BigTV English

Smriti irani: నటిగా రీఎంట్రీ.. వారికోసం రంగు వేసుకోవడానికి సిద్ధమైన కేంద్ర మాజీ మంత్రి..!

Smriti irani: నటిగా రీఎంట్రీ.. వారికోసం రంగు వేసుకోవడానికి సిద్ధమైన కేంద్ర మాజీ మంత్రి..!

Smriti irani: సాధారణంగా ఎవరైనా సరే ఇండస్ట్రీలోకి వచ్చి తమకంటూ ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్న తర్వాత అందులో కొంతమంది రాజకీయ రంగంలోకి అడుగుపెడుతుంటే, మరి కొంతమంది బిజినెస్ రంగంలోకి అడుగు పెడుతున్నారు. అయితే అలా ఆ రంగాలలోకి వెళ్లిపోయి ఇండస్ట్రీకి దూరమైన వాళ్ళు.. మళ్ళీ ఇండస్ట్రీలోకి వచ్చి ముఖానికి రంగు వేసుకుంటున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ క్రమంలోనే ఒకప్పుడు సీరియల్స్ , సినిమాల ద్వారా ప్రేక్షకులను అలరించిన ప్రముఖ బాలీవుడ్ నటి ఇండస్ట్రీలో తనకంటూ ఒక పేరు వచ్చిన తర్వాత రాజకీయాల్లోకి వెళ్లిపోయారు. ఆ తర్వాత నుంచి ఇండస్ట్రీ వైపు ఆమె చూడలేదు. పైగా కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. అయితే ఇప్పుడు మళ్లీ ఇండస్ట్రీలోకి రావడానికి సిద్ధమయినట్లు సమాచారం. ఆమె ఎవరో కాదు స్మృతి ఇరానీ.


రీ ఎంట్రీకి సిద్ధమవుతున్న స్మృతి ఇరానీ..

రాజకీయాల్లోకి వెళ్ళకముందు సినీ నటిగా, సీరియల్ నటిగా ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచిన కేంద్ర మాజీ మంత్రి స్మృతి ఇరానీ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన రోజు నుంచి మళ్లీ యాక్టింగ్ వైపు చూడలేదు. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఈమె ఇండస్ట్రీలో రాణించడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. త్వరలోనే ఆమె ఒక వెబ్ సిరీస్ కోసం పనిచేయడానికి సిద్ధమవుతున్నారనే వార్త సోషల్ మీడియాలోనే కాదు జాతీయ మీడియాలో కూడా కథనాలు వెలువడుతున్నాయి.


ఏక్తా కపూర్ కోసం రంగంలోకి

అసలు విషయంలోకెళితే.. బుల్లితెర వేదికగా ప్రసారమైన పలు సీరియల్ కోసం గతంలో స్మృతి ఇరానీ పనిచేశారు. అందులో ఒకటి ఏక్తా కపూర్ రూపొందించిన ‘క్యోంకీ సాస్ భీ కభీ బహు థీ’.. అనే సీరియల్ లో ఈమెయిల్ తులసి అనే గృహిణి పాత్రలో నటించి ప్రేక్షకుల మనసు గెలుచుకున్నారు. 2000 నుంచి 2008 వరకు ప్రసారమైన ఈ సీరియల్ విజయవంతం అయింది. ఇప్పుడు ఈ సీరియల్ ను సీరీస్ గా సిద్ధం చేయాలని ఏక్తా కపూర్ భావిస్తున్నారట. ఎక్కువ ఎపిసోడ్స్ కాకుండా కేవలం పరిమితమైన ఎపిసోడ్స్ తోనే దీనిని మరొకసారి ప్రేక్షకులకు అందించాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.అయితే ఈ విషయంపై అటు చిత్ర బృందం కానీ ఇటు స్మృతి కానీ స్పందించలేదు. ఇకపోతే ఈ సీరీస్ కోసం సీరియల్ లో ప్రధాన పాత్రలు పోషించిన అమర్ ఉపాధ్యాయ్ తోపాటు స్మృతి ఇరానీ కొనసాగుతున్నట్లు సమాచారం.

స్మృతి ఇరానీ కెరియర్..

స్మృతి ఇరానీ విషయానికి వస్తే.. ఈమె తండ్రి ఒక పంజాబీ.. బెంగాలీ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. దక్షిణ ఢిల్లీ శివారులలో వీరు నివాసం ఉండేవారు.వీరి పెళ్లికి పెద్దలు ఒప్పుకోకపోవడం వల్లే ఇంటి నుంచి పారిపోయి పెళ్లి చేసుకొని, ఒక పశువుల కొట్టాన్ని చూసుకునే పనికి కుదురుకున్నారు. స్మృతి అక్కడే జన్మించిందిఆ తర్వాత మరో ఇద్దరు ఆడపిల్లలు కూడా జన్మించారు. అలా ఒకపక్క చదువుకుంటూనే.. పేదరికం కారణంగా కొన్ని కుటుంబ బాధ్యతలు కూడా స్మృతి మోయాల్సి వచ్చిందట. పదవ తరగతిలో ఉన్నప్పుడే చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ ఆ తర్వాత పదవ తరగతి ఆపై ఇంటర్మీడియట్ 60% పైగా మార్కులతో పాసైనా.. పై చదువులు చదవడానికి ఆర్థిక పరిస్థితులు సహకరించకపోవడంతో దూరవిద్యలో చదవడం మొదలు పెట్టింది. అలా ఒకవైపు కాస్మెటిక్స్ వ్యాపారం చేసిన ఈమె ఆ తర్వాతే సినిమా రంగంలోకి అడుగు పెట్టింది.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×