BigTV English

Srikanth Odela : ‘దసరా’ మూవీ దర్శకుడు నెక్ట్స్ మూవీ.. అయ్యగారే హీరో!

Srikanth Odela : ‘దసరా’ మూవీ దర్శకుడు నెక్ట్స్ మూవీ.. అయ్యగారే హీరో!

Srikanth Odela : నేచుర‌ల్ స్టార్ నాని క‌థానాయ‌కుడిగా శ్రీకాంత్ ఓదెల ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం ‘దసరా’. మార్చి 30న పాన్ ఇండియా మూవీగా విడుద‌లైన ఈ సినిమా ఇప్ప‌టికే రూ.83 కోట్ల‌కు పైగా గ్రాస్ వ‌సూళ్ల‌ను సాధించింది. షేర్ వ‌సూళ్ల ప‌రంగా చూస్తే ఈ చిత్రం సేవ్ అయిపోయింది. ఇక సోమ‌వారం నుంచి వ‌చ్చే క‌లెక్ష‌న్స్ అన్నీ నిర్