Madhavan: ఒక్కసారి ఇండస్ట్రీలో చాక్లెట్ బాయ్ అనే ఇమేజ్ సాధించిన తర్వాత చాలావరకు నటులకు ఫ్యాన్ బేస్ అనేది తగ్గదు. ప్రేక్షకుల దృష్టిలో వారు ఎప్పటికీ చాక్లెట్ బాయ్‌గానే మిగిలిపోతారు. అలాంటి హీరోల్లో మాధవన్ ఒకడు. ప్రేక్షకుల మనసుకు హత్తుకుపోయే ప్రేమకథలతో తన కెరీర్‌ను ప్రారంభించాడు మాధవన్. అలా తనకు వరుసగా ప్రేమకథల్లో నటించడానికే అవకాశాలు వచ్చాయి. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ బిజీ అయిపోయినా కూడా అవన్నీ ప్రేమకథలే. దీంతో నటుడిగా తనను తాను మార్చుకోవాలని అనుకున్నాడు మాధవన్. అందుకే స్టార్ డైరెక్టర్ మణిరత్నం ఆఫర్ చేసిన పాత్రను రిజెక్ట్ చేశాడట. ఆ తర్వాత జరిగిన పరిణామాలేంటో తాజాగా తానే స్వయంగా బయటపెట్టాడు మాధవన్.
రొమాంటిక్ హీరోగా గుర్తింపు
2000లో మణిరత్నం దర్శకత్వం వహించిన ‘సఖి’ సినిమాలో హీరోగా నటించాడు మాధవన్. ఇప్పటికీ ఈ సినిమా చాలామందికి ఫేవరెట్. అందులో మాధవన్ పాత్ర కూడా చాలామందికి ఇష్టం. అప్పటికే తనపై రొమాంటిక్ హీరో అనే ముద్రపడడంతో ఆ మార్క్‌ను మార్చుకోవడం కోసం ‘రన్’ అనే యాక్షన్ సినిమాలో నటించాడు. అలా బ్యాక్ టు బ్యాక్ యాక్షన్ సినిమాలు చేయాలనుకున్నాడు. అదే సమయంలో మణిరత్నం డైరెక్ట్ చేస్తున్న ‘యువ’ సినిమాలో కూడా తనకు హీరోగా అవకాశమిచ్చారు. ‘యువ’ సినిమాలో మొత్తంగా ముగ్గురు హీరోలు ఉన్నారు. సిద్ధార్థ్, మాధవన్, సూర్య. అయితే ముందుగా సిద్ధార్థ్ పాత్రలో నటించడానికి మాధవన్‌ను అప్రోచ్ అయ్యారట మణిరత్నం.
ఆయనే ఆశ్చర్యపోయారు
‘‘మణిరత్నం (Mani Ratnam) నాకు యువ కథ చెప్పిన తర్వాత నేను ఇన్బా పాత్రలోనే నటిస్తానని చెప్పాను. మిగతా పాత్రలను ప్రేక్షకులు మర్చిపోయినా దీనిని మర్చిపోరు అన్నాను. ఆ మాట మణిరత్నంకు నచ్చలేదు. అందుకే బాడీ ట్రాన్స్‌ఫార్మేషన్‌కు రెడీ అయ్యాను. జుట్టు ట్రిమ్ చేసుకున్నాను. ఎండలో గోల్ఫ్ ఆడి ట్యాన్ అయ్యాను. పూర్తిగా గుర్తుపట్టలేకుండా మారిపోయాను. అదే లుక్‌తో మణిరత్నం ఆఫీసుకు వెళ్లాను. అక్కడ నన్ను సెక్యూరిటీ గుర్తుపట్టలేదు. అందుకే లోపలికి వెళ్లనివ్వలేదు. మొత్తానికి ఏదో ఒక విధంగా లోపలికి వెళ్లాను. నాలోని మార్పు చూసి మణిరత్నం సైతం ఆశ్చర్యపోయారు’’ అంటూ ‘యువ’లో పాత్ర కోసం తాను ఎంత కష్టపడ్డాడో చెప్పుకొచ్చాడు మాధవన్.
Also Read: కూతురి టర్న్ అయిపోయింది, ఇప్పుడు కొడుకు వంతు.. హీరోగా ‘గేమ్ ఛేంజర్’ వారసుడు డెబ్యూ
అంత కష్టపడ్డాను
‘యువ’ సినిమాలో నటించడానికి మాధవన్ (Madhavan) చాలా హోమ్ వర్క్ కూడా చేశాడట. సింహాలు వేటాడే ముందు వారి ఆహారం కోసం ఎలా ఎదురుచూస్తాయి, ఎంత ఓపికగా ఉంటాయి అనేది గమించేవాడినని గుర్తుచేసుకున్నాడు మాధవన్. అలాంటి లక్షణాలే ‘యువ’లో తన పాత్రకు కూడా ఉంటాయని అన్నాడు. ఇక మణిరత్నం, మాధవన్ కాంబినేషన్‌లో ‘అమృత’, ‘గురు’ లాంటి మరో రెండు సినిమాలు కూడా వచ్చాయి. ‘‘మణిరత్నంతోనే నేను చాలా సినిమాలు చేసి సక్సెస్‌ఫుల్ అయినా కూడా నాకంటూ నేను ఒక సొంత మార్గాన్ని క్రియేట్ చేసుకోవాలని అనుకున్నాను’’ అని గర్వంగా తెలిపాడు మాధవన్.