Big Stories

Tollywood movies : ఒక ఊరి కథ.. ఒకే ఫార్ములాతో హిట్లు

- Advertisement -

Tollywood movies : ఈ మధ్య సినిమాలన్నీ ఒక ఊరి కథతోనే వస్తున్నాయి. రీసెంట్‌గా విడుదలై బంపర్ హిట్ కొట్టిన విరూపాక్ష కూడా రుద్రవనం అనే ఊరిని బేస్ చేసుకుని తీసిన సినిమానే. అంతెందుకు మొన్న వచ్చిన బాలకృష్ణ సినిమా వీరసింహారెడ్డి కూడా పులిచర్ల బ్యాక్‌గ్రౌండే. ఆ మాటకొస్తే.. రంగస్థలం సినిమా కూడా ఇదే టెంపో. ఆ ఊరిలో ఏం జరుగుతోందో చెప్పడమే కథాంశం. విచిత్రం ఏంటంటే.. ఇలాంటి జోనర్‌లో ఎక్కువ సినిమాలు వస్తున్నప్పటికీ… మ్యాగ్జిమమ్ హిట్స్ కొడుతున్నాయి. విరూపాక్ష సినిమా అయితే… వాటన్నింటిలోనూ హైలెట్. ఏకంగా 80 కోట్లు కొల్లగొట్టి ఇప్పటికీ సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతోంది.

- Advertisement -

ఇప్పుడు భైరవకోనతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు సందీప్ కిషన్. ట్రైలర్ చాలా ఇంట్రస్టింగ్‌గా అనిపిస్తోంది. గరుడ పురాణం.. అందులోని నాలుగు పేజీలు మిస్ అవడం.. గరుడ పురాణంలో లేని శిక్షలు భైరవకోనలో విధించడం.. మొత్తానికి కొత్తగా ప్రజెంట్ చేశాడు. పైగా దర్శకుడు కూడా విభిన్న కథలను తెరకెక్కించే టాలెంట్ ఉన్న వ్యక్తే. సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న ఊరి పేరు భైరవకోన సినిమాను విఐ ఆనంద్ తెరకెక్కిస్తున్నాడు. గతంలో టైగర్, డిస్కో రాజా, ఒక్క క్షణం లాంటి సినిమాలు అందించాడు. ఒక్క క్షణం, డిస్కో రాజా సినిమాలు నిజంగా కొత్త కాన్సెప్ట్‌తో వచ్చిన సినిమాలే. ఇప్పుడు ఊరి పేరు భైరవకోన సినిమాతో మరో కొత్త కాన్సెప్టును పరిచయం చేస్తున్నాడు విఐ ఆనంద్.

పైగా టీజర్ కట్ చేయడంలోనూ టాలెంట్ చూపించారు. ఈ సినిమాలో ఎవరెవరు ఉన్నారన్న దానిపై ఫోకస్ చేయలేదు. కేవలం కథ ఏంటి, ఎందుకు ఈ సినిమా చూడాలి అనేది ఒక్క ట్రైలర్లోనే చెప్పేశాడు దర్శకుడు. ఆ విషయంలో సక్సెస్ అయినట్టే. ఎలాగూ హీరో కాబట్టి సందీప్ కిషన్ కనిపించాడు. ఇక హీరోయిన్ వర్ష బొల్లమ్మ, కావ్య థాపర్‌ను కూడా చూపించాడు. కాని, ట్రైలర్లో వాళ్లకి పెద్ద స్పేస్ ఇవ్వలేదు. అయినా, సినిమాలో ఎవరెవరు ఉన్నారన్నది ఇంపార్టెంట్ కాదు. కంటెంట్ ముఖ్యం. సో, ఈ సినిమాలో కంటెంట్ ఉందని చెప్పి సక్సెస్ అయ్యాడు విఐ ఆనంద్.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News