SRH VS MI: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో ( Indian Premier League 2025 Tournament ) భాగంగా… ఇవాళ ముంబై ఇండియన్స్ వర్సెస్ సన్రైజర్స్ హైదరాబాద్ ( Mumbai Indians vs Sunrisers Hyderabad ) మధ్య మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్ వర్సెస్ సన్రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ రసవత్తరంగా జరిగింది. అయితే ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ జట్టు…. 300 కు పైగా పరుగులు చేస్తుందని అందరూ అంచనా వేశారు. కానీ పిచ్ స్లోగా ఉండడంతో.. హైదరాబాద్ ప్లేయర్లు ఎంత ట్రై చేసినా.. పరుగులు రాలేదు.
Also Read: Backfoot No Ball: వివాదంగా మారిన స్టార్క్ నో బాల్…. అంబానీ కుట్రలు చేశాడని ఆరోపణలు
ఈ నేపథ్యంలోనే నిర్ణీత 20 ఓవర్లలో హైదరాబాద్ జట్టు 5 వికెట్లు నష్టపోయి కేవలం 162 పరుగులు మాత్రమే చేసింది. అయితే ముంబై ఇండియన్స్ వర్సెస్ సన్రైజర్స్ హైదరాబాద్ మధ్య మ్యాచ్ నేపథ్యంలో… ఆసక్తికర సంఘటన జరిగింది. అభిషేక్ శర్మ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో… అతని జేబులో కాగితం ఉందా అని ముంబై ఇండియన్స్ ప్లేయర్ సూర్య కుమార్ యాదవ్ చెక్ చేశారు. బ్యాటింగ్ చేస్తున్న అభిషేక్ శర్మ జేబులో దౌర్జన్యంగా.. చేతులు పెట్టి మరీ చూసాడు సూర్య కుమార్ యాదవ్.
అభిషేక్ శర్మ జేబులో చేయి పెట్టిన సూర్య
అయితే అభిషేక్ శర్మ జేబులో ఎలాంటి పేపర్ ముక్క లేదు. దీంతో అక్కడ… చిన్న ఫన్నీ సన్నివేశం జరిగింది. దీనికి సంబంధించిన వీడియో అలాగే ఫోటోలు వైరల్ గా మారాయి. అయితే ఇది చూసిన హైదరాబాద్ అభిమానులు…. ముంబై ఇండియన్స్ ప్లేయర్లపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ ఆటగాడు బ్యాటింగ్ చేస్తున్న సమయంలో అక్రమంగా… అలా చేతులు పెట్టడం ఏంటని మండిపడ్డారు. మీ హోమ్ గ్రౌండ్ అయితే… ఇంత దౌర్జన్యానికి… తెగిస్తారా అంటూ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సెంచరీ తో పేపర్ చూపించిన హైదరాబాద్ ప్లేయర్ అభిషేక్ శర్మ
సన్రైజర్స్ హైదరాబాద్ ( Sunrisers Hyderabad ) వర్సెస్ పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య జరిగిన మొన్నటి మ్యాచ్లో.. అభిషేక్ శర్మ ( Abhishek Sharma)అద్భుతమైన సెంచరీ తో రాణించాడు. 40 బంతుల్లో సెంచరీ చేసిన అభిషేక్ శర్మ.. తన జేబులో ఉన్న పేపర్ ముక్క తీసి… హైదరాబాద్ ఫ్యాన్స్ కు చూపించాడు. తన సెంచరీ హైదరాబాద్ ఫ్యాన్స్ కోసం అంకితం అంటూ… ఆ పేపర్లో రాసుకొచ్చాడు అభిషేక్ శర్మ. ఇప్పటికీ కూడా అభిషేక్ శర్మ చూపించిన ఆ పేపర్ కథ… సోషల్ మీడియాలో వైరల్ గా మారుతూనే ఉంది. కాగా ఇవాల్టి మ్యాచ్లో అభిషేక్ శర్మ… టచ్ లోకి వచ్చినట్లే వచ్చి తొందరగానే ఒకటి అయ్యాడు. 28 బంతుల్లో 40 పరుగులు చేసిన అభిషేక్ శర్మ… ఏడు బౌండరీలు కొట్టాడు. చివరికి హార్దిక్ పాండ్యా బౌలింగ్లో ఔట్ అయ్యాడు.
Also Read: Match Fixing threat IPL 2025: ఐపీఎల్ 2025 ఫిక్సింగ్ బాంబు.. హైదరాబాద్ వ్యక్తినే కీలక సూత్రదారి
Surya Kumar Yadav checks Abhishek Sharma’s pocket to see if he brought a note with him or not 👀😂
📸: JioHotstar#IPL2025 pic.twitter.com/zADHVrhIoz
— CricTracker (@Cricketracker) April 17, 2025