ రోల్ పోషిస్తోంది. అంతేకాదు భారీ అంచనాల మధ్య రాబోతున్న ఈ సినిమాలో మలయాళ నటుడు, దర్శకుడు అయిన పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) కూడా నటిస్తుండడంతో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్(Vijayendra Prasad) ఈ సినిమాకు కథను అందిస్తూ ఉండగా.. ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో యాక్షన్ అడ్వెంచర్ మూవీగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇకపోతే ఈ సినిమా షూటింగు ఇప్పటికే ఇండోర్ లో భాగంగా హైదరాబాదులో కాశీ సెట్ వేసి మరీ పూర్తి చేయగా .. అటు ఒడిశాలో కూడా కొన్ని ప్రాంతాలలో షూటింగ్ చేయడం జరిగింది.
జ్యువెలరీ షాప్ ఓపెనింగ్ కి హాజరైన సితార..
అంతేకాదు ప్రియాంక చోప్రా కూడా తన పార్టీ కి సంబంధించిన సన్నివేశాలను ఇటీవలే కొంతవరకు పూర్తి చేసిన విషయం తెలిసిందే. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అప్పుడప్పుడు మహేష్ బాబు షూటింగ్ స్పాట్లో ఉన్న కొన్ని ఫోటోలు, వీడియోలు లీక్ అయ్యాయి. కానీ అధికారికంగా అప్డేట్ మాత్రం వదలలేదు. దీంతో అప్డేట్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా సితార ఒక జ్యువెలరీ షాప్ ఓపెనింగ్ కి రాగా.. అక్కడ ఆమెతో ఈ సినిమా అప్డేట్ గురించి అడగగా.. అదిరిపోయే సమాధానం ఇచ్చింది సితార. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.
ఎస్ ఎస్ ఎం బి 29 అప్డేట్ పై అదిరిపోయే సమాధానం..
ఘట్టమనేని సితార (Ghattamaneni Sitara). ఇండస్ట్రీ లోకి రాక మునుపే తండ్రి సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురిగా స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకొని, అటు మంచి సేవా కార్యక్రమాలతో కూడా మరింత ఫేమస్ సొంతం చేసుకుంది ఈ చిన్నారి. ప్రస్తుతం ఏడవ తరగతి చదువుతున్న సితార అటు జ్యువెలరీ సంస్థలకు బ్రాండ్ ఎండార్స్మెంట్ గా కూడా పనిచేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా తాను బ్రాండ్ ఎండార్స్మెంట్ చేస్తున్న ఒక జ్యువెలరీ షాప్ కొత్త బ్రాంచ్ ఓపెనింగ్ కి తల్లి నమ్రత(Namrata Shirodkar) తో కలిసి హాజరయ్యింది. షాపు ఓపెనింగ్ అనంతరం నమ్రతా, సితార మీడియాతో ముచ్చటించి పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఈ సందర్భంగా నమ్రత,సితారా లను ఎస్ ఎస్ ఎం బి 29 గురించి ఏదైనా అప్డేట్ తెలిస్తే చెప్పమని కోరగా.. దానికి సితార’ సైలెన్స్ ఇస్ ద బెస్ట్ పాలసీ ” అంటూ ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండా తెలివిగా ఎస్కేప్ అయింది. మొత్తానికైతే ఎస్ ఎస్ ఎం బి 29 అప్డేట్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు మళ్లీ నిరాశే మిగిలిందని చెప్పవచ్చు. ఇకపోతే బ్రాండ్ ఎండార్స్మెంట్స్ చేయడం వల్ల సంపాదించే డబ్బు మొత్తాన్ని సేవా కార్యక్రమాలకే వాడుతున్నానని సితార గతంలో చెప్పిన విషయం తెలిసిందే. ఇక పీఎంజే కోసం మరొకసారి తన తండ్రి మహేష్ బాబుతో కలిసి యాడ్ చేస్తున్నట్టు సితార తెలిపింది. ఏది ఏమైనా సినిమాల్లోకి రాకముందే భారీ క్రేజ్ సొంతం చేసుకుంది ఈ స్టార్ కిడ్.