E-Paper
Advertisement

Sreenath Bhasi : యాక్సిడెంట్ చేసి పరార్… ప్రముఖ నటుడు అరెస్ట్

Sreenath Bhasi : యాక్సిడెంట్ చేసి పరార్… ప్రముఖ నటుడు అరెస్ట్
Advertisement

Sreenath Bhasi : ప్రముఖ మలయాల నటుడు శ్రీనాథ్ భాసి తాజాగా హిట్ అండ్ రన్ కేసులో అరెస్ట్ అయ్యాడు. కానీ అరెస్టు అయిన కాసేపటికి అతడిని బెయిల్ పై పోలీసులు రిలీజ్ చేయడం గమనార్హం.

అసలేం జరిగిందంటే…

Advertisement

మలయాల నటుడు శ్రీనాథ్ భాసి గత కొంతకాలంగా వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నాడు. ‘మంజుమ్మెల్ బాయ్స్’ సినిమాతో మంచి గుర్తింపు దక్కించుకున్న ఈ నటుడు గత నెలలో కార్లో వెళుతూ బైక్ ను ఢీ కొట్టినట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో బైకర్ తీవ్రంగా గాయపడినప్పటికీ శ్రీనాథ్ కారు ఆపకుండా అక్కడి నుంచి వెళ్లిపోయాడని తెలుస్తోంది. దీంతో బాధితుడి ఫిర్యాదు మేరకు ఎర్నాకులం సెంట్రల్ పోలీసులు కేసును నమోదు చేశారు. ఈ కేసులో శ్రీనాథ్ సోమవారం విచారణకు హాజరుకాగా, అతని అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. కానీ అలా అరెస్ట్ చేసిన కాసేపటికి అతన్ని బెయిల్ పై రిలీజ్ చేసినట్టు ఓ పోలీస్ అధికారి వెల్లడించారు. సెప్టెంబర్ 15న భాసి ప్రయాణిస్తున్న కారు మట్టంచెరి నివాసి మొహమ్మద్ ఫహీమ్ ను ఢీకొట్టడంతో ఈ ఘటన జరిగింది. ఇక ప్రమాదం జరిగిన టైంలో నటుడితో పాటు ఇతర వ్యక్తులను కూడా పోలీసులు ఆరా తీస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఘటనపై కొచ్చి సెంట్రల్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే బాధితుడు కారు ఆపలేదు, ప్రమాదం వల్ల కాలు విరిగినప్పుడు తనను ఆసుపత్రికి తరలించలేదు అనే ఆరోపణలతో అతనిపై కేసును నమోదు చేసినట్టు సమాచారం. కానీ అసలు తనకు యాక్సిడెంట్ జరిగినట్టే తెలియదని నటుడు చెప్పినట్టుగా తెలుస్తోంది. కాగా ఈ ఘటనలో శ్రీనాథ్ భాసిపై ఎలాంటి తీవ్రమైన అభియోగాలు నమోదు కాలేదని, విధివిధానాల్లో భాగంగానే అతని కాల్ చేసి అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు.

మరోవైపు మద్యం మత్తులో వాహనం నడిపి ప్రమాదానికి కారణమైన నటుడు బైజు సంతోష్‌పై కూడా పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. తిరువనంతపురంలోని వెల్లయంపాలెం వద్ద ఆదివారం అర్ధరాత్రి ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టి తోసేశారనేది ఫిర్యాదు. నటుడిపై మ్యూజియం పోలీసులు కేసు నమోదు చేశారు. నటుడు మితిమీరిన వేగంతో డ్రైవ్ చేసినట్లు సమాచారం. అనంతరం పోలీసులు బైజును బెయిల్‌పై విడుదల చేశారు.

Advertisement

డ్రగ్స్ కేసులో విచారణ

కుందకన్నూర్ లోని ఒక లగ్జరీ హోటల్లో జరిగిన డ్రగ్స్ పార్టీలో పాల్గొన్నాడు అన్న అనుమానంతో భాసిని ఇప్పటికే పోలీసులు విచారించిన సంగతి తెలిసిందే. పేరు మోసిన గ్యాంగ్ స్టర్ ఓం ప్రకాష్ ఈ పార్టీకి ఆతిథ్యం ఇవ్వగా, ఇందులో దాదాపు 20 మంది దాకా పాల్గొన్నారని పోలీసులు నిర్ధారించారు. అందులో నటి ప్రయాగ మార్టిన్, శ్రీనాథ్ భాసి ఈ గ్యాంగ్ స్టర్ ను సందర్శించినట్టుగా పోలీసులు గుర్తించారు. అయితే విచారణ తర్వాత పోలీసులు ప్రయోగ మార్టిన్ ను వదిలేసారు. అయితే నగరంలో జరిగే డీజే పార్టీలో కొకైన్ దిగుమతి చేస్తున్నారనే పక్కా సమాచారంతో గ్యాంగ్స్టర్ ఓం ప్రకాష్ తో పాటు అతని సహచరుడు శిహాస్ ను ఓ లగ్జరీ హోటల్లో పట్టుకున్నారు పోలీసులు. అలాగే డ్రగ్స్ కేసులో శ్రీనాథ్ బాసిని ఇటీవల విచారించిన పోలీసులు ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో క్లీన్ చిట్ ఇచ్చారు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×