Heart Attack CPR| ఇటీవలి కాలంలో గుండెపోటు సమస్యలతో బాధపడేవారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సమస్య వృద్ధులతో పాటు యువకుల్లోనూ కనిపించడం చాలా ఆందోళనకరం. గుండెపోటు వచ్చినప్పుడు సమస్య తీవ్రతను బట్టి క్షణాల్లో ప్రాణాలు పోవచ్చు. కొన్ని సార్లు సకాలంలో వైద్య సహాయం అందిస్తే ప్రాణాలు కాపాడవచ్చు. కార్డియోపల్మనరీ రిససిటేషన్ (Cardiopulmonary resuscitation – సిపిఆర్) అనేది ప్రాణాలు కాపాడే ఒక ముఖ్యమైన పద్ధతి. భారతదేశంలో సిపిఆర్ గురించి ప్రజలకు అవగాహన చాలా తక్కువగా ఉంది, కానీ విదేశాల్లో దీన్ని పాఠశాలల్లోనే నేర్పిస్తారు. సిపిఆర్ ద్వారా గుండె పోటు వచ్చిన రోగి శ్వాస, రక్తప్రసరణను కొనసాగించవచ్చు. దీంతో ఆసుపత్రికి చేరే వరకు సమయం సంపాదించవచ్చు. అందుకే సిపిఆర్ గురించి పూర్తిగా తెలుసుకోవడం చాలా ముఖ్యం.
సిపిఆర్ అంటే ఏమిటి?
బ్రిటిష్ హార్ట్ ఫౌండేషన్ ప్రకారం.. సిపిఆర్ అనేది గుండెపోటు లేదా గుండె ఆగిపోయినప్పుడు ప్రాణాలు కాపాడే ఒక పద్ధతి. గుండె అకస్మాత్తుగా రక్తాన్ని పంప్ చేయడం ఆపేస్తే.. సిపిఆర్ ద్వారా దాన్ని మళ్లీ పనిచేసేలా చేయవచ్చు. ఈ పద్ధతిని ఎవరైనా నేర్చుకోవచ్చు. సిపిఆర్‌లో ఛాతీపై ఒత్తిడి (చెస్ట్ కంప్రెషన్) చేస్తూ ఉండడం చాలా ముఖ్యం. ఇలా చేయడం వల్ల.. శరీరంలో రక్తప్రసరణను కొనసాగించడానికి సహాయపడుతుంది. అలాగే, గుండె సాధారణ స్థితికి వచ్చే వరకు రోగికి ఆక్సిజన్ అందించవచ్చు.
సిపిఆర్ ఎప్పుడు అవసరం?
ఒక వ్యక్తి అకస్మాత్తుగా కిందపడిపోతే, స్పందించకపోతే, శ్వాస తీసుకోలేకపోతే, నాడి ఆడడం లేదని అనిపిస్తే.. లేదా గుండెపోటు లేదా గుండె ఆగిపోయినప్పుడు సిపిఆర్ అవసరం.
సిపిఆర్ ఎన్ని రకాలు?
సిపిఆర్ రెండు రకాలుగా ఇవ్వవచ్చు. చేతులతో సిపిఆర్. నోటితో సిపిఆర్. చేతులతో సిపిఆర్‌లో రోగి ఛాతీపై చేతులతో ఒత్తిడి చేస్తారు. నోటితో సిపిఆర్‌లో రోగికి నోటి ద్వారా ఆక్సిజన్ అందిస్తారు.
సిపిఆర్ ఎలా చేయాలి?
చేతులతో సిపిఆర్ చేయడానికి, ముందుగా ఎడమ చేతిని నేరుగా చాచండి. దానిపై కుడి చేయి వేసి, కుడి చేతి వేళ్లను లోపలికి మడిచి గట్టిగా పట్టుకోండి. ఇప్పుడు రోగి ఛాతీ మధ్యలో చేతులతో గట్టిగా, ఒక లయలో, నెమ్మదిగా ప్రారంభించి వేగంగా ఒత్తిడి చేయండి. నిమిషానికి 100 నుండి 120 సార్లు ఇలా చేయాలి. ఈ ప్రక్రియను లయబద్ధంగా కొనసాగించాలి.
ఛాతీ ఒత్తిడి తర్వాత, ఫలితం లేకపోతే నోటితో సిపిఆర్ ప్రయత్నించండి. రోగికి 30 సెకన్లపాటు నిరంతరం ఊపిరి ఇవ్వాలి. అధ్యయనాల ప్రకారం.. గుండె ఆగిన 5 నిమిషాలలోపు సిపిఆర్ సరిగ్గా చేసి, ఆసుపత్రికి తీసుకెళితే ప్రాణాలు కాపాడే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
Also Read: మందులు లేకుండా షుగర్ నియంత్రణ సాధ్యమే.. ఇలా చేయండి
సిపిఆర్ నేర్చుకోవడం సులభం. దీని ద్వారా గుండె ప్రాణాలనైనా కాపాడగలదు. కాబట్టి, ఈ టెక్నిక్‌ని నేర్చుకుని, అత్యవసర సమయంలో సహాయం చేయడానికి సిద్ధంగా ఉండండి.