Mustard Oil For Black Hair: కాలుష్యం, ఒత్తిడి కారణంగా.. జుట్టు చిన్న వయస్సులోనే రంగు మారడం ప్రారంభమవుతుంది. ఇలాంటి పరిస్థితిలో జుట్టును నల్లగా, మందంగా మార్చడానికి ఆవ నూనె చాలా బాగా ఉపయోగపడుతుంది. ఆవ నూనె జుట్టు చిట్లడం, రాలడాన్ని పూర్తిగా నివారిస్తుంది. అంతే కాకుండా జుట్టు పెరగడాన్ని ప్రోత్సహిస్తుంది. ఇదిలా ఉంటే ఆవ నూనెతో కొన్ని రకాల పదార్థాలను కలపడం ద్వారా జుట్టు సహజంగా నల్లగా మారుతుంది. ఏ ఏ పదార్థాలను ఆవ నూనెలో కలిపి వాడాలనే విషయాలను గురించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
1. ఆవాల నూనె, కరివేపాకు:
కరివేపాకు జుట్టుకు చాలా మేలు చేస్తుంది. జుట్టు నల్లబడటంతో పాటు.. చుండ్రు కూడా తొలగిస్తుంది. ఆవ నూనెలో కరివేపాకు వేసి తయారు చేసిన నూనె జుట్టు పెరగడంతో పాటు నల్లగా మారేందుకు ఉపయోగపడుతుంది.
కావాల్సనవి:
ఆవాల నూనె- చిన్న కప్పు
కరివేపాకు- గుప్పెడు
తయారీ విధానం:
ఒక మందపాటి ప్యాన్ తీసుకుని అందులో పైన తెలిపిన మోతాదులో ఆవాల నూనె తీసుకుని వేడి చేయాలి.తర్వాత కరివేపాకు వేసి నూనె గోధుమ రంగు వచ్చే వరకు వేడి చేసి గ్యాస్ ఆఫ్ చేయాలి. చల్లారిన తర్వాత నూనెను వడకట్టాలి. ఈ నూనెతో జుట్టు మూలాలను తేలికగా మసాజ్ చేసి.. 1-2 గంటల తర్వాత కడిగేయండి. వారానికి రెండుసార్లు దీనిని వాడటం వల్ల జుట్టు నల్లగా, బలంగా మారుతుంది.
2.ఆవ నూనె, హెన్నా:
హెన్నా జుట్టును సహజంగా నల్లగా చేయడంలో సహాయపడుతుంది. అంతే కాకుండా ఆవ నూనెతో కలిపి హెన్నాను జుట్టుకు అప్లై చేయడం వల్ల జుట్టుకు పోషణ లభిస్తుంది.
కావాల్సినవి:
హెన్నా పౌడర్- ఒక కప్పు
ఆవ నూనె- 3 టీ స్పూన్లు
తయారీ విధానం:
పై పదార్థాలను తగిన మోతాదులో తీసుకుని వాటికి కొద్దిగా నీరు కలిప పేస్ట్ తయారు చేసుకోండి. ఈ పేస్ట్‌ను జుట్టుకు అప్లై చేసి 2-3 గంటలు అలాగే ఉంచి.. తర్వాత షాంపూతో తలస్నానం చేయండి. నెలకు రెండుసార్లు దీనిని వాడటం వల్ల జుట్టు తెల్లబడటం తగ్గుతుంది. అంతే కాకుండా జుట్టు మృదువుగా మారుతుంది. తెల్ల జుట్టు నల్లగా మారేందుకు దీనిని తరచుగా వాడటం చాలా మంచిది.
Also Read: మామిడి ఆకులను ఇలా వాడితే.. జుట్టు వద్దన్నా పెరుగుతుంది తెలుసా ?
3.ఆవాల నూనె, ఉసిరి:
ఉసిరిలో విటమిన్ సి , యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది జుట్టు నల్లబడటానికి పెరుగుదలకు చాలా మంచిది.
కావాల్సినవి:
ఉసిరి పొడి- 2 టేబుల్ స్పూన్లు
ఆవాల నూనె- 4 టేబుల్ స్పూన్లు
తయారీ విధానం:
పైన తెలిపిన మోతాదులో ఆవ నూనెలో ఉసిరి పొడిని కలిపి కొద్దిగా వేడి చేసి జుట్టు మూలాలపై రాయండి. 30 నిమిషాల తర్వాత కడిగేయండి. వారానికి రెండుసార్లు దీనిని వాడటం వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది. అంతే కాకుండా జుట్టు రంగు ముదురు రంగులోకి మారుతుంది. దీనిని తరచుగా దాడటం వల్ల జుట్టు రాలడం కూడా చాలా వరకు తగ్గుతుంది.
Also Read: డైలీ ఇలా చేస్తే.. అమ్మాయిలే అసూయపడే అందం