BigTV English

Swag: సింగరో సింగా.. జరా నువ్వు సైడ్ పోరా లంగా

Swag: సింగరో సింగా.. జరా నువ్వు సైడ్ పోరా లంగా

Swag: ట్యాలెంటెడ్ హీరో శ్రీవిష్ణు, రీతూ వర్మ జంటగా నటిస్తున్న చిత్రం స్వాగ్. హసిత్ గోలి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజ్ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో దక్షా నగార్కర్, మీరా జాస్మిన్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.


ఇక వారం నుంచి సింగా.. సింగా అని సోషల్ మీడియాను షేక్ చేసి స్వాగ్ లో మొదటి పాట సింగరో సింగా వస్తుందని చెప్పుకొచ్చారు. బాబా సెహగల్, సింగా కలిసి వస్తున్నారని చెప్పుకొచ్చారు. ఇక తాజాగా సింగరో సింగా ఫుల్ లిరికల్ సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేసారు. సాంగ్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది.

సింగా అసలు పేరు సింగరేణి. ఈ సినిమాలో సింగరేణి అనే పాత్రలో శ్రీవిష్ణు కనిపించనున్నాడు. ఇక అతనికి జోడిగా దక్ష కనిపించనున్నట్లు తెలుస్తోంది. సాంగ్ మాత్రం చాలా హుషారుగా ఉంది. సోషల్ మీడియాకు ఎడిక్ట్ అయిన సింగా గురించి సాంగ్ లో వినిపించారు. సింగా ఏం చేస్తాడు.. ? అతని ఫాలోయింగ్ ఎలా ఉంటుంది.. ? అతడి యాటిట్యూడ్ ఏంటి .. ? అనేది చూపించారు.


నిక్లేష్ సుంకోజీ అందించిన లిరిక్స్ గమ్మత్తుగా ఉండగా.. దాన్ని తన వాయిస్ తో మరో లెవెల్ కు తీసుకెళ్లాడు బాబా సెహగల్. ఇక శ్రీవిష్ణు స్వాగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. ఈ ప్రమోషన్స్, సాంగ్ చూస్తుంటే కచ్చితంగా ఈసారి శ్రీవిష్ణు మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంటాడనే అని చెప్పొచ్చు. మరి ఈ సినిమాను ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో చూడాలి.

Related News

Manchu Manoj: భార్యపై మనసులోని భావాలు.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్ పోస్ట్ 

Tollywood: భార్య వేధింపులు తాళలేక ప్రముఖ నటుడు ఆత్మహత్య.. సెల్ఫీ వీడియో వైరల్!

Kissik Talks Promo : మహేష్ విట్టా లవ్ స్టోరిలో ఇన్ని ట్విస్టులా..ఆ ఒక్క కోరిక తీరలేదు..

Ritu Chaudhary : చెప్పు రీతు నువ్వు నన్ను మోసం చేయలేదా? రీతుకి కళ్యాణ్ తో బంధం తెగిపోయిందా?

Bigg boss emmanuel : నా బాధ మీకు తెలియదు, రోజు దుప్పటి కప్పుకుని ఏడుస్తాను

Siva Jyothi: గుడ్ న్యూస్ చెప్పిన యాంకర్ శివజ్యోతి..దయచేసి దిష్టి పెట్టకండి అంటూ!

Avika Gor : ప్రేమించిన వాడితో ఏడడుగులు వేసిన చిన్నారి పెళ్ళికూతురు.. చెప్పినట్టే చేసిందిగా!

Janulyri -Deelip Devagan: దిలీప్ తో బ్రేకప్ చెప్పుకున్న జానులిరి … తప్పు చేశానంటూ?

Big Stories

×