BigTV English

Swag Teaser: ఈసారి మగపిల్లాడు పుడితే చంపేస్తా.. మగజాతిని కాపాడేవారే లేరా..?

Swag Teaser: ఈసారి మగపిల్లాడు పుడితే చంపేస్తా.. మగజాతిని కాపాడేవారే లేరా..?

Swag Teaser: డిఫరెంట్.. డిఫరెంట్ కథలను ఎంచుకుంటూ విజయాలను అందుకుంటున్న హీరో శ్రీవిష్ణు. ఈ ఏడాది ఓం భీమ్ బుష్ తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన శ్రీవిష్ణు.. ఈసారి స్వాగ్ తో వస్తున్నాడు. హషిత్ గోలి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై వటీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభోట్ల నిర్మిస్తున్నారు.


ఇక ఈ సినిమాలో రీతువర్మ  హీరోయిన్ గా నటిస్తుండగా..  సీనియర్ హీరోయిన్ మీరా జాస్మిన్, కుర్ర హీరోయిన్ దక్షా నగార్కర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మగజాతిని కాపాడడానికి స్వాగణిక వంశం ఎలాంటి కష్టాలు పడిందో ఈ సినిమాలో చూపించారు. ఇప్పటివరకు ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, ఫస్ట్ గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

ఇక తాజాగా ఈ సినిమా టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. టీజర్  ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ఒకటి కాదు రెండు కాదు నాలుగు విభిన్నమైన పాత్రల్లో శ్రీవిష్ణు కనిపిస్తున్నాడు. “శతాబ్దాల క్రితం మగవాడి ఉనికి సైతం చిగురుటాకులా వణికిపోతున్న శకంలో.. అంటూ గోపరాజు రమణ  వాయిస్ తో మొదలైన టీజర్ లో మగవారు పుడితే చంపేసే అతి క్రూరమైన రాణిగా రీతూవర్మ కనిపించింది. మగపిల్లలు పుడితే చంపేయడానికి కూడా సిద్దపడింది.


ఇక అలాంటి శతాబ్దంలో మగవారి ఉనికి కాపాడడానికి వారసుడు రావాలని ప్రజలు కోరుకుంటారు. అలా వచ్చినవారసుడు ఎవరు. ? సింగా, భవభూతి,యయతి లలో  వారసుడు ఎవరు.. ? అనేది ట్విస్ట్ గా చూపించారు. రాజుల కాలం నుంచి భూత్, భవిష్యత్ లో మగవాడి ఉనికిని ఎలా కాపాడారు అనేది కథగా తెలుస్తోంది. టీజర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో  శ్రీవిష్ణు ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×