Sonakshi Sinha: సినీ పరిశ్రమలో ప్రేమించి పెళ్లి చేసుకున్న సెలబ్రిటీలు ఎంతోమంది ఉన్నా.. వారు ప్రేమించి పెళ్లి చేసుకున్నా.. విడాకులు తీసుకొని విడిపోవడం కామన్ అయిపోయింది. అందుకే సినీ సెలబ్రిటీల పెళ్లిళ్లపై ప్రేక్షకుల్లో నమ్మకం పోయింది. ఒక హీరో, హీరోయిన్ పెళ్లి చేసుకున్న తర్వాత వారి సోషల్ మీడియాలో కాస్త తేడా కనిపించినా వారిద్దరూ విడిపోతున్నారని రూమర్స్ స్టార్ట్ అయిపోతున్నాయి. అలా కొందరు హీరోహీరోయిన్ల విడాకుల గురించి ఇప్పటికీ కేవలం రూమర్స్ మాత్రమే వైరల్ అవుతున్నా వారు మాత్రం మ్యారేజ్ లైఫ్‌లో సంతోషంగా ఉంటున్నారు. తాజాగా బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా కూడా విడాకులు తీసుకోనుందని ఒకరు కామెంట్ చేయగా.. దానికి తను క్లారిటీ ఇచ్చేసింది.
వీడియో వైరల్
బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా.. జాహీర్ ఇక్బాల్ అనే హీరోను ప్రేమించి పెళ్లి చేసుకుంది. సోనాక్షి హిందూ అయినా జాహీర్ లాంటి ముస్లీంను ప్రేమించి పెళ్లి చేసుకోవడంతో తనపై పలువురు ప్రేక్షకులు చాలా నెగిటివ్ కామెంట్స్ చేశారు. ఆ నెగిటివిటీని పట్టించుకోకుండా ప్రస్తుతం బీ టౌన్‌లోని హ్యాపీ కపుల్స్‌లో వీరు కూడా ఒకరిగా మారిపోయారు. సోనాక్షి, జాహీర్ పెయిర్‌కు చాలామందే ఫ్యాన్స్ ఉన్నారు. వీరి ఇన్‌స్టాగ్రామ్‌లోని రీల్స్‌కు తెగ లైకులు వస్తుంటాయి. అలా ఇద్దరూ హ్యాపీగానే ఉన్నా కూడా కొందరు మాత్రం ఇప్పటికీ ఆ నెగిటివ్ కామెంట్స్‌ను ఆపడం లేదు. తాజాగా వీరిద్దరూ ఒక ఇంటర్వ్యూలో పాల్గొనగా దానికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
టైమ్ దగ్గరపడింది
‘నువ్వు ప్రేమించినవాడు నిన్ను ఇంతలా ప్రేమించకపోతే అతడిని అసలు పెళ్లి చేసుకోవద్దు’ అనే క్యాప్షన్‌తో సోనాక్షి, జాహీర్‌కు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దానికి నెటిజన్లు పాజిటివ్‌గానే కాకుండా నెగిటివ్ రియాక్షన్స్ కూడా ఇచ్చారు. అందులో ఒక నెటిజన్.. ‘మీరు విడాకులు తీసుకునే రోజు దగ్గర్లోనే ఉంది’ అని కామెంట్ చేశాడు. చాలావరకు సెలబ్రిటీలు ఇలాంటి కామెంట్స్ పట్టించుకోరు. ఇలాంటి నెగిటివ్ కామెంట్స్ వారికి చాలా కామన్. కానీ ఈ కామెంట్‌ను మాత్రం చూసి వదిలేయాలని సోనాక్షి సిన్హా అనుకోలేదు. అందుకే తమ విడాకుల గురించి మాట్లాడిన వ్యక్తికి గట్టి కౌంటర్ ఇచ్చింది.
Also Read: నా వెయిట్ లాస్ సీక్రెట్ ఇదే.. మీరు ఫాలో అవ్వండన్న కరణ్ జోహార్
అలాగే చేస్తాం ప్రామిస్
‘ముందుగా మీ అమ్మ, నాన్నకు విడాకులు ఇప్పించి ఆ తర్వాత మేము తీసుకుంటాం. ప్రామిస్’ అంటూ తమ విడాకులపై నెగిటివ్ కామెంట్ చేసిన నెటిజన్‌కు గట్టి కౌంటర్ ఇచ్చింది సోనాక్షి సిన్హా. చాలామంది ఫ్యాన్స్ సోనాక్షికి సపోర్ట్‌గా ముందుకొచ్చారు. ఈరోజుల్లో సినీ సెలబ్రిటీలు సంతోషంగా ఉంటే ప్రేక్షకులు చూడలేకపోతున్నారు అంటూ తనకు సపోర్ట్‌గా మాట్లాడడం మొదలుపెట్టారు. సోనాక్షి సిన్హా (Sonakshi Sinha), జాహీర్ ఇక్బాల్ (Zaheer Iqbal) దాదాపు ఏడేళ్లు డేటింగ్‌లో ఉన్నారు. వీరిద్దరూ చాలాసార్లు పబ్లిక్‌గా కనిపించినా కూడా రిలేషన్‌షిప్ గురించి చెప్పడానికి మాత్రం ఎప్పుడూ ముందుకు రాలేదు. ఫైనల్‌గా 2024 జూన్ 24న వీరిద్దరి పెళ్లి జరిగింది.