BigTV English

Sri Vishnu : ‘స్వాగ్ ‘ డైరెక్టర్ కు మరో ఛాన్స్.. ఇది అస్సలు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు..

Sri Vishnu : ‘స్వాగ్ ‘ డైరెక్టర్ కు మరో ఛాన్స్.. ఇది అస్సలు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు..

Sri Vishnu : టాలీవుడ్ యంగ్ హీరో శ్రీ విష్ణు విభిన్న కథా చిత్రాల తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. గతంలో వచ్చిన ఓం భీం బుష్ మూవీ భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత ‘స్వాగ్ ‘ మూవీలో నటించాడు. తాజాగా ఈ మూవీ థియేటర్ల లోకి వచ్చింది. విమర్శకుల ప్రశంసలు అందుకుంటుంది. ఇక ఈ సినిమా తర్వాత ఏ డైరెక్టర్ తో సినిమా చేస్తాడా అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.. అయితే శ్రీ విష్ణు మళ్లీ స్వాగ్ డైరెక్టర్ తో సినిమా చెయ్యనున్నాడని టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తుంది. మరో సినిమా చెయ్యడానికి ఓ కారణం ఉందని వార్తలు నెట్టింట షికారు చేస్తున్నారు. ఆ కారణాలు ఏంటో ఒకసారి తెలుసుకుందాం..


సాదారణంగా ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కి ఓ అలవాటు ఉందట.. తమ సంస్థతో ఎవరైనా సినిమా చేస్తే ఆ సినిమా హిట్ ప్లాప్ లతో పనిలేకుండా మరో రెండు సినిమాలు ఆ హీరో చెయ్యాలని అనుకున్నారట.. అందుకే ఇప్పుడు శ్రీ విష్ణు తో మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ఇండస్ట్రీలో టాక్. శ్రీవిష్ణుతో రెండు సినిమాలు చేసింది పీపుల్ మీడియా. అందులో ‘శ్వాగ్’ ఈమధ్యే విడుదలైంది. ఈ సినిమాకు రివ్యూలు చాలా బ్యాడ్ గా వచ్చాయి. వసూళ్లూ అంతంత మాత్రంగానే ఉన్నాయి. అయినా సరే, శ్రీవిష్ణుతో మరో సినిమా ప్లాన్ చేసేశారు నిర్మాత విశ్వ ప్రసాద్.. ఈసారి కథ కొంచెం కొత్తగా ఉంటుందని టాక్. అమెరికా బ్యాక్ డ్రాప్ లో సినిమా ఉంటుందని సమాచారం.. ఈ విషయాన్ని నిర్మాత ఓ ఇంటర్వ్యూలో కూడా చెప్పారు.

ఇక స్వాగ్ మూవీ డైరెక్టర్ అశిత్ గోలీకి మరో ఛాన్స్ ఇచ్చారు. ఆ సినిమాకు సంబంధించిన విషయాలూ త్వరలోనే వెల్లడిస్తామన్నారు విశ్వప్రసాద్. నిజానికి ‘శ్వాగ్’ సినిమాకు కర్త, కర్మ, క్రియ అన్నీ శ్రీవిష్ణునే. విశ్వ ప్రసాద్ కేవలం పెట్టుబడి మాత్రమే పెట్టారు. కథ, కథనాలు, పాత్రధారుల ఎంపిక… ఇవన్నీ శ్రీవిష్ణునే చూసుకొన్నాడు. అన్నిటికన్నా ముందు తక్కువ బడ్జెట్ లో సినిమాను తెరకేక్కించడం వల్లే శ్రీ విష్ణును ఎంపికైన చేసినట్లు తెలుస్తుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అత్యంత త్వరగా 100 సినిమాలు పూర్తి చేయాలన్న లక్ష్యంతో ముందుకొచ్చింది. ఆ క్రమంలో ఫ్లాపులొచ్చినా, ఈ సంస్థ పట్టించుకోకుండా సినిమాలు చేస్తున్నారు. ఇక స్వాగ్ మూవీ విషయానికొస్తే.. ఈ మూవీకి 16 కోట్లు బడ్జెట్ పెట్టారు. కానీ 12 కోట్ల వరకు రాబట్టింది. బ్రేక్ ఈవెనింగ్ అవ్వాలంటే మరో 5 కోట్లు రాబట్టాల్సిందే..


Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×