BigTV English
Advertisement

Sreeleela : ఓర్నీ ఇది డ్యాన్సా.. శ్రీలీల డ్యాన్స్ పై సెటైర్స్..

Sreeleela : ఓర్నీ ఇది డ్యాన్సా.. శ్రీలీల డ్యాన్స్ పై సెటైర్స్..

Sreeleela : టాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రీలీలా ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. మొదటి సినిమాతోనే స్టార్ ఇమేజ్ ను అందుకోవడం మాత్రమే కాదు. వరుస సినిమా అవకాశాలను అందుకుంటూ యూత్ క్రష్ గా మారిపోయింది. రవితేజ, బాలయ్య వంటి స్టార్ హీరోలతో సినిమాలు చేసి అతి తక్కువ కాలంలోనే స్టార్ ఇమేజ్ ను అందుకుంది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటూ వస్తుంది.. ఇప్పుడిప్పుడే మళ్లీ సినిమాల్లో బిజీ అవుతున్న పాప సోషల్ మీడియాలో కూడా రచ్చ చేస్తుంది.. తాజాగా ఈ అమ్మడు ఓ డ్యాన్స్ వీడియోను షేర్ చేసింది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..


రాబిన్ హుడ్ సినిమా షూటింగ్ లో శ్రీలీల..

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్‌, శ్రీలీల జంటగా వెంకీ కుడుముల దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం ‘రాబిన్‌హుడ్‌’. మైత్రీ మూవీస్‌ బ్యానర్‌పై నవీన్‌ యర్నేని, వై.రవిశంకర్‌ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతోంది. ఈ సినిమాలోని ఓ కీలక షెడ్యూల్‌ ఆస్ట్రేలియాలో ప్రారంభమైంది. ఈ షెడ్యూల్‌లో నితిన్‌, శ్రీలీలపై ఓ డ్యూయెట్‌ చిత్రీకరిస్తున్నారు. అయితే ఈ డ్యాన్స్ షూటింగ్ లో బ్రేక్ దొరకడం తో అమ్మడు సీనియర్ ఎన్టీఆర్ హిట్ సాంగ్ లేచింది.. నిద్ర లేచింది మహిళా లోకం సాంగ్ కు తన దైన స్టైల్లో స్టెప్పులు వేసింది. ఆ వీడియోలో నితిన్ కూడా ఉన్నాడు. ఆ వీడియోను ఆమె సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు. ప్రస్తుతం వీడియో వైరల్ అవుతుంది. దీన్ని చూసిన నందమూరి ఫ్యాన్స్ దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు.


sreeleela dance video viral in social media
sreeleela dance video viral in social media

నితిన్ ముందే పెద్దాయనకు అవమానం..

తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎన్టీఆర్ గారు అక్కినేని గారు ప్రతీక.. వీళ్ల సినిమాలు ఏ రేంజులో ఆకట్టుకున్నాయో.. సినిమాల్లోని పాటలు కూడా సంగీత ప్రియులను బాగా ఆకట్టుకున్నాయి. ఇక వీళ్ళ సాంగ్స్ ని ఎవరు ట్రోల్ చేసినా ఎవరు ఇబ్బంది పెట్టిన అవమానించినట్టే.. ఆ రోజుల్లో చాలామంది వాళ్ళని ఇన్స్పైర్ తీసుకొని చాలామంది హీరోలుగా ఆర్టిస్టులుగా మారారు. తెలుగులో సాయి పల్లవి,శ్రీలీల గుర్తింపు డాన్సులతో గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి డ్యాన్స్ ను అవమానించేలా ఎప్పుడూ డ్యాన్స్ చెయ్యలేదు.. శ్రీలీల ఇలా చెయ్యడం ఎంతటి అవమానం.. అది కూడా నితిన్ ముందే పెద్దాయనను ఎక్కించేలా డ్యాన్స్ చెయ్యడం ఏంటని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.. ఇక రాబిన్ హుడ్ సినిమా డిసెంబర్‌ 20న విడుదలవనుంది. ఈ చిత్రంలో రాజేంద్రప్రసాద్‌, వెన్నెల కిశోర్‌, బ్రహ్మాజీ కీలక పాత్రలు పోషిస్తున్నారు..

ఇక శ్రీలీల సినిమాల విషయానికొస్తే.. సిద్ధార్థ్‌ మల్హోత్రా ‘మిట్టి’ అనే చిత్రంలో నటిస్తున్నట్లు కొన్ని రోజులుగా వార్తలు వస్తోన్న సంగతి తెలిసిందే. తెలుగులో నితిన్, రవితేజ సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తుంది.. ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’ సినిమాలతో బిజీగా ఉంది శ్రీలీల. అలాగే బాలీవుడ్ లో కూడా బంఫర్ ఆఫర్ పట్టేసిందని టాక్.. త్వరలోనే ఈ సినిమాలను అనౌన్స్ చేయబోతుందని సమాచారం..

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×