BigTV English

People Media Factory: విశ్వం సినిమా.. విశ్వప్రసాద్‌ను రోడ్డుకీడ్చిందిగా.. ?

People Media Factory: విశ్వం సినిమా.. విశ్వప్రసాద్‌ను రోడ్డుకీడ్చిందిగా.. ?

People Media Factory: టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థల్లో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఒకటి. అమెరికాలో బిజినెస్ మ్యాన్ గా గుర్తింపు తెచ్చుకున్న టీజీ విశ్వప్రసాద్.. 2017 లో  ఈ నిర్మాణ సంస్థను ప్రారంభించాడు. తమ సంసలో 100 చిత్రాలు పూర్తిచేయాలనేది  ఆయన కల. దానికోసమే విశ్వప్రసాద్ కష్టపడుతున్నాడు. ఇప్పటివరకు విజయాపజయాలను లెక్కచేయకుండా.. వరుస సినిమాలు చేస్తూ.. ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. కార్తికేయ 2, ధమాకా, బ్రో, ఈగల్, ఓ బేబీ.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో మంచి సినిమాలు పీపుల్ మీడియా నుంచి వచ్చినవే.


అంతెందుకు.. ఇప్పుడు పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ది రాజాసాబ్ సినిమా కూడా ఇదే సంస్థ నుంచి వస్తుంది. ప్రభాస్ – మారుతీ కాంబోలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై విశ్వప్రసాద్ చాలా ఆశలు పెట్టుకున్నారు. గత కొన్నేళ్లుగా ఈ నిర్మాణ సంస్థ ఒక మంచి విజయాన్ని అందుకున్నది లేదు. ఇలా ఆ లెక్కలన్నీ.. రాజాసాబ్ తో తీర్చాలని చూస్తున్నారు. అయితే ఈలోపే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ లీగల్ సమస్యల్లో ఇరుక్కుంది. షూటింగ్స్ ను కూడా నిలిపివేయాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు. అంతలా విశ్వప్రసాద్ ఏం చేశాడు.. ?  ఏంటి.. ? అనేది తెలుసుకుందాం.

ఒక నిర్మాణ సంస్థ అన్నాకా .. అన్ని నిర్మాతనే దగ్గరుండి చూసుకోవాలని లేదు. విశ్వప్రసాద్ కూడా తన సంస్థలో కొందరికి స్వేచ్ఛా  హస్తం ఇచ్చాడు. కొందరు మంచిగానే విజయాలను అందించారు. ఇంకొందరు పరాజయాలను రుచిచూపించారు. అయితే గతేడాది మాత్రం పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి వినాశకరమైన సంవత్సరం, నిర్మాణ సంస్థ గణనీయమైన నష్టాలను చవిచూసింది. గత సంవత్సరం వందల కోట్లు నష్టపోయినట్లు విశ్వ ప్రసాద్ స్వయంగా అంగీకరించాడు. ఇక అలా ఈ సంస్థకు నష్టాలను తీసుకొచ్చిన సినిమాల్లో విశ్వం ఒకటి.


మ్యాచో  స్టార్  గోపీచంద్- శ్రీనువైట్ల కాంబోలో తెరకెక్కిన చిత్రం విశ్వం.  చాలా గ్యాప్ తరువాత  శ్రీను వైట్ల తన మార్క్ కామెడీతో విశ్వం సినిమాను తెరకెక్కించాడు. గతేడాది రిలీజ్ అయిన ఈ సినిమాను దోనేపూడి చక్రపాణి సమర్పణలో చిత్రాలయం స్టూడియోస్, పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్స్ పై వేణు దోనెపూడి, ప్రభాకర్, టీజీ విశ్వ ప్రసాద్‌ నిర్మించారు. ఎన్నో అంచననాల మధ్య రిలీజ్ అయిన ఈ చిత్రం  ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయింది. ఇక పేరుకు ఇద్దరు నిర్మాతలు ఉన్నా కూడా విశ్వం సినిమాపై పెత్తనం మొత్తం విశ్వప్రసాద్ తీసుకున్నాడు. సరే, పర్లేదు.. సినిమా విడుదలైన తర్వాత తన పెట్టుబడిని తిరిగి ఇస్తాడు కదా అని వేణు కూడా ఒప్పంద పత్రాలుపై సంతకం పెట్టాడు. అయితే ఇక్కడే విశ్వప్రసాద్.. వేణును మోసం చేశాడు.

