Big Stories

Ramabanam : గోపీచంద్‌కు స్పెషల్ ఆడియెన్స్.. రామబాణంతో వాళ్లు కూడా ఔట్

- Advertisement -

Ramabanam : రామబాణం సినిమాకు రివ్యూ రాయడం, ఇవ్వడం కూడా అనసవరం అనే టాక్ నడిచిందంటే… ఇక ఆ సినిమా ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు. రామబాణం సినిమాకు రివ్యూ ఇవ్వడం తరువాత సంగతి.. ముందు గోపీచంద్‌కు రివ్యూ ఇవ్వాలనేది టాలీవుడ్‌లో టాక్. కొత్త కుర్రాళ్లు దూసుకెళ్తున్నారు, అట్టర్ ఫ్లాప్‌లో పడిన వాళ్లు కూడా కొన్ని హిట్స్‌తో ట్రాక్ మీదకు వచ్చేశారు. కాని, అన్ని క్వాలిటీస్ ఉన్న గోపీచంద్ మాత్రం ఇంత వెనకపడిపోయాడు. మంచి పర్సనాలిటీ, యాక్టింగ్, ఛార్మింగ్, మాచోమేన్.. ఇలా హీరోకు కావాల్సిన క్వాలిటీస్ అన్నీ ఉన్నాయ్. ప్రేక్షకులు థియేటర్లకు వచ్చేందుకు ఇంతకు ముందు ఆడిన మంచి సినిమాలూ ఉన్నాయి. కాని, కథలు, డైరెక్టర్ల సెలక్షన్స్‌లోనే గోపీచంద్ తప్పటడుగులు వేస్తున్నట్టు కనిపిస్తోంది.

- Advertisement -

గోపీచంద్ గత ఐదారు సినిమాలు చూస్తే.. దాదాపుగా అన్నీ ఫ్లాపే. కాని, విచిత్రం ఏంటంటే.. మంచి ఓపెనింగ్స్ వచ్చాయి వాటికి. సినిమా రిజల్ట్‌తో సంబంధం లేకుండా కాస్తో కూస్తో కలెక్షన్స్ ఉన్నాయి. అంటే.. ఓ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ గోపీచంద్ వెనక ఇంకా ఉన్నారు. ఆయన సినిమాలు రిలీజ్ అయితే చూడ్డానికి సిద్ధంగా ఉన్నారు. మంచి బొమ్మ అయితే.. తామే ఓ పది మందికి చెప్పేందుకు కూడా రెడీగా ఉన్నారు. కాని, అలాంటి అవకాశమే ఇవ్వడం లేదు గోపీచంద్. ఇక ఇప్పటి వరకు ఓపిగ్గా ఎదురుచూసిన ఓ సెక్షన్ ఆడియన్స్.. ఇక గోపీచంద్‌ను వదిలేద్దామని అనుకుంటున్నారు. అనుకోవడం కాదు.. వదిలేశారు కూడా. అందుకే, రామబాణం సినిమా అంత డిజాస్టర్ అయింది.

సాధారణంగా గోపీచంద్ మూవీకి మినిమమ్ ఓపెనింగ్స్ ఉండేవి. కొంత మంది ఫ్యామిలీ ఆడియన్స్ కూడా గోపీచంద్ మూవీస్‌కి ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్లున్నారు. రామబాణం సినిమాకు మాత్రం వాళ్లెవరూ రానట్టు కనిపిస్తోంది. ఈ సినిమాకు డీసెంట్ ఓపెనింగ్స్ మిస్ అయ్యాయి. మరి ఈ విషయం గోపీచంద్ గమనిస్తున్నాడో లేదో. ఒకవేళ గమనించి ఉంటే.. తన ఆడియన్స్‌కు ఎలాంటి సినిమాలు కావాలో.. కొన్నాళ్లపాటు వాటినే ఎంచుకోవడం బెటర్. లేదంటే.. ఈ మ్యాచోమ్యాన్‌ను పూర్తిగా మరిచిపోయే ప్రమాదం కూడా ఉంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News