Jr NTR : ఎన్టీఆర్ లైఫ్ లో అత్యంత ప్రతిష్టాత్మకమైన చిత్రం అంటే RRR అనే చెప్పాలి. ఈ మూవీతో యంగ్ టైగర్ కాస్త గ్లోబల్ స్టార్ అయ్యాడు. తెలుగోడి సత్తాను ప్రపంచానికి చాటిన సినిమా. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ మూవీ ఆస్కార్ సొంతం చేసుకుంది.. గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డులను సొంతం చేసుకుంది. మొదటి రోజు నుంచి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకోవడంతో పాటు కలెక్షన్స్ ను కూడా రాబట్టింది. అయితే ఈ మూవీ వచ్చి చాలా ఏళ్లు అవుతున్నా క్రేజ్ మాత్రం తగ్గలేదు. ఈ మూవీ వరుసగా రికార్డులను బ్రేక్ చేస్తూనే ఉంది. మరోసారి త్రిబుల్ ఆర్ చిత్రం వార్తల్లో నిలిచింది.. లండన్లోని ప్రతిష్టాత్మక రాయల్ ఆల్బర్ట్ హాల్లో ‘ఆర్ఆర్ఆర్ లైవ్ కాన్సర్ట్’ ఆదివారం నిర్వహించారు. ఈ వేడుకకు ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళి, మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి హాజరయ్యారు.. ఈవెంట్ కు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఎన్టీఆర్ లుక్కుపై ప్రభాస్ ఫ్యాన్స్ బాడీ షేమింగ్ చేస్తున్నారు. దాంతో ఇది సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
‘RRR’ కు మరో అవార్డు..
దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన హిట్ చిత్రాల్లో ఒకటి ‘RRR’.. టాలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్ హీరోలైన రామ్ చరణ్ , ఎన్టీఆర్ లు ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటించారు. మొదటి షో నుంచి పాజిటివ్ టాక్ ను అందుకున్న ఈ మూవీ కలెక్షన్స్ లు కూడా అంతే రేంజ్ లో వసూలు చేసింది. దాదాపు 1100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు దక్కించుకుంది. నాటు నాటు సాంగ్ కి ఏకంగా ఆస్కార్ అవార్డు కొల్లగొట్టింది. హాలీవుడ్ వాళ్లు సైతం తెలుగు సినిమా వైపు చూసి ఎలా RRR సంచలనాలు సృష్టించింది. ఆర్ఆర్ చిత్రానికి తాజాగా మరో గౌరవం దక్కింది.. లండన్ లోని అత్యంత ప్రతిష్టాత్మకమైన రాయల్ ఆల్బర్ట్ హాల్ లో ఈ చిత్ర లైవ్ కాన్సర్ట్ ఘనంగా నిర్వహించారు. రాజమౌళి, కీరవాణి, రామ్ చరణ్, ఎన్టీఆర్ లు ఒకే వేదికపై సందడి చేశారు. ఈ ఈవెంట్ కు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఎన్టీఆర్ లుక్కు పై నెట్టింట పెద్ద చర్చ జరుగుతుంది.. ప్రభాస్ అభిమానులు ఆయన లుక్కుపై కామెంట్స్ చేస్తున్నారని తెలుస్తుంది.. వివరాల్లోకి వెళితే..
ఎన్టీఆర్ లుక్ పై ప్రభాస్ ఫ్యాన్స్ కామెంట్స్..
ఈవెంట్ కు హాజరైన ఎన్టీఆర్ బ్లాక్ అండ్ బ్లాక్ లో చాలా స్టైలిష్ గా కనిపించారు. అయితే ఈమధ్య ఎన్టీఆర్ బాగా సన్నబడి స్లిమ్ అయిన విషయం తెలిసిందే.. నిజానికి ప్రశాంత్ నీల్ తో చేస్తున్న సినిమా కోసం ఎన్టీఆర్ బాగా తగ్గిపోయిన తగ్గిపోయారు. బక్కచిక్కి పీక్కుపోయినట్లు కనిపిస్తున్నాడు. తాజాగా ఆయన ఫోటోల పై ప్రభాస్ ఫ్యాన్స్ బాడీ షేమింగ్ చేస్తున్నారు. అంత పెద్ద హీరో అయిన ఎన్టీఆర్ ను తణుకు తాతను ఫోటోలను పక్క పక్కనపెట్టి అచ్చం ఇలాగే ఉన్నాడని కామెంట్స్ చేస్తున్నారు. ఇది చూసిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం మా హీరో అని ఏదైనా అంటే తగలబెట్టేస్తామంటూ సోషల్ మీడియాలో వారికి దిగారు. ప్రభాస్ ఫ్యాన్స్ ఇటు ఎన్టీఆర్ ఫ్యాన్స్ మధ్య పెద్ద వారే జరుగుతుంది.. మరి దీనిపై ఎన్టీఆర్ ఎలా రెస్పాండ్ అవుతారో చూడాలి.. ఏది ఏమైనా కూడా ప్రస్తుతం ఇది ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది..
ఇక ఎన్టీఆర్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం వార్ 2 మూవీతో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. అలాగే ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో డ్రాగన్ మూవీని చేస్తున్నారు.. ఈ మూవీ నుంచి అతి త్వరలోనే ఒక కీలకమైన అప్డేట్ రాబోతుందని సమాచారం..
— R S V (@RsvRebel) May 11, 2025