Pimples Problems: ప్రస్తుతం చాలా మంది మొటిమల సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. వీటిని తగ్గించుకోవడానికి అనేక రకాల స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ కూడా వాడుతుంటారు. వీటిని రసాయనాలతో తయారు చేస్తారు. అందుకే వీటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది. ఇదిలా ఉంటే మొటిమలను తగ్గించుకోవడానికి మార్కెట్ లో దొరికే స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ వాడకుండా హోం రెమెడీస్ వాడటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. చలికాలంలో మొటిమలు,మొటిమల సమస్య ఎక్కువైతే మాత్రం హోం రెమెడీస్ తప్పకుండా వాడండి.
వింటర్ లో మొటిమలకు బెస్ట్ ఫేస్ ప్యాక్:
చలికాలంలో కొందరిలో మొటిమల సమస్య పెరుగుతుంది. ఆయిలీ స్కిన్‌తో పాటు, డ్రై స్కిన్ ఉన్నవారు కూడా చలి కాలంలో తరచుగా మొటిమల సమస్యను ఎదుర్కోవలసి ఉంటుంది. దీనికి కారణం సెబమ్ ఉత్పత్తి. నిజానికి చలికాలంలో బయటి గాలి వల్ల చర్మం పొడిబారడం ప్రారంభమవుతుంది. ఇలా చర్మం పొడిబారకుండా కాపాడుకోవడానికి, చర్మం సెబమ్ ఉత్పత్తిని పెంచుతుంది. దీని కారణంగా, జిడ్డు చర్మం ఉన్నవారికి మొటిమలు పెరుగుతాయి. అలాగే పొడి చర్మం ఉన్న వారికి మొటిమలు కూడా ఈ సీజన్‌లో ఎక్కువవుతుంటాయి.
చలికాలంలో మొటిమలు ఎందుకు వస్తాయి ?
శీతాకాలంలో, చర్మంలో సెబమ్ ఉత్పత్తి పెరుగుతుంది. దీంతో చర్మ కణాలు కలిసి ఉంటాయి. దీని కారణంగా చర్మ రంధ్రాలు మూసుకుపోవడం మొదలవుతుంది. ఫలితంగా మొటిమలు ఎక్కవవుతూ ఉంటాయి. అటువంటి పరిస్థితిలో మొటిమల సమస్యను ఎలా ఎదుర్కోవాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం.
వేడి నీళ్ల వాడకం:
చలికాలంలో వేడి నీళ్లతో ముఖం కడుక్కోవడం వల్ల చర్మం హైడ్రేషన్ కోల్పోవడం మొదలవుతుంది. అందువల్ల చర్మం పొడిబారుతుంది. ఫలితంగా మొటిమలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
చలికాలంలో మొటిమలు ఎక్కువవుతుంటే రాత్రిపూట కలబంద జెల్‌ను అప్లై చేసి, ఉదయాన్నే ముఖం కడుక్కోవాలి. ఇది ముఖంపై ఉన్న నూనెను నియంత్రించడమే కాకుండా, మొటిమల నుండి ఉపశమనాన్ని అందిస్తుంది. అంతే కాకుండా ముఖంపై వచ్చే చికాకును కూడా తగ్గిస్తుంది.
ఈ ఫేస్ ప్యాక్ ను మొటిమలపై అప్లై చేయండి:
ఒక చెంచా దాల్చిన చెక్క పొడిని తీసుకుని, దానికి 1 టీ స్పూన్ మెంతిపొడి వేసి కలపండి. సుమారు ఒక చెంచా తేనె, కొన్ని చుక్కల నిమ్మరసం వేసి, చిక్కటి స్టిక్కీ పేస్ట్‌లా తయారు చేయాలి. తర్వాత ఈ పేస్ట్‌ను మొటిమలపై మాత్రమే రాసి వదిలేయండి. రెండు మూడు గంటల తర్వాత లేదా రాత్రిపూట నీటితో మీ ఫేస్ శుభ్రం చేసుకోండి. ఈ ఫేస్ ప్యాక్ మొటిమలను తొలగించడంలో సహాయపడుతుంది.
Also Read: మీ స్కిన్ 10 నిమిషాల్లోనే మెరిసిపోవాలా ? అయితే ఇలా చేయండి
ఓట్స్ ఫేస్ ప్యాక్:
ఓట్స్ పౌడర్, తేనె, పెరుగును సమపాళ్లలో తీసుకుని పేస్ట్ లా చేసి ముఖానికి పట్టించాలి. 15 నిమిషాల తర్వాత వాష్ చేయండి. ఇది స్కిన్ ఇరిటేషన్ నుండి ఉపశమనం పొందడంలో, మొటిమలను తొలగించడంలో సహాయపడుతుంది. తరుచుగా ఈ ఫేస్ ప్యాక్ లను వాడటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అంతే కాకుండా మొటిమలు తగ్గడంలో ఇవి చాలా ప్రభావవతంగా ఉంటాయి. ఇందులోని పోషకాలు మొటిమలు రాకుండా చేస్తాయి. అంతే కాకుండా ముఖాన్ని మెరిసేలా చేస్తాయి.
గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.