Sitara Ghattamaneni:సితార ఘట్టమనేని (Sitara Ghattamaneni).. సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu), ప్రముఖ నటి నమ్రత శిరోద్కర్ (Namrata Shirodkar) దంపతులకు 2012 జూలై 20న జన్మించింది. ప్రస్తుతం ఈమె వయసు 12 సంవత్సరాలే అయినా ఇప్పటికే స్టార్ సెలబ్రిటీ రేంజ్ లో పాపులారిటీ సొంతం చేసుకుంది అని చెప్పవచ్చు. సాధారణంగా సెలబ్రిటీల పిల్లలకు ఇండస్ట్రీలో ఒక మోస్తారుగా గుర్తింపు ఉంటుంది. కానీ సితార మాత్రం అతి చిన్న వయసులోనే తనకంటూ సొంత ఇమేజ్ క్రియేట్ చేసుకుందని చెప్పవచ్చు. ఇప్పటికే సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈమె.. తన తండ్రి మహేష్ బాబు(Maheshbabu )2022లో నటించిన ‘సర్కారు వారి పాట’ సినిమాలోని ‘పెన్ని’ అనే పాటలో తన అద్భుతమైన డాన్స్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకుంది. ఇక ఈ పాట ఆ తర్వాత సోషల్ మీడియాలో ఎంత ట్రెండ్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
డాన్సర్ మాత్రమే కాదు డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా..
ఇకపోతే సితార బెస్ట్ డాన్సర్ మాత్రమే కాదు డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా పనిచేసింది. డిస్నీ ‘ఫ్రోజెన్ 2’ తెలుగు వెర్షన్ లో బేబీ ఎల్సా కి డబ్బింగ్ చెప్పి డబ్బింగ్ ఆర్టిస్టుగా పేరు సొంతం చేసుకుంది. ఇక ఈమె కూచిపూడి నృత్యకారిణి మాత్రమే కాదు బ్యాలెట్ లో కూడా శిక్షణ తీసుకుంది. అంతేకాదు అతి చిన్న వయసులోనే జ్యూవెలరీ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న సితార.. తనకు ఈ బ్రాండ్ ప్రమోషన్ ద్వారా వచ్చిన మొదటి సంపాదనను ఛారిటీ ట్రస్ట్ కు అందజేసి తన గొప్ప మనసును చాటుకుంది. ఇక ఇప్పుడు నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఫ్యాషన్ సెన్స్ కి పెద్ద పీట వేసిన ఈమె.. తన రకరకాల దుస్తులతో అందరినీ ఆకట్టుకుంటూ ఉంటుంది. ఒక రకంగా చెప్పాలి అంటే మోడల్గా కూడా పేరు సొంతం చేసుకుంది సితార.
ALSO READ:Ram Charan: అనారోగ్యంతో కూడా అలాంటి సాహసం చేసిన ఉపాసన తల్లి.. గ్రేట్ మేడమ్!
సితారాలో ఈ టాలెంట్ కూడా ఉందా?
ప్రస్తుతం సితార హైదరాబాదులోని CHIREC ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుకుంటున్నట్లు సమాచారం. ఇక ఈమె పెద్దయ్యాక తన తల్లిదండ్రుల అడుగుజాడల్లోనే నటిగా మారడానికి ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా తనకు సంబంధించిన విషయాలు, వెకేషన్స్ కి సంబంధించిన విషయాలను సోషల్ మీడియాలో షేర్ చేసే సితార.. తాజాగా మరో ఇంస్టాగ్రామ్ పోస్ట్ పంచుకుంది. ఇక ఈ పోస్ట్ చూసి అభిమానులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సితారాలో ఇంత టాలెంట్ ఉందా అంటూ కామెంట్లు చేస్తున్నారు.
అసలు విషయంలోకి వెళ్తే.. సితార ఇక్కడ తన స్నేహితులతో కలిసి కెమెరామెన్ గా మారిపోయింది. అద్దం ముందు నలుగురు స్నేహితులతో కెమెరా లోనే ఫోటోలు క్యాప్చర్ చేసింది. అంతేకాదు తాను క్యాప్చర్ చేసిన ఫోటోల రీల్స్ కూడా పంచుకుంది. ఇక ఈ పోస్ట్ చూసి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమ అభిమాన హీరో కూతురుకి ఇంత టాలెంట్ ఉందా అంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి అయితే సితార ఆల్రౌండర్ అనిపించుకుంటోందని చెప్పవచ్చు.