Mohan Babu: టాలీవుడ్ సీనియర్ నటుడు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు (Mohan Babu)త్వరలోనే తన సొంత నిర్మాణ సంస్థలో తెరకెక్కించిన కన్నప్ప (Kannappa) అనే పాన్ ఇండియా సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. మంచు విష్ణు (Manchu Vishnu)ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా జూన్ 27వ తేదీ విడుదల కాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదల కాగా ఈ ట్రైలర్ సినిమాపై మంచి అంచనాలను పెంచేసింది. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా మోహన్ బాబు తన సినీ కెరియర్ గురించి ఎన్నో విషయాలు అందరితో పంచుకున్నారు.
ఆర్థిక ఇబ్బందులు..
ఇకపోతే కన్నప్ప సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతున్న నేపథ్యంలో ఈ సినిమాలో ఇతర భాష నటీనటులు కూడా భాగమైన విషయం తెలిసినదే.. ఇందులో భాగంగానే మోహన్ లాల్ (Mohanlal)కూడా కీలకపాత్రలో నటించబోతున్నారు తాజాగా విడుదల చేసిన ఈ ట్రైలర్ లాంచ్ కార్యక్రమానికి మోహన్ లాల్ రావటంతో అతని గురించి మోహన్ బాబు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. మోహన్ బాబు హీరోగా విలన్ గా మాత్రమే కాకుండా నిర్మాతగా మారి పలు సినిమాలను నిర్మించిన విషయం తెలిసిందే.
అల్లుడుగారు..
మోహన్ బాబు నిర్మాతగా తెరకెక్కించిన సినిమాలు ఫ్లాప్ అవ్వటమేకాకుండా అప్పటివరకు సినిమాలలో సంపాదించింది మొత్తం పోగొట్టుకున్నారు. ఇలా 1990లో ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో మోహన్ లాల్ నటించిన చిత్రం సినిమా(Chitram Movie) చూడమని నాకు కే రాఘవేంద్రరావు సలహా ఇచ్చారు నువ్వు కనుక ఈ సినిమా నిర్మిస్తే నేను దర్శకత్వం వహిస్తానని ఆయన తెలిపారు. ఇలా ఈ సినిమా రీమేక్ హక్కులను తాను కొనుగోలు చేసి నిర్మాతగా మారి ఈ సినిమాను చేశానని తెలిపారు. అయితే అప్పటివరకు ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నాకు అల్లుడుగారు(Alludu Garu) సినిమా ద్వారా మంచి సక్సెస్ రావడమే కాకుండా టాప్ హీరోగా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవడం, ఆర్థికంగా స్థిరపడటం కూడా జరిగిందని మోహన్ బాబు తెలిపారు.
భారీ బడ్జెట్ చిత్రం…
ఆరోజు మోహన్ లాల్ నటించిన చిత్రం సినిమానే నన్ను హీరోగా మళ్లీ నిలబెట్టిందని ఈ సందర్భంగా ఈయన తెలియజేశారు. ఈ సినిమా 100 రోజులు వేడుకకు మోహన్ లాల్ ను కూడా ఆహ్వానించామని ఆరోజు అతను ఎలా ఉన్నారో ఇప్పటికీ అలాగే ఉన్నారని మోహన్ లాల్ గురించి ఎంతో గొప్పగా వర్ణించారు.ఇక కన్నప్ప సినిమా విషయాని కొస్తే శివయ్య పరమ భక్తుడు భక్త కన్నప్ప కథ ఆధారంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. బాలీవుడ్ దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ (Mukesh Kumar Singh)దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జూన్ 27 తేది రాబోతున్న నేపథ్యంలో సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. చాలా రోజుల తర్వాత కన్నప్ప ద్వారా రాబోతున్న విష్ణు ఈ సినిమాతో ఎలాంటి సక్సెస్ అందుకుంటారో తెలియాల్సి ఉంది.