Recharge Offer: భారత ప్రభుత్వ టెలికాం సంస్థ BSNL మళ్లీ తన దూకుడు చూపిస్తోంది. 2024 జూలై నుంచి తిరిగి బలపడిన ఈ సంస్థ, వినియోగదారులను ఆకట్టుకునేందుకు అనేక ఆఫర్లను ప్రకటిస్తోంది. వరుస రీఛార్జ్ ప్లాన్లు, ఆఫర్లను విడుదల చేస్తూ, ప్రైవేట్ టెలికాం కంపెనీల మధ్య పోటీని మరింత పెంచుతోంది. ఇటీవల BSNL ప్రకటించిన రూ. 251 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ టెలికాం మార్కెట్లో సంచలనంగా మారింది. ముఖ్యంగా ఇంటర్నెట్ వినియోగదారులు, OTT స్ట్రీమింగ్ ప్రియులకు ఈ ప్లాన్ బెస్ట్ అని చెప్పవచ్చు.
ఈ ఫ్యాన్స్‌కు అదిరిపోయే ఆఫర్!
BSNL ఈ కొత్త రీఛార్జ్ ప్లాన్ ప్రత్యేకంగా క్రికెట్ అభిమానుల కోసం రూపొందించింది. ఐపీఎల్ సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని తీసుకొచ్చిన ఈ ప్లాన్, భారీ డేటా ప్రయోజనాలతో వినియోగదారులకు అద్భుతమైన అనుభూతిని అందించనుంది. రూ. 251 ప్రీపెయిడ్ ప్లాన్ వినియోగదారులకు 60 రోజుల వ్యాలిడిటీతో 251GB హై స్పీడ్ డేటాను అందిస్తోంది. డేటా వినియోగదారులు ఈ ప్లాన్ ద్వారా ఎలాంటి ఖర్చులు లేకుండా తమ అభిమాన IPL మ్యాచ్‌లను లైవ్ స్ట్రీమ్ చేయవచ్చు.
రూ. 251 ప్లాన్ ముఖ్యమైన వివరాలు:
-ప్లాన్ విలువ: రూ. 251
-వాలిడిటీ: 60 రోజులు
-మొత్తం డేటా: 251GB హై స్పీడ్ డేటా (రోజువారీ పరిమితి లేదు)
-కాలింగ్ & SMS: ఈ ప్లాన్‌లో కాలింగ్ లేదా SMS సేవలు అందుబాటులో లేవు
Read Also: Ugadi Offer: రూ.16500కే ప్రీమియం ఫీచర్లతో డెల్ ల్యాప్‌టాప్. .
ఈ ప్లాన్ ఎవరికి ఎక్కువ ఉపయోగం..
ఈ ప్లాన్ ముఖ్యంగా ఇంటర్నెట్ ఎక్కువగా ఉపయోగించే వినియోగదారులకు, IPL లైవ్ స్ట్రీమింగ్ చూసే వారికి, OTT ప్లాట్‌ఫామ్స్ ఎక్కువగా వినియోగించే వారికి, గేమింగ్ ప్రియులకు చాలా అనుకూలంగా ఉంటుంది. BSNL అధికారిక వెబ్‌సైట్ లేదా BSNL సెల్ఫ్ కేర్ యాప్ ద్వారా రీఛార్జ్ చేయవచ్చు.
ప్రైవేట్ టెలికాం సంస్థలకు గట్టి పోటీ ఇస్తుందా?
BSNL 2024లో తిరిగి బలపడిన తర్వాత వరుస కొత్త ప్లాన్లు, మెరుగైన నెట్‌వర్క్ అందిస్తూ, ప్రైవేట్ టెలికాం సంస్థలకు గట్టి పోటీ ఇస్తోంది. Jio, Airtel, Vi వంటి కంపెనీలు ఇప్పుడు BSNL ఇచ్చిన కొత్త డేటా ప్లాన్‌తో సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. ప్రస్తుతమున్న ప్రైవేట్ టెలికాం కంపెనీల డేటా ప్లాన్లు తక్కువ GB డేటాతో ఎక్కువ ఖర్చుతో ఉన్నాయి. కానీ BSNL రూ. 251 ప్లాన్ తక్కువ ధరకు భారీ డేటా అందించడం టెలికాం మార్కెట్లో ఒక కొత్త ట్రెండ్‌ను సృష్టిస్తోంది.
BSNL సేవలను మెరుగుపరుస్తుందా
BSNL 4G, 5G సేవల అమలుపై దృష్టి పెట్టింది. 2024 నుంచి తన నెట్‌వర్క్‌ను మెరుగుపరచేందుకు భారీగా పెట్టుబడులు పెట్టింది. కొత్తగా ప్రవేశపెట్టిన 4G సేవలు, నెమ్మదిగా దేశవ్యాప్తంగా విస్తరిస్తున్నాయి. వచ్చే జూన్ నుంచి 5G సేవలను కూడా ప్రారంభించనున్నట్లు BSNL అధికారికంగా ప్రకటించింది. ఇదే విషయాన్ని ఇటీవల కేంద్ర మంత్రి సైతం ప్రకటించారు. ఈ క్రమంలో BSNL నిరంతరం వినియోగదారుల కోసం కొత్త ఆఫర్లు అందిస్తూ టెలికాం రంగంలో తన స్థానాన్ని బలపరుచుకుంటోంది.