E-Paper
Advertisement

Sobhita Dhulipala: అక్కినేని కోడలు కొత్త సినిమా.. డైరెక్ట్ ఓటీటీలో.. ఎక్కడ చూడాలంటే.. ?

Sobhita Dhulipala: అక్కినేని కోడలు కొత్త సినిమా.. డైరెక్ట్ ఓటీటీలో.. ఎక్కడ చూడాలంటే.. ?
Advertisement

Sobhita Dhulipala: శోభితా  ధూళిపాళ్ల.. కొన్ని రోజుల క్రిందట వరకు ఈ బ్యూటీ గురించి తెలుగువారు పెద్దగా పట్టించుకోలేదు. ఎప్పుడైతే  అక్కినేని కోడలిగా మారిందో..   టాప్ 1 సెలబ్రిటీగా మారిపోయింది.  నిజం చెప్పాలంటే శోభితా ఏమి అంత పెద్ద స్టార్ కాదు. ఎవరైనా ఇంట గెలిచి రచ్చ గెలవాలి అని చెప్తారు. కానీ, ఈ చిన్నది మాత్రం రచ్చ గెలిచి ఇంట అడుగుపెట్టింది.

బాలీవుడ్ లో  పలు సినిమాల్లో శోభితా  నటించి మెప్పించింది. అందాల ఆరబోత కానీ, ఇంటిమేటేడ్ సీన్స్ కానీ అమ్మడికి కొత్తేమి కాదు.  ఇక తెలుగులో శోభితా చేసినవి రెండే సినిమాలు గూఢచారి, మేజర్. ఈ సినిమాలు కూడా శోభితాకు ఆశించిన ఫలితాలను అందించలేకపోయింది.

Advertisement

ఇక ఇవన్నీ పక్కన పెడితే.. చైతో ఎంగేజ్ మెంట్ అయ్యాక.. శోభితా అందాల ఆరబోత,   ఇంటిమేటెడ్ సీన్స్ ఉన్న సినిమాలు తగ్గించిందనే చెప్పాలి.  త్వరలోనే వీరి పెళ్లి గ్రాండ్ గా జరగనుంది. ప్రస్తుతం శోభితా  నటిస్తున్న చిత్రాల్లో  లవ్ సితార  ఒకటి.  వందనా కటారియా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రాజీవ్ సిద్దార్థ్ హీరోగా నటించాడు.

ఎప్పటి నుంచో షూటింగ్ జరుపుకుంటున్న  ఈ సినిమాను డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. ఈ సినిమా హక్కులను  జీ5  సొంతం చేసుకుంది. ఈ నెల 27 నుంచి లవ్ సితార జీ5 లో స్ట్రీమింగ్ కానుంది. ఇక కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో శోభితా ఒక గృహిణిగా  కనిపించనుంది. మరి ఈ సినిమాతో అక్కినేని కోడలు ఎలాంటి  విజయాన్ని  అందుకుంటుందో చూడాలి.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×