BigTV English
Advertisement

Sai Pallavi: అప్పుడు శర్వానంద్.. ఇప్పుడు శివకార్తికేయన్.. హీరోలను అలా అంటే ఫీల్ అవ్వరా.. ?

Sai Pallavi: అప్పుడు శర్వానంద్.. ఇప్పుడు శివకార్తికేయన్.. హీరోలను అలా అంటే ఫీల్ అవ్వరా.. ?

Sivakarthikeyan: సాధారణంగా ఒక అమ్మాయి.. అన్నయ్య అంటేనే అబ్బాయిలు తట్టుకోలేరు. అలాంటింది ఒక అందమైన అమ్మాయి.. అన్నయ్య అంటే ఎవరైనా ఫీల్ అవ్వకుండా ఉంటారా.. ? అది హీరోలు అయినా కూడా ఫీల్ అవ్వాల్సిందే. ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్ కూడా అలానే ఫీల్ అయ్యానని చెప్పుకొచ్చాడు. మరీ ఆ మాత్రం ఫీల్ లేకుండా ఎందుకు ఉంటుంది.. అక్కడ అన్నయ్య అని పిలిచింది ఎవరు.. లేడీ పవర్ స్టార్ సాయిపల్లవి.


ప్రేమమ్ సినిమాతో కెరీర్ ను మొదలుపెట్టిన ఈ చిన్నది.. ఏ సినిమా పడితే ఆ సినిమాను ఒప్పుకోకుండా తన పాత్రకు ప్రాధాన్యత ఉన్న సినిమాలను మాత్రమే ఎంచుకుంటూ.. గ్లామర్ అనే పదమే తన డిక్షనరీలో లేకుండా నటన, వ్యక్తిత్వంతోనే ప్రేక్షకులకు దగ్గరయ్యింది. ప్రస్తుతం తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో వరుస సినిమాలు చేస్తూ బిజీగా మారింది. ఇక ఆమె హీరోయిన్ గా నటించిన తమిళ్ సినిమా అమరన్ రిలీజ్ కు రెడీ  అవుతున్న విషయం తెల్సిందే.

కోలీవుడ్ స్టార్ హీరో  శివకార్తికేయన్ హీరోగా రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వం వహించిన అమరన్ సినిమాను కమల్ హాసన్.. తన సొంత బ్యానర్ అయిన రాజ్ కమల్ ఫిల్మ్స్  లో నిర్మిస్తున్నాడు. బయోగ్రాఫికల్ యాక్షన్ చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమా అక్టోబర్ 31 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజగా ఈ సినిమా ఆడియో లాంచ్ వేడుక చెన్నైలో ఘనంగా నిర్వహించారు. ఈ ఈవెంట్ లో శివ కార్తికేయన్.. సాయిపల్లవి గురించి మాట్లాడాడు.


Where Is Riya: ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్న రియా ఇక్కడ.. ఆమె బ్యాక్ గ్రౌండ్ ఇదే..?

” అమరన్ చిత్రంలో మేజర్ ముకుంద్ వరద రాజన్ పాత్రలో నటిస్తున్నాను. ఆయన పేరును మొదట వార్తల్లోవిన్నాను. ఇక డైరెక్టర్ ఈ కథ నాకు వివరించినప్పుడు ఎంతో ఎమోషనల్ అయ్యాను. ముకుంద్ గా మారడానికి నేను చాలా కష్టపడ్డాను. కాశ్మీర్ లో 100 రోజులు యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించాం. ముకుంద్ జీవితాన్ని అందరు మెచ్చుకునేలా ఈ సినిమాను తీర్చిదిద్దాం. ఈ సినిమా తరువాత ఆయన పై అందరికి మరింత గౌరవం పెరుగుతుంది. అమరన్ సినిమా కోసం ముందుగా ముకుంద్ కుటుంబాన్ని సంప్రదించినప్పుడు.. వారు అడిగింది ఒక్కట్టే. ఈ సినిమాలో హీరో ఖచ్చితంగా ఒక తమిళ హీరోనే ఉండాలి అని.. అందుకు కారణం ముకుంద్ ఎప్పుడు తమిళ్ ఇండస్ట్రీ అంటే ఇష్టం చూపించేవాడు అని చెప్పారు.

ఇక సాయిపల్లవి గురించి చెప్పాలంటే.. ఆమె ఒక గొప్ప నటి. నేను మొదటిసారి ఆమెను ఒక టీవీ ఛానెల్ లో వ్యాఖ్యాతగా పనిచేసినప్పుడు కలిసాను. ఇండస్ట్రీలో సాయిపల్లవి అనే పేరు ఒక బ్రాండ్. ప్రేమమ్ సినిమాలో ఆమె నటనకు ఫిదా అయ్యి  కాల్ చేసి చాలా బాగా చేశారు అని చెప్పా.. దానికి సాయిపల్లవి.. థాంక్స్ అన్న అంది. నేను దానికి చాలా ఫీల్ అయ్యాను. ఈ సినిమాలో సాయిపల్లవి నటనకు కూడా ఫ్యాన్స్ బాగా కనెక్ట్ అవుతారు” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం శివకార్తికేయన్ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

Nani New Movie: జానీ మాస్టర్ కేసు కథాంశంతో నాని కొత్త సినిమా.. ఏ ధైర్యంతో చేస్తున్నాడో!

సాయిపల్లవి కేవలం శివకార్తికేయన్ ను మాత్రమే అన్నయ్య అని పిలవలేదు.. పడిపడి లేచే మనసు సినిమా సమయంలో హీరో శర్వానంద్ ను కూడా అన్నయ్య అనే పిలిచిందంట. అప్పుడు శర్వా కూడా ముందు ఇలానే ఫీల్ అయ్యాడట. ఆ తరువాత వారిద్దరూ సినిమాలో ఎలా ఉన్నా.. బయట మాత్రం బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్ ను మెయింటైన్ చేసేవారట. ఈ విషయం తెలియడంతో సాయిపల్లవి అభిమానులు.. అబ్బాయిలను అంత పెద్ద మాట అనేసావ్ ఏంటి పాప అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరి ఈ సినిమాతో ఆమె ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×