BigTV English

Tollywood Hero’s on Elections: ఏపీ ఎలక్షన్స్.. మాకు సంబంధమే లేదన్న టాలీవుడ్ హీరోలు..!

Tollywood Hero’s on Elections: ఏపీ ఎలక్షన్స్.. మాకు సంబంధమే లేదన్న టాలీవుడ్ హీరోలు..!

Tollywood Heroes Not Responded to the AP Elections 2024: ఏపీలో ఎలక్షన్ హీట్ పెరిగిపోయింది. తెల్లారితే ఎలక్షన్స్. ఎవరు గెలుస్తారు..? ఎవరు ఓడతారు..? అని అందరు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.అంతకుముందులా కాకుండా ఈసారి పోటీ మరింత రసవత్తరంగా సాగుతుంది. జనసేనాని పవన్ కళ్యాణ్ కు టాలీవుడ్ మొత్తం సపోర్ట్ గా నిలబడింది. గత వారం నుంచి సోషల్ మీడియాలో.. పిఠాపురం ప్రచారంలో ఎక్కడ చూసినా పవన్ కు మద్దతుగా స్టార్ హీరోలు నిలబడిన తీరు ప్రశంసనీయం.


చిరంజీవి, వెంకటేష్, రామ్ చరణ్, అల్లు అర్జున్, నాని, రాజ్ తరుణ్, నితిన్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, వరుణ్ తేజ్.. ఇలా టైర్ 1, టైర్ 2 హీరోలు అనే తేడా లేకుండా పవన్ కు అండగా నిలబడ్డారు. ఇక వీరందరూ ఒక ఎత్తు అయితే.. అసలు ఏపీ ఎలక్షన్స్ తో మాకు సంబంధమే లేదు అన్నట్లు ఉన్న హీరోలు కూడా లేకపోలేదు. వారే ప్రభాస్, మహేష్, ఎన్టీఆర్, విజయ్ దేవరకొండ. వీరు కనీసం ప్రచారం సంగతి పక్కన పెడితే.. ఎలక్షన్స్ మీద ఒక పోస్ట్ పెట్టింది కూడా లేదు.

ముఖ్యంగా ఇక్కడ మాట్లాడుకోవాల్సింది ఎన్టీఆర్ గురించి. తాత గారు స్థాపించిన పార్టీ.. తన తండ్రి, బాబాయ్, మామయ్య నడుపుతున్న టీడీపీకి సపోర్ట్ గా తారక్ ఒక్క పోస్ట్ పెట్టింది కూడా లేదు. ఒకానొక సమయంలో తారక్ ప్రచారంలో పాల్గొన్నాడు. కానీ,ఇప్పుడు షూటింగ్స్ తప్ప రాజకీయాల గురించి ఆలోచించే పరిస్థితిలో లేడు. దీంతో టీడీపీ అభిమానులు, తారక్ ఫ్యాష్న్ కొద్దిగా అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇక మహేష్ బాబు అయితే.. ఏపీ ఎలక్షన్స్ తో మనకే పని లేదు అన్నట్లు ఉన్నాడు. ప్రతి విషయాన్నీ సోషల్ మీడియాలో అభిమానులతో చర్చించే మహేష్.. ఈసారి ఈ ఎన్నికలపై ఒక్క ట్వీట్ కూడా వేసింది లేదు.


Also Read: Godzilla x Kong The New Empire: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన హాలీవుడ్ సూపర్ హిట్ మూవీ.. కానీ..!

ప్రభాస్ పెద్దమ్మ శ్యామల దేవి తనవంతు ప్రచారం చేస్తుంది కానీ, డార్లింగ్ మాత్రం ఒక్క పోస్ట్ కూడా పెట్టింది లేదు. విజయ్ దేవరకొండ తెలంగాణ కాబట్టి మాట్లాడడు అనుకుంటే కనీసం సపోర్ట్ గా అయినా పోస్ట్ చేయలేదు. ఏదిఏమైనా ఈ హీరోలు సపోర్ట్ చేస్తే మాత్రం ఆ కిక్కే వేరుగా ఉంటుంది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు అని అభిమానులు చెప్పుకొస్తున్నారు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×