Sachin- Kohli Railway Stations: మన దేశంలో క్రికెట్ ను ఎంతగానో ఇష్టపడుతారు. ఇంకా చెప్పాలంటే క్రికెట్ ను ఆరాధిస్తారు. క్రికెటర్లను ఆరాధిస్తారు. నాటి కపిల్ దేవ్ నుంచి నేటి కోహ్లీ వరకు ఎంతో మంది క్రికెటర్లకు కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. సాధారణంగా క్రికెటర్ల పేరుతో స్టేడియాలకు లేదంటే స్టేడియంలోని స్టాండ్లకు పెడుతూ ఉంటారు. కానీ, మన దేశంలో ఇద్దరు క్రికెటర్ల పేరుతో రెండు రైల్వే స్టేషన్లు ఉన్నాయి. ఇంతకీ అవేంటి? ఎక్కడ ఉన్నాయంటే..
సచిన్, కోహ్లీ పేర్లతో రైల్వే స్టేషన్లు
దేశంలోని అత్యుత్తమ క్రికెటర్లలో సచిన్ టెండూల్కర్, కోహ్లీ టాప్ లో ఉంటారు. ఇద్దరూ భారత క్రికెట్ జట్టుకు ఎన్నో చిరస్మరణీయ విజయాలను అందించారు. సచిన్ 100 సెంచరీలు చేసిన ఏకైక క్రికెటర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. కోహ్లీ సారథ్యంలో భారత జట్టు ఎన్నో అద్భుతమైన ట్రోఫీలను సాధించింది. ఇప్పటికీ అద్భుతమైన ఫామ్ లో రన్స్ చేస్తున్నారు. భారత జట్టులో ముఖ్యమైన క్రికెటర్ గా కొనసాగుతున్నారు. మన దేశంలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తో పాటు రన్స్ మెషీన్ కోహ్లీ పేరుతో రైల్వే స్టేషన్లు ఉన్నాయి.
సూరత్ లో సచిన్ స్టేషన్, నాగపూర్ లో కోహ్లీ స్టేషన్
సచిన్ టెండూల్కర్ రైల్వే స్టేషన్ సూరత్ లో ఉంది. ఇది ముంబై, అహ్మదాబాద్, జైపూర్, ఢిల్లీ మెయిన్ మార్గంలో రైల్వే స్టేషన్ ఉంటుంది. గతంలో సునీల్ గవాస్కర్ ఈ రైల్వే స్టేషన్‌ను సందర్శించి ఫోటోను కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు. అప్పటి నుంచి ఈ రైల్వే స్టేషన్ బాగా పాపులర్ అయ్యింది. ఇక నాగపూర్ డివిజన్ లోని భోపాల్-నాగపూర్ సెక్షన్ లో కోహ్లీ రైల్వే స్టేషన్ ఉంటుంది. ఇది మహారాష్ట్రలోని నాగ్ పూర్ జిల్లా కల్మేశ్వర్ దగ్గర యెల్కాపర్ రహదారి పక్కనే ఉంటుంది.
Read Also: సరిహద్దుల్లో ఉద్రిక్తతలు, ఇండియన్ రైల్వే కీలక నిర్ణయం!
ఈ స్టేషన్స్ తో క్రికెటర్లకు ఉన్న సంబంధం ఏంటి?
వాస్తవానికి ఈ రైల్వే స్టేషన్లతో క్రికెటర్లు సచిన్, కోహ్లీకి ఎలాంటి సంబంధం లేదు. ఈ రెండు రైల్వే స్టేషన్లు వాళ్లు పుట్టక ముందు నుంచి ఉన్నాయి. అప్పట్లో ఈ రైల్వే స్టేషన్లకు ఎందుకు ఆ పేరు పెట్టారు? అనే విషయంలో పెద్దగా క్లారిటీ లేదు. కానీ, చాలా మంది ఈ రైల్వే స్టేషన్లను చూసి, వారి కృషికి గుర్తింపుగా ఈ స్టేషన్లకు క్రికెటర్ల పేరు పెట్టారని భావిస్తారు. కానీ, రైల్వే అధికారులు సైతం ఈ రైల్వే స్టేషన్లకు క్రికెటర్ల పేర్లు ఎందుకు పెట్టాల్సి వచ్చింది? అనే విషయంపై పూర్తి వివరాలు అందించలేకపోయారు. అప్పటి పరిస్థితులకు అనుగుణంగా ఈ పేర్లు పెట్టినట్లు తెలుస్తోంది.
Read Also: వామ్మో.. రైలు ఇంజిన్ లైట్ ఫోకస్ అంత దూరం ఉంటుందా? మీరు అస్సలు ఊహించి ఉండరు!