Call Merging Scam: యూపీఐ యూజర్లకు ఇది అలర్ట్.. ఈ మధ్య కాల్ మెర్జింగ్ స్కామ్ తో మోసాలకు పాల్పడుతున్నారు. కాల్ మెర్జింగ్ స్కామ్‌తో కాస్త జాగ్రత్తగా ఉండాలి. మీరు పొరపాటున కాల్ మెర్జ్ చేశారంటే అంతే సంగతులు.. స్కామర్లు మీ బ్యాంకులో నుంచి ఈజీగా డబ్బులు నొక్కేయొచ్చు. ఈ కాల్ మెర్జింగ్ స్కామ్ బారిన పడకుండా ఉండాలంటే ఏం చేయాలో మనం సవివరంగా తెలుసుకుందాం.
ALSO READ: Group-D Jobs: పదో తరగతి అర్హతతో 32,438 ఉద్యోగాలు.. ఇంకా మూడు రోజులే ఛాన్స్..
యూపీఐ తమ వినియోగదాలను కాల్ మెర్జింగ్ స్కామ్ గురించి తగు జాగ్రత్తలు సూచిస్తుంది. ఇందులో స్కామర్లు వినియోగదారులను మోసం చేసి.. కాల్ మెర్జ్ చేయడం ద్వారా మీకు తెలియకుండానే వన్ టైమ్ పాస్ వర్డ్ మీ ఫోన్ కు పంపుతారు. దీంతో సులభంగా మీ ఫోన్ లో యూపీఐ అకౌంట్ ల నుంచి డబ్బులను ట్రాన్స్ ఫర్ చేసుకుంటారు. కాబట్టి వినియోగదారులు అందరూ కాల్ మెర్జింగ్ స్కామ్ పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తుంది.
కాల్ మెర్జింగ్ స్కామ్ గురించి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(NPCI) డెవలప్ చేసిన యూపీఐ సోషల్ మీడియాలో ఎక్స్ వేదిక యూజర్లకు హెచ్చరికలు జారీ చేసింది. మోసగాళ్లు ఎప్పటికప్పుడు వినియోగదారులను మోసం చేయడానికి రెడీగా ఉంటారు. స్కామర్ల యూపీఐ ఓటీపీల కోసం మోసం చేసేందుకు కాల్ మెర్జింగ్ ను ఉపయోగిస్తున్నారు. మోసగాళ్ల వలలో పడకుండా జాగ్రత్తగా ఉండాలని.. లేకుండా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించింది.
ALSO READ: TGPSC Group-1,2,3 Exams: ఈ ఏడాది మళ్లీ గ్రూప్-1,2,3 నోటిఫికేషన్లు.. ఈ తప్పులు చేయకండి..
కాల్ మెర్జింగ్ స్కామ్ అంటే ఇదే..
ఈ స్కామ్ అంటే ఓ తెలియని పర్సన్ మీకు కాల్ చేసి మీ ఫ్రెండ్ దగ్గర నుంచి నంబర్ తీసుకుని కాల్ చేస్తున్నట్లు మాట్లాడుతారు. ఆ తర్వాత మోసగాడు ఆ ఫ్రెండ్ వేరే నంబర్ నుంచి కాల్ చేస్తున్నాడని.. పేర్కొంటూ కాల్ మెర్జ్ చేయమని చెబుతాడు. కాల్ మెర్జ్ అయిన తర్వాత యూపీఐ వినియోగదారులకు తెలియకుండానే వారి బ్యాంక్ లింకైన అకౌంట్ ఓటీపీ వెరిఫికేషన్ కాల్ తో కనెక్ట్ అవుతారు. స్కామర్లు అదే సమయంలో మీ ఓటీపీని స్కాన్ చేస్తారు. ఆ తర్వాత కాల్ ద్వారా ఓటీపీ వినేస్తారు. ఓటీపీ పొందిన వెంటనే స్కామర్లు మీ బ్యాంక్ నుంచి ఒక్కసారిగా డబ్బులను ట్రాన్స్ ఫర్ చేసుకుంటారు.
ఈ జాగ్రత్తలు పాటించడి.. లేకుంటే అంతే సంగతులు..
1. తెలయని కాల్స్ వస్తే అస్సలు మెర్జ్ చేయవద్దు
2. ఎవరైనా తెలియని వారు కాల్ మెర్జ్ చేయమంటే.. తగు జాగ్రత్తలు పాటించాలి.
3. ఎవరైనా పలానా బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నాం.. అని చెబితే ఒక్కసారి వారి వివరానలు సవివరంగా తెలుసుకోండి.
4. ఓటీపీలను ఎవరితో షేర్ చేయకండి.
5. మీకు ఎలాంటి డౌట్ వచ్చినా వెంటనే 1930 కు కాల్ చేసి రిపొర్ట్ ఇవ్వండి.
ఇటీవల నిర్వహించిన ఓ సర్వేలో దేశంలో 1/3 వంతు మంది రియల్ టైమ్ పేమెంట్లకు సంబంధించిన మోసాలకు లోనయ్యారని రిపోర్టులో తేలింది. ఏది ఏమైనప్పటికి ఈ కాల్ మెర్జింగ్ స్కామ్ పట్ల జాగ్రత్తగా ఉండండి.