BigTV English

Actor Vijay : వయసు రివర్స్ చేయడానికి ఆరు కోట్లు.. ఈ స్టార్ హీరో యవ్వారం మామూలుగా లేదుగా..

Actor Vijay : వయసు రివర్స్ చేయడానికి ఆరు కోట్లు.. ఈ స్టార్ హీరో యవ్వారం మామూలుగా లేదుగా..

Actor Vijay : కోలీవుడ్ సూపర్ స్టార్ విజయ్.. ఇటు టాలీవుడ్ లో కూడా మంచి బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ కలెక్షన్ల వసూళ్లు రాబడుతూ సందడి చేస్తున్నాడు. ఇటీవల లోకేష్ కనకరాజు కాంబినేషన్లో సీనియర్ హీరోయిన్ త్రిష విజయ్ నటించిన లియో చిత్రం భారీ వసూలు సొంతం చేసుకుంది. తమిళనాట భారీ వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం తెలుగులో కూడా రికార్డు స్థాయి కలెక్షన్స్ సొంతం చేసుకుంది. ఇక అదే ఊపులో వరుస క్రేజీ ప్రాజెక్ట్ తో విజయ్ బాగా బిజీగా మారిపోయాడు.


అతని నెక్స్ట్ మూవీ ప్రముఖ డైరెక్టర్ వెంకట ప్రభు దర్శకత్వంలో వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ మూవీకి సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. నెక్స్ట్ రాబోయే విజయ్ 68 వ సినిమా కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. ఇక విజయ్ కూడా దీనికి సంబంధించిన స్టోరీ ఎంతో పర్ఫెక్ట్ గా ఉండాలని ఆశించినట్లు టాక్. ఈసారి ఇతని మూవీలో చేయబోయే సరి కొత్త ప్రయోగం కోసం సుమారు 6 కోట్లు ఖర్చు పెడుతున్నారు అని సినీ నగరంలో వార్త వైరల్ అయింది.

ఈ మూవీ డైరెక్టర్ వెంకట ప్రభు విజయ్ ఈ సినిమాలో ఒక మంచి వెరైటీ గెటప్ లో ఇంతవరకు ఎప్పుడూ చూడని విధంగా కనిపించబోతున్నాడు అని పలు సందర్భాలలో చెప్పిన విషయం తెలిసిందే కదా. ఈ నేపథ్యంలో విజయ్ వయసుకు సంబంధించి ఈ సినిమాలో తీసుకుంటున్న ఒక చిన్న విషయం ప్రస్తుతం తమిళ్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.


మూవీ స్టోరీ ప్రకారం ఇందులో విజయ్ కొన్ని సన్నివేశాలలో టీనేజీ కుర్రాడి మాదిరి కనిపించాల్సి ఉంటుందట. అయితే దీని కోసం వేరే యాక్టర్ ని పెట్టకుండా విజయ్ ని టీనేజ్ వయసులో ఎలా ఉండేవాడో అలా చూపించబోతున్నారని టాక్. అయితే మేకప్ వేస్తే అది సెట్ కాదు అనే ఉద్దేశంతో లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగించి.. హాలీవుడ్ టెక్నీషియన్ సహాయంతో ఒక సరికొత్త విజువల్ అద్భుతాన్ని ఆవిష్కరించబోతున్నారని సమాచారం.

49 ఏళ్ల వయసు ఉన్న విజయ్ ని ఏకంగా 30 సంవత్సరాల వయసు తగ్గించి 19 ఏళ్ల ప్రాంతంలో ఎలా ఉన్నాడో అలా తెరపై ఆవిష్కరించడానికి అచ్చంగా ఆరు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. విజయ్ కూడా ఈ సినిమా కోసం ప్రత్యేకమైన శ్రద్ధ వహించడంతోపాటు స్ట్రిక్ట్ డైట్ మరియు ఎక్సర్సైజులు కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ మూవీకి సంబంధించిన స్టోరీ కూడా చాలా స్పెషల్ గా ఉంటుంది అని వార్తలు వస్తున్నాయి. రాజకీయ నేపథ్యంలో సాగే ఈ సినిమా స్టోరీ భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది అని టాక్. మూవీకి సంబంధించి మరిన్ని విషయాలు త్వరలో తెలుస్తాయి. మొత్తానికి ఇళయ దళపతి.. స్క్రీన్ పై 19 ఏళ్ల కుర్రాడిగా ఎలా ఉంటాడో చూడాలని అతని అభిమానులు ఎగ్జిైటెడ్ గా ఉన్నారు.

Related News

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Actress Mohini: అలా చేయాలని బలవంతం చేశారు.. చాలా ఏడ్చాను, బాలయ్య హీరోయిన్ షాకింగ్ కామెంట్స్!

Big Stories

×