BigTV English

Nani New Movie: జానీ మాస్టర్ కేసు కథాంశంతో నాని కొత్త సినిమా.. ఏ ధైర్యంతో చేస్తున్నాడో!

Nani New Movie: జానీ మాస్టర్ కేసు కథాంశంతో నాని కొత్త సినిమా.. ఏ ధైర్యంతో చేస్తున్నాడో!

Nani New Movie: ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో అంతటా నడుస్తున్న హాట్ టాపిక్.. జానీ మాస్టర్ కేసు. అసలు జానీ మాస్టర్ నిజంగా తప్పు చేశాడా? బాధితురాలు చెప్పినవన్నీ నిజాలేనా? అనే అనుమానాలు చాలామంది ప్రేక్షకుల్లో ఉన్నా.. జానీ మాస్టర్ మాత్రం ఈ కేసులో జైలుశిక్ష అనుభవించక తప్పడం లేదు. పైగా తనపై పోక్సో కేసు ఫైల్ అవ్వడం మరొక సంచలనం. దానివల్లే అసలు జానీ మాస్టర్‌కు బెయిల్ దొరికే అవకాశాలు కూడా తక్కువ అయిపోయాయి. తాజాగా నాని అప్‌కమింగ్ మూవీ.. జానీ మాస్టర్ కేసుపై ఆధారపడి ఉంటుందని టాలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఈ సినిమా గురించి నెటిజన్లు చర్చించుకోవడం మొదలుపెట్టారు.


హీరోగా కాదు

నేచురల్ స్టార్ నాని (Nani) అంటే కేవలం హీరో మాత్రమే కాదు.. టాలెంట్ ఉన్న దర్శకులను ఇండస్ట్రీకి పరిచయం చేసే నిర్మాత కూడా. హీరోగా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా నాని.. ఎందరో కొత్త దర్శకులను ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. అప్‌కమింగ్ దర్శకులకు అవకాశాలు ఇచ్చాడు. ఎప్పుడూ కాంట్రవర్సీ సబ్జెక్ట్స్ వైపు పెద్దగా వెళ్లని నాని.. తాజాగా జానీ మాస్టర్ కేసుపై నాని సినిమా ఉండబోతుంది అనే వార్త టాలీవుడ్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది. తాను హీరోగా నటించిన ‘సరిపోదా శనివారం’ క్లీన్ హిట్ అందుకుంది. ఆ ఆనందంలో తాను నిర్మాతగా కొత్త సినిమాను అనౌన్స్ చేశాడు. ఇప్పుడు నాని నిర్మాతగా తెరకెక్కనున్న మూవీపై చర్చలు సాగుతున్నాయి.


Also Read: చిరంజీవికి అక్కగా, అమ్మగా, లవర్‌గా నటించిన ఒకేఒక్క హీరోయిన్.. ఆమె ఎవరో తెలుసా?

అదే కేసు

ప్రియదర్శి హీరోగా తాను నిర్మాతగా ‘కోర్ట్’ అనే మూవీని అనౌన్స్ చేశాడు నాని. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. అదే రోజు సినిమాకు సంబంధించిన మోషన్ పోస్టర్‌ను కూడా విడుదల చేసింది మూవీ టీమ్. ‘కోర్ట్ – స్టేట్ వర్సెస్ ఏ నోబడి’ అనే టైటిల్‌తో ఈ సినిమా సిద్ధమవుతోంది. అయితే ఒక పోక్సో కేసు చుట్టూనే ఈ సినిమా తిరుగుతుందనే వార్త బయటికొచ్చింది. ప్రస్తుతం జానీ మాస్టర్ (Jani Master) కూడా పోక్సో కేసు కిందే శిక్ష అనుభవిస్తున్నాడు. అదే సమయంలో నాని నిర్మాణంలో తెరకెక్కుతున్న ‘కోర్ట్’ మూవీ కూడా అదే కేసు చుట్టూ తిరగడం అనుకోకుండా జరిగిన విషయం కాదేమో అని ప్రేక్షకులు అనుమానిస్తున్నారు.

దర్శకులకు లైఫ్

నాని నిర్మిస్తున్న ‘కోర్ట్’ (Court) సినిమాతో రామ్ జగదీష్ అనే దర్శకుడిని టాలీవుడ్‌కు పరిచయం చేశాడు. వాల్ పోస్టర్ సినిమా అనే నిర్మాణ సంస్థను ప్రారంభించి.. ఇప్పటికే ప్రశాంత్ వర్మ, శైలేష్ కొలను లాంటి దర్శకులకు లైఫ్ ఇచ్చాడు నాని. ఇప్పుడు రామ్ జగదీష్ అనే మరొక దర్శకుడికి లైఫ్ ఇవ్వడానికి సిద్ధమయ్యాడు. మరోవైపు ప్రియదర్శి (Priyadarshe) కూడా కామెడియన్‌గా సినిమాలను పక్కన పెట్టేసి వరుసగా హీరోగానే నటిస్తూ ప్రేక్షకులను మెప్పించడానికి ట్రై చేస్తున్నాడు. ఇటీవల ‘డార్లింగ్’ అనే మూవీతో వచ్చాడు. త్వరలోనే ‘సారంగపాణి జాతకం’ అనే మరో మూవీతో సిద్ధంగా ఉన్నాడు. ప్రస్తుతం ‘కోర్ట్’ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు ప్రియదర్శి.

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×