Akkineni Nagarjuna: అమలతో పెళ్లి.. నాన్న ఒప్పుకోలేదు.. ఆమెకు విడాకులు ఇచ్చి..

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ క్లోజ్డ్ డీల్స్ గురించి కానీ, డిజిటల్ ఒప్పందాల గురించి కానీ వేణుకు ఒక్క మాట అయినా చెప్పలేదు. తాను పెట్టుబడి పెట్టిన డబ్బులు వెనక్కి ఇచ్చింది లేదు. విశ్వం సినిమా  థియేటర్ లో ఆశించిన ఫలితాన్ని అందించలేకపోయినా కూడా ఓటీటీలో మాత్రం బాగానే డబ్బులు రాబట్టింది. ఆ ఆదాయానికి సంబంధించిన లెక్కలను కూడా విశ్వప్రసాద్ తన సహా నిర్మాతకు వివరించలేదు. ఈ విషయం గురించి మాట్లాడడానికి  వేణు కాల్ చేసినా.. పీపుల్  మీడియా  ఫ్యాక్టరీ స్పందించలేదు. దీంతో చేసేదేమి లేక చిత్రాలయం స్టూడియోస్ అధినేత వేణు దోనెపూడి నిర్మాతల మండలి మరియు ఫిల్మ్ ఛాంబర్ లో న్యాయం కోసం పోరాటం మొదలుపెట్టాడు.

విశ్వం సినిమా కోసం పనిచేసిన  చాలామంది టెక్నీషయన్స్ కు పేమెంట్స్ ఇంకా అందలేదని, దర్శకుడు శ్రీను వైట్ల నుండి సంగీత దర్శకుడు, సినిమాటోగ్రాఫర్, ఎడిటర్ మరియు రచయిత వరకు ఎవరికి ఇంకా పూర్తి డబ్బులు చెల్లించలేదని సమాచారం. అంతేకాకుండా మ్యూజిక్ డైరెక్టర్ చైతన్ భరద్వాజ్ కు ఇంకా సగం రెమ్యూనరేషన్  ఇవ్వాలని, సింగర్స్ కు కూడా విశ్వప్రసాద్ రెమ్యూనరేషన్ ఇవ్వలేదట. ఇక దీంతో వారి బకాయిలు చెల్లించేవరకు పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో షూటింగ్ జరుపుకుంటున్న సినిమాలు మొత్తం ఆపేయాలని ఆయన డిమాండ్ చేశారు.

పాక్షిక చెల్లింపులు జరిగే వరకు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడక్షన్స్ యొక్క కొన్ని షూట్‌లు నిలిపివేయబడ్డాయి. నిర్మాణ సంస్థ నిర్లక్ష్యంపై టెక్నీషియన్స్ ఫైర్ అవుతున్నారు. తమకు రావాల్సిన బకాయిలు వచ్చేవరకు  ఇక్కడ నుంచి కదిలేది లేదని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఆఫీస్ ముందు  కూర్చొని నిరసన తెలియజేస్తున్నారు. నిర్మాత వేణు.. తన ఆర్థిక వివాదం పరిష్కారమయ్యే వరకు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ రాబోయే విడుదలలను నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నాడు. తెలుగు సినిమా యూనియన్లు మరియు సంఘాలు కూడా ఇదే విధానాన్ని అనుసరిస్తున్నాయి. విశ్వం సినిమా.. విశ్వప్రసాద్ ను రోడ్డెక్కించేలా ఉందే అని టాలీవుడ్ లో టాక్ నడుస్తోంది. కనీసం ఇప్పుడైనా ఆయన బకాయిలనుచెల్లించి.. పరువు కాపాడుకుంటే బావుంటుందని కొంతమంది చెప్పుకొస్తున్నారు. మరి ఈ సమస్య నుంచి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఎలా బయటపడుతుందో చూడాలి.

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×