BigTV English

Akira Nandan : తల్లి పుట్టినరోజుకి లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే గిఫ్ట్ ఇచ్చిన అకిరా నందన్..

Akira Nandan : తల్లి పుట్టినరోజుకి లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే గిఫ్ట్ ఇచ్చిన అకిరా నందన్..
Akira Nandan

Akira Nandan : పవన్ కళ్యాణ్ బద్రి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన రేణు దేశాయ్.. ఆ తర్వాత అతనితో ప్రేమలో పడి సినీ ఇండస్ట్రీకి బాగా దూరమైంది. పవన్ తో లివింగ్ రిలేషన్ షిప్ లో కొన్నాళ్లు గడిపి ఆ తర్వాత అతని పెళ్లి చేసుకొని ఇద్దరు పిల్లలకు తల్లి అయింది. అయితే వాళ్ల కాపురం సజావుగా ఎక్కువ కాలం సాగలేకపోయింది. ఇద్దరు విడాకులు తీసుకున్న తర్వాత పిల్లలతో రేణు దేశాయ్ పూణేలో సెటిల్ అయిపోయింది. ఇక పవన్ వేరే పెళ్లి చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే.


పవన్, రేణు ముద్దుల కొడుకు అకిరా నందన్.. ప్రస్తుతం సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారుతున్నాడు. అతను అప్పుడప్పుడు మెగా ఫ్యామిలీ వేడుకల్లో తలుకుని మెరుస్తున్నాడు. తల్లి అంటే విపరీతమైన ప్రేమ కలిగిన అకిరా.. రీసెంట్ గా ఆమె పుట్టినరోజుకు ఇచ్చిన కానుక ఎంతో అందంగా ఉంది. ఈ విషయాన్ని తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేసుకున్న రేణు.. దీనికి సంబంధించిన వీడియో ని కూడా పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్టు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది.

ఇటీవల జరిగిన రేణు పుట్టినరోజుకు.. అకిరా తల్లికి జీవితాంతం గుర్తుండిపోయే కానుకను బహుమతిగా ఇచ్చాడు.. ఈ విషయాన్ని రేణు దేశాయ్ ఎంతో గొప్పగా పదిమందికి చెప్పి మురిసిపోతుంది. ఇంతకీ అతను ఇచ్చిన గిఫ్ట్ ఏమిటో తెలుసా.. పవన్, రేణు దేశాయ్ కాంబోలో వచ్చిన జానీ చిత్రంలోని కొన్ని వింటేజ్ రొమాంటిక్ సన్నివేశాలకు..సప్తసాగరాలు దాటి సినిమా పాటలు ఆడ్ చేసి ఓ అందమైన వీడియోను ఎడిట్ చేశాడు.


ఇలా తల్లిదండ్రుల మీద తనకున్న అభిమానాన్ని చెప్పకనే చెప్పాడు అకిరా నందన్. ఒకప్పటి వింటేజ్ రేణు దేశాయ్ ను చూసి పవన్ అభిమానులు కూడా ఎంతో ఆనందిస్తున్నారు. ఈ వీడియోని రేణు తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో షేర్ చేసుకుని.. నా పుట్టినరోజుకి కొడుకు ఇచ్చిన అద్భుతమైన బహుమతి అని అందరికీ చెప్పుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది.

Related News

Big TV kissik talks : స్టేజ్ పై అమ్మాయిలతో పండు అలా.. అడ్డంగా పరువుతీసేసిన వర్ష…

Big TV kissik talks : శేఖర్ మాస్టర్ అలాంటి వాడే.. షాకింగ్ విషయాలను బయట పెట్టిన పండు..!

The Big Folk Night 2025 : జానపదంతో దద్దరిల్లిన ఎల్బీ స్టేడియం.. ఘనంగా బిగ్ టీవీ ఫోక్ నైట్

The Big Folk Night 2025 : ఎల్బీ స్టేడియంలో జానపదాల ఝల్లు.. ‘బిగ్ టీవీ’ ఆధ్వర్యంలో లైవ్ ఫోక్ మ్యూజికల్ నైట్ నేడే!

Social Look: నీటి చినుకుల్లో తడిచి ముద్దయిన దీప్తి.. రాయల్ లుక్‌లో కావ్య.. బికినీలో ప్రగ్యా!

Jr NTR controversy: జూనియర్ ఎన్టీఆర్‌పై టీడీపీ ఎమ్మెల్యే కామెంట్స్.. నారా రోహిత్ స్పందన ఇదే!

Big Stories

×