Jyothi Rai Helped to Mogilayya: ఆమె ఒక బుల్లి తెర నటి. ఆమె తెలుగు ప్రేక్షకులకు సుపరిచితం. అద్భుతంగా నటిస్తూ ఎందరో అభిమానుల మనసు గెలుచుకుంది. కన్నడకు చెందిన ఈ నటి మొగిలయ్యకు సాయం చేసి తన గొప్ప మనసును చాటుకుంది. ఈ విషయం తెలిసి అభిమానులు, సినీ ప్రేక్షకులు ఆమెపై ప్రశంసంల వర్షం కురిపిస్తున్నారు. అక్షయ తృతీయ సందర్భంగా మహిళలు బంగారం కొంటుంటారు.. కానీ, మీరు మాత్రం కష్టాల్లో ఉన్న మొగిలయ్యను ఆదుకోవడం అభినందనీయమని పేర్కొంటున్నారు.
కన్నడ పరిశ్రమకు చెందిన నటి జ్యోతిరాయ్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచతం. గుప్పెడంత మనసు సీరియల్ లో తన అద్భుతమైన నటనతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను దోచుకున్నది ఈ బుల్లి తెర నటి. సీరియల్స్ తోపాటు సినిమాలు, వెబ్ సిరీస్ లలో కూడా నటించింది. టాలీవుడ్ తోపాటు శాండల్ వుడ్ లో కూడా జ్యోతిరాయ్ కు మంచి గుర్తింపు ఉంది. సినిమా ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు ఉన్న ఈ నటి అక్షయ తృతీయ సందర్భంగా ప్రముఖ కళాకారుడు కిన్నెర మొగిలయ్యకు సాయం చేసి తన గొప్ప మనసును చాటుకుంది.
12 మెట్ల కిన్నెర కళాకారుడు మొగిలయ్య ఆర్థిక సమస్యలతో ఇబ్బందిపడుతున్నాడన్న విషయం తెలుసుకున్నది ఈ బుల్లితెర నటి. వెంటనే తన టీమ్ ద్వారా అక్షయ తృతీయ రోజున ఆయనను కలిసింది. తన వంతుగా రూ. 50 వేల ఆర్థిక సాయం చేసి గొప్ప మనసును చాటుకుంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రస్తుతం తాను ఇబ్బందులు ఎదుర్కొంటున్నాని, అయితే తనకు తన ఇబ్బందుల కంటే మొగిలయ్య పరిస్థితిని చూస్తే ఎక్కువగా కలచివేసిందని ఆమె తెలిపింది. ఆయనకు ప్రస్తుతం తను ఇస్తున్న డబ్బు పెద్ద సాయం కూడా కాదని ఆమె పేర్కొన్నది. ఆ తరువాత ఆమె మొగిలయ్య పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకుంది. అదేవిధంగా మొగిలయ్యకు సాయం చేసేందుకు మరికొంతమంది ముందుకు రావాలని ఆమె పేర్కొన్నది.
Also Read: భయపెట్టడానికి హీరోయిన్ తో కలిసివస్తున్న స్టార్ కమెడియన్..
ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ విషయం తెలిసి నెటిజన్స్, అభిమానులు, సినీ ప్రేక్షకులు ఆమెను ప్రశంసిస్తున్నారు.