Shabdham Trailer: నటుడు ఆది పినిశెట్టి గురించి తెలుగు ప్రేక్షకులను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సాధారణంగా సెలబ్రిటీ వారసులుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినవారు.. హీరోగానే సినిమాలు చేయాలనీ కోరుకుంటారు. కానీ, ఆది మాత్రం నటుడిగా మారాలనుకున్నాడు. దర్శకుడు రవిరాజా పినిశెట్టి వారసుడిగా ఆది ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. తెలుగు, తమిళ్ అని తేడా లేకుండా వరుస సినిమాలు చేస్తూ వస్తున్నాడు. ఒకపక్క హీరోగా సినిమాలు చేస్తూనే.. విలన్ గా, సపోర్టివ్ రోల్స్ లో అదరగొడుతున్నాడు.
తాజాగా ఆది పినిశెట్టి నటిస్తున్న చిత్రం శబ్దం. అరివళగన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని 7G శివ నిర్మిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో ఆది పినిశెట్టి సరసన లక్ష్మీ మీనన్ నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా శబ్దం ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ఈ మధ్యకాలంలో హర్రర్ సినిమాలకు మంచి డిమాండ్ ఉంది. ఈసారి ఆది కూడా అదే కథాంశంతో వస్తున్నాడు.
” ఓ వెయ్యి గబ్బిలాలు చెవిలో అరుస్తున్నట్లు ఉంటుంది డాక్టర్” అని ఒక అమ్మాయి చెప్పే డైలాగ్ తో ట్రైలర్ మొదలయ్యింది. ఇదొక రకమైన ఆడియో హెలోజినేషన్. అందులో వచ్చిన శబ్దం గురించి ఆమె చెప్పిన విధానం చాలా కొత్తగా, విచిత్రంగా అనిపించింది అని డాక్టర్ చెప్పే డైలాగ్ తో సినిమా కథను పరిచయం చేశారు. వ్యూమా అనే పారా నార్మల్ ఇన్వెస్టిగేటర్ గా ఆది కనిపించాడు.
People Media Factory: విశ్వం సినిమా.. విశ్వప్రసాద్‌ను రోడ్డుకీడ్చిందిగా.. ?
ఒక బంగ్లాలో ఒక చిన్నపాప.. శబ్దం ద్వారా ప్రజలను చంపుతూ ఉంటుంది. దాన్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి వ్యూమా బంగ్లాలోకి వెళ్లి.. దియా అనే పాపనే ఇదంతా చేస్తుందని తెలుసుకుంటాడు. అసలు దియా ఎవరు.. ? ఆమె వీరిని ఎందుకు చంపుతుంది.. ? శబ్దం ద్వారా దియా ఏం చెప్పాలనుకుంటుంది.. ? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
ఇప్పటివరకు ఆత్మలు.. మనుషుల శరీరాలలోకి ప్రవేశిస్తాయి. కలల ద్వారా కనిపిస్తాయి.. గాల్లో కనిపిస్తాయి అని తెలుసు. కానీ, శబ్దం తో కూడా ఆత్మలు మనుషులను చంపేస్తాయి అనే కొత్త కథతో ఈ సినిమా తెరకెక్కింది. ఆది నటించిన వైశాలిలో కూడా ఆత్మ నీటి రూపంలో వచ్చి తనను చంపినవారిపై పగ తీర్చుకుంటుంది. ఇప్పుడు సౌండ్ రూపంలో వచ్చి పగ తీర్చుకుంటుందని చెప్పొచ్చు.
ట్రైలర్ లో భయపెట్టే సన్నివేశాలు చాలా ఎక్కువగానే ఉన్నాయని తెలుస్తోంది. ముఖ్యంగా థమన్ మ్యూజిక్ తో ప్యాంట్ లు తడిసేలా భయపెట్టాడు అని చెప్పొచ్చు. ప్రస్తుతం ఈ ట్రైలర్ నెట్టింట వైరల్ గా మారింది. ఫిబ్రవరి 28 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో ఆది ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.