BigTV English

Phone Tapping Case Update: ఇండియాకు రాని ప్రభాకర్ రావు.. విచారణకు హాజరవుతారా..?

Phone Tapping Case Update: ఇండియాకు రాని ప్రభాకర్ రావు.. విచారణకు హాజరవుతారా..?

Phone Tapping Case Update: తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక విచారణకు పోలీసులు సిద్ధమయ్యారు. కోర్టు ఆదేశాల ప్రకారం.. గురువారం పోలీసుల ముందు విచారణకు.. ప్రభాకర్ రావు హాజరుకావాల్సి ఉంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో.. ఆయనే కీలక నిందితుడిగా ఉన్నారు. కేసు నమోదైన తర్వాత.. ప్రభాకర్ రావు అమెరికా పారిపోయారు.


ఇండియాకు ఇంకా చేరుకోని ప్రభాకర్ రావు..

14 నెలలుగా అమెరికాలోనే ఉంటున్న ప్రభాకర్ రావు.. ఇంకా భారత్ తిరిగి రాలేదని తెలుస్తోంది. ఇండియా రావడానికి మరింత సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. వన్ టైమ్ ట్రావెలింగ్ వీసా ఇంకా తీసుకోలేదని తెలుస్తోంది. ట్రావెలింగ్ వీసా తీసుకున్న 3 రోజుల్లో ఇండియాకు రావాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రభాకర్ రావుకి వన్ టైం ఎంట్రీ ట్రావెలింగ్ వీసా ఇవ్వాలని సంబంధించిన అధికారులకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇతర దేశాలకు వెళ్లొద్దని కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రభాకర్ రావును విచారిస్తే ఫోన్ ట్యాపింగ్ కేసు ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో విచారణకు అనేక ఆటంకాలు ఎదురౌతున్నాయి.


ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రభాకర్‌రావు

బీఆర్ఎస్ హయాంలో SIB కేంద్రంగా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని పంజాగుట్ట పోలీసులు 2024, మార్చి 10న కేసు నమోదు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు ప్రభాకర్‌రావే. ముందస్తు బెయిల్ మంజూరు చేస్తే భారత్‌కు తిరిగి వస్తానని గతంలో హైకోర్టును ఆశ్రయించారు ప్రభాకర్‌రావు. కానీ.. ఆ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. హైకోర్టు తీర్పును సుప్రీం కోర్టులో సవాల్ చేశారాయన. సుప్రీం కోర్టు ఆదేశాలతో విచారణకు హాజరవుతున్నారు.

ట్యాపింగ్‌ వెనకున్న పెద్దల పేర్లు బయటకు వస్తాయా..?

ప్రభాకర్‌రావును ప్రశ్నించేందుకు సిట్ అధికారులు సిద్ధమవుతున్నారు. ఏ ప్రశ్నలు అడగాలి.. ఆయన నుంచి ఎలాంటి సమాచారం సేకరించాలనే అంశంపై దృష్టిపెట్టారు. ట్యాపింగ్ కేసులో పోలీసు అధికారులు, ప్రైవేట్ వ్యక్తి శ్రవణ్‌రావు మధ్య లింక్ ఎలా కుదిరింది..? ఎవరి ఆదేశాలతో ఫోన్లను ట్యాప్ చేశారు..? ఆ సమాచారాన్ని ఎవరెవరికి చేరవేశారు..? అన్న ప్రశ్నలు సంధించే అవకాశం ఉంది. ఫోన్ ట్యాపింగ్ నిబంధనలను పాటించారా..? హార్డ్‌డిస్క్‌లను ఎందుకు ధ్వంసం చేశారు..? ఎవరి ఆదేశాలతో వాటిని నాశనం చేశారు..? అన్న క్వశ్చన్స్‌ వేసే అవకాశం ఉంది. ఇప్పటివరకు అరెస్ట్‌ అయిన వారి వాంగ్మూలాల ఆధారంగా ప్రభాకర్‌రావుపై సిట్ అధికారులు ప్రశ్నలు సంధించబోతున్నారు.

ప్రభాకర్‌రావు ఇచ్చే సమాచారంపై ఉత్కంఠ

ప్రభాకర్‌రావు ఎవరి ఆదేశాలతో ట్యాపింగ్ చేశారన్నదే కీలకం. గత ప్రభుత్వ పెద్దల ఆదేశాలతోనే ట్యాపింగ్ చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. అయితే వారి పేర్లను బయటపెడతారా..? ఏదైనా మెలిక పెట్టి దాట వేస్తారా..? అన్నది ఆసక్తికరంగా మారింది. అయితే అన్ని ఆధారాలు మందు పెట్టి.. ప్రభాకర్‌రావును సిట్‌ అధికారులు ప్రశ్నించే ఆవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రభాకర్‌రావు అబద్దాలు చెప్పినా.. డొంక తిరుగుడు సమాధానాలు చెప్పినా.. అడ్డంగా దొరికిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.

ఫోన్ ట్యాపింగ్‌పై కీలక ఆరోపణలు చేశారు రేవంత్‌రెడ్డి

పీసీసీ చీఫ్‌గా ఉన్న సమయంలో ఫోన్ ట్యాపింగ్‌పై కీలక ఆరోపణలు చేశారు రేవంత్‌రెడ్డి. తమ ఫోన్లను ట్యాప్‌ చేస్తున్నారని.. ఇబ్బందులకు గురిచేస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. హార్డ్‌డిస్క్‌లు మాయం కావడంతో ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకుంది ప్రభుత్వం. విచారణకు ఆదేశించింది. కేవలం ప్రతిపక్షంలోని వారి ఫోన్లను మాత్రమే ట్యాప్ చేశారా..? లేక రిటైర్డ్ జడ్జ్‌ల ఫోన్లను కూడా ట్యాప్ చేశారా..? అన్న అనుమానాలు ఉన్నాయి. అసలు ఎందుకిలా ట్యాప్ చేయాల్సి వచ్చిందన్నది కూడా విచారణలో బయటపడే అవకాశముంది.

Also Read: కూకట్‌పల్లి డ్రగ్స్ కేసులో కొత్త కోణం.. ఇద్దరు ఏపీ పోలీసులు అరెస్ట్

ప్రభాకర్‌రావు నోరు విప్పుతాడా..? ప్రీప్లాన్‌గా వ్యవహరిస్తారా..?

సిట్‌ విచారణలో ప్రభాకర్‌రావు నోరు విప్పుతాడా..? ప్రీప్లాన్‌గా వ్యవహరిస్తారా..? ఆయన నిజాలు చెప్తే.. గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన చాలా మంది పెద్దల పేర్లు బయటకు వచ్చే అవకాశాలున్నాయి. ఇప్పుడు వారంరిలోనూ ఆందోళన మొదలైంది. మరోవైపు ప్రభుత్వం ప్రభాకర్‌రావుకు భారీ బందోబస్తు ఏర్పాటు చేయాలని భావిస్తోంది.

 

 

Related News

Hyderabad Rains: సాయంత్రం అయితే చాలు..ఒకటే కుమ్ముడు, మళ్లీ తడిచి ముద్దైన భాగ్యనగరం

Rakhi Festival: తమ్ముడికి రాఖీ కట్టేందుకు సాహసం చేసిన అక్క.. 20 అడుగుల ఎత్తున్న రైల్వే బ్రిడ్జి గోడపై నుంచి..?

MLA Mallareddy: రాజకీయాలకు గుడ్ బై.. బిగ్ బాంబ్ పేల్చేసిన మల్లారెడ్డి.. అసలేమైంది..?

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ ప్రాంతాల్లో కుండపోత వాన.. ఇంట్లోనే ఉండండి..

Bandi Sanjay: కేటీఆర్ కు ఉన్న అతి తెలివి నాకెక్కడ? – బండి సంజయ్

Hyderabad floods: హైదరాబాద్‌ ఇక మునగదు.. సీఎం రేవంత్ రెడ్డి అదిరి పోయే ప్లాన్ ఇదే!

Big Stories

×