BigTV English

Where Is Riya: ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్న రియా ఇక్కడ.. ఆమె బ్యాక్ గ్రౌండ్ ఇదే..?

Where Is Riya: ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్న రియా ఇక్కడ.. ఆమె బ్యాక్ గ్రౌండ్ ఇదే..?

Where Is Riya: రియా ఎక్కడ..?


రియా ఎవరు.. ?

దామిని డాటర్..


దామిని ఎవరు.. ?

రియా మదర్..

అసలు వారిద్దరూ ఎవరు.. ?

మదర్ అండ్ డాటర్..

వాళ్లెవరో నాకు తెలియదు..

ఈ డైలాగ్స్ ఎక్కడో విన్నట్లు కనిపిస్తున్నాయి కదా. గత మూడు రోజుల నుంచి ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్న ప్రశ్న. రియా.. రియా.. రియా.. అంటూ ట్విట్టర్ మొత్తం ఒకటే మోత. అసలు ఎవరీ రియా.. ? ఎందుకు ఈ పేరును అంతగా ట్రెండ్ చేస్తున్నారు.. ? అనేది తెలుసుకుందాం.

శ్రీసింహా, సత్య, ఫరియా అబ్దుల్లా ప్రధాన పాత్రల్లో రితేష్ రానా దర్శకత్వం వహించిన చిత్రం మత్తు వదలరా 2. గత నెల 13 న రిలీజ్ అయిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా  సత్య కామెడీ మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. ఇంకా చెప్పాలంటే ఈ సినిమాకు సత్యనే హీరో అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. యేసుదాసు పాత్రలో సత్య నటించాడు అనడం కన్నా జీవించాడు అని చెప్పాలి. పంచ్ లు, ప్రాసలు, డ్యాన్స్, కామెడీ మొత్తం అదరగొట్టాడు. ఒక రకంగా చెప్పాలంటే సత్య వన్ మ్యాన్ షో.

Mahesh Babu: ఫ్యాన్స్ కు ముఖం చాటేసిన మహేష్.. ఇలా అయితే ఎలా..?

ఇక ఈ సినిమా తరువాత సత్యకు మంచి గుర్తింపు వచ్చింది. మూడు రోజులుగా ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్న  రియా ఎక్కడ అనే డైలాగ్.. ఈ సినిమాలోనిదే. సత్య- అజయ్ ల మధ్య జరిగే ఈ కామెడీ సీన్.. సినిమాకే హైలైట్ గా మారింది. ఈ సినిమా మొత్తాన్ని ఒక మీమ్ మెటీరియల్ గా మార్చేసాడు రితేష్. గత  కొన్ని ఏళ్లుగా.. సోషల్ మీడియాలో ట్రెండ్ అయిన మీమ్స్ ను సైతం సినిమాలో ఎంతో జాగ్రతగా చూపించాడు.

చివరికి ఈ మధ్య టాలీవుడ్ ను షేక్ చేసిన హేమ డ్రగ్స్ కేసును కూడా ఇరికించి.. డ్రగ్స్ కేసులో ఎంతోమంది హేమాహేమిలే దొరికేశారు అనే డైలాగ్ పెట్టించాడు. అలా ఈ సినిమా ఓటీటీకి వచ్చాక.. అందులో నుంచి ఇలాంటి ఆణిముత్యాలను మీమర్స్ వెతికి వెతికి మరీ.. సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. అలా ట్రెండ్ అయిన వీడియోనే రియా ఎక్కడ.. ?. మత్తు వదలరా 2 లో రియా అనే అమ్మాయిని కిడ్నాప్ చేస్తారు. ఆమెను వెతకడానికి సత్య, శ్రీసింహా వెళ్తారు. అక్కడ నుంచి వీరిద్దరి కథ మలుపు తిరుగుతుంది.

Chiranjeevi: చిరంజీవికి అక్కగా, అమ్మగా, లవర్‌గా నటించిన ఒకేఒక్క హీరోయిన్.. ఆమె ఎవరో తెలుసా?

ఇక ఈ సీన్ చూసాకా.. అసలు రియా ఎవరు.. ? అని ఆరాలు తీస్తున్నారు. ఈ సినిమాలో రియాగా నటించిన అమ్మాయి పేరు ఇషా యాదవ్. ఆమె ఒక నార్త్ నుంచి వచ్చిన నటి. ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సెర్.  ఫ్రెండ్స్ తో కలిసి రీల్స్ చేస్తూ ఉంటుంది.  ఆమె చేసిన రీల్ ఒకటి నెట్టింట దుమారం కూడా రేపింది. అలా ఇషా..తెలుగులో సిద్దు బీకామ్ అనే షార్ట్ ఫిల్మ్ లో ఛాన్స్ పట్టేసింది. ఇక దీని తరువాత ఒక అసిస్టెంట్ డైరెక్టర్ వలన మత్తు వదలరా 2 లో ఛాన్స్ దక్కింది.

రియాగా ఆమె కనిపించింది కొద్దిసేపే అయినా.. అసలు సినిమా మొత్తం నడవడానికి కారణమయ్యే పాత్రలో కనిపించడంతో ఆమె పేరు మారుమ్రోగిపోయింది. ప్రస్తుతం  ఈ చిన్నదాని పేరు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. ఒరిజినల్ రియా ఇక్కడే అని ఆమె. ఇన్స్టాగ్రామ్ ఐడీ ని ట్యాగ్ చేస్తున్నారు. ఈ గుర్తింపుతో ఈ చిన్నదానికి మంచి అవకాశాలే వచ్చేలా ఉన్నాయని టాలీవుడ్ లో టాక్ నడుస్తోంది. మరి రియా.. ముందు ముందు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా మారుతుందేమో చూడాలి.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×