Sreeleela: టాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రీ లీల(Sree Leela) ప్రస్తుతం పలు ప్రాజెక్టులతో కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఈమె చివరిగా మహేష్ బాబు హీరోగా నటించిన గుంటూరు కారం(Gunturu Kaaram) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఈ సినిమా మాత్రం అనుకున్న స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయింది. ఇక ఈ సినిమా తర్వాత శ్రీ లీల అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప 2 సినిమాలో “కిస్సిక్ ” అనే స్పెషల్ సాంగ్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి పాన్ ఇండియా స్థాయిలో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇక ప్రస్తుతం శ్రీ లీల బాలీవుడ్ సినిమా అవకాశాలను అందుకుంటూ ఎంతో బిజీగా గడుపుతున్నారు.
కథ మొత్తం మార్చేసారా…
ఇక తెలుగు సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం ఈమె హరీష్ శంకర్ (Harish Shankar)దర్శకత్వంలో పవన్ కళ్యాణ్(Pawan Kalyan) హీరోగా నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్(Ustad Bhagath Singh) సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ సినిమాతో పాటు రవితేజ మాస్ జాతర, అఖిల్ లెనిన్ సినిమాలో హీరోయిన్గా నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం శ్రీ లీల ఉస్తాద్ సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో షూటింగ్ పనులను జరుపుకుంటుంది.
రేడియో జాకీగా…
ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమాలో శ్రీ లీల పాత్ర గురించి ఒక వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. ఈ సినిమాలో ఈమె ఇదివరకు టీచర్ పాత్రలో(Teacher Role)నటించబోతుందంటూ వార్తలు వచ్చాయి కానీ ప్రస్తుతం మాత్రం శ్రీ లీల టీచర్ పాత్రలో నటించడం లేదని రేడియో జాకీగా (Radio Jockey)నటించబోతుందనే వార్త బయటకు వచ్చింది. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కాకముందు రాసిన కథ ప్రకారం శ్రీ లీల ఈ సినిమాలో ఒక టీచర్ పాత్రలో నటించాల్సి ఉండేదట. అయితే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత కథ మొత్తం మార్పులు చేశారని తెలుస్తుంది.
Sreeleela as Radio Jockey in #UstaadBhagatSingh 💥💥💥#PawanKalyan #Sreeleela #UBS pic.twitter.com/gaB8pM6MH6
— Let's X Cinematica (@letsXCinematica) June 15, 2025
ఇలా కథలో మార్పులు చేయడంతో శ్రీ లీల టీచర్ పాత్ర కాస్త రేడియో జాకీగా మారిపోయారని తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారు. ప్రస్తుతం ఈయన కూడా ఈ సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. నెలరోజులపాటు జరుపుకొనే ఈ షెడ్యూల్ షూటింగ్లో పవన్ కళ్యాణ్ తన పాత్రకు సంబంధించిన సన్నివేశాలను పూర్తి చేయబోతున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ శ్రీ లీల కాంబినేషన్ లో ఉండే సన్నివేశాలను పూర్తి చేస్తున్నట్టు సమాచారం. ఇక ఇండస్ట్రీ లోకి వచ్చినట్లు తక్కువ సమయంలోనే శ్రీ లీల స్టార్ హీరోలతో నటించే అవకాశాలను అందుకొని కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. ఇలా తెలుగు సినిమాలతో పాటు బాలీవుడ్ సినిమాలలో నటిస్తూ శ్రీ లీల క్షణం తీరిక లేకుండా బిజీ అయ్యారు.