Sree Leela.. కన్నడ బ్యూటీ శ్రీలీల(Sree Leela) తొలిసారి తెలుగులో ‘పెళ్లి సందD’ సినిమాతో అడుగుపెట్టింది. ఇక తర్వాత రవితేజ(Raviteja) ధమాకా (Dhamaka)సినిమాతో ఓవర్ నైట్ లోనే స్టార్ స్టేటస్ ను అందుకుంది. అదే దూకుడుతో ఒకే ఏడాది ఏకంగా తొమ్మిది సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది శ్రీ లీల. అయితే అందులో ఈమె నటించిన కొన్ని సినిమాలు డిజాస్టర్ గా నిలవగా, మరికొన్ని సినిమాల నుంచి తప్పించినట్లు సమాచారం. ప్రస్తుతం సరైన అవకాశం కోసం ఎదురుచూస్తున్న ఈ ముద్దుగుమ్మ.. తాజాగా బంపర్ ఆఫర్ కొట్టేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
బాలయ్య షో లో శ్రీలీల..
ప్రస్తుతం శ్రీ లీల నేషనల్ వైడ్ గా ట్రెండ్ అవుతోంది. ‘పుష్ప 2’ (Pushpa -2) లో ‘కిస్సిక్’ సాంగ్ తో సోషల్ మీడియానే షేక్ చేస్తోంది అని చెప్పవచ్చు. ఇప్పుడు ఇదే జోష్లో బాలయ్య (Balayya ) అన్ స్టాపబుల్ (Unstoppable) షో కి కూడా హాజరయ్యారు. అయితే ఇక్కడ అనూహ్యంగా యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి (Naveen polishetty)తో కలిసి షోకి హాజరవడంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే వీరిద్దరూ గతంలో కూడా నటించలేదు. ఇప్పుడు నటిస్తున్నట్టు ఆధారాలు కూడా లేవు. అలాంటిది వీరిద్దరూ రావడంతో అభిమానులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే గతంలో ‘అనగనగా ఒక రాజు’ సినిమాలో వీరిద్దరూ నటించాల్సి ఉంది. కానీ ఈ సినిమా అటకెక్కింది అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇకపోతే మళ్లీ తెరపై ఈ కాంబో కనిపిస్తుందో లేదో తెలియదు కానీ ప్రస్తుతం అన్ స్టాపబుల్ షో లో అయితే కనిపించనున్నారు. ఇప్పటికే వీరికి సంబంధించిన షూటింగ్ కూడా ప్రారంభమైనట్లు సమాచారం.
శివ కార్తికేయన్ తో నటించే అవకాశం..
ఇదిలా ఉండగా తాజాగా ఈమె శివ కార్తికేయన్ (Shiva Karthikeyan) తో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇదే నిజమైతే ఈ చిత్రంతో కోలీవుడ్ రంగ ప్రవేశం కూడా చేస్తుందని చెప్పవచ్చు. ప్రస్తుతం శివ కార్తికేయన్ ‘అమరన్’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు. ప్రస్తుతం ఏ.ఆర్.మురగదాస్ (AR .Muragadas)దర్శకత్వంలో ఒక సినిమా కూడా చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత లేడీ డైరెక్టర్ సుధా కొంగర (Sudha kongara)తో ఒక సినిమా చేయడానికి సిద్ధమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు ఈ చిత్రానికి ‘పురనానూరు’ అని టైటిల్ ని కూడా ఫిక్స్ చేసినట్టు సమాచారం. ఇకపోతే చారిత్రక నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో శ్రీ లీల ఫైనల్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రానుందని సమాచారం..
ఫుల్ స్వింగ్ లో ఉన్న శ్రీ లీల..
ఇకపోతే ప్రస్తుతం పుష్ప -2 ఐటమ్ సాంగ్ తో భారీ పాపులారిటీ అందుకున్న ఈమె సినిమా విడుదలయితే మరింత క్రేజ్ లభిస్తుంది. ఇక మరోవైపు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ‘ఉస్తాద్ భగత్ సింగ్’ తో పాటు ‘రాబిన్ హుడ్’ చిత్రాలలో కూడా నటిస్తోంది. ఈ సినిమాలు గనక మంచి విజయం సాధిస్తే, ఇక శ్రీ లీలను అడ్డుకోవడం ఎవరి తరం కాదు అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి అయితే ఇప్పుడు శ్రీలీల నక్కతోక తొక్కిందనే వార్తలు వ్యక్తం అవుతున్నాయి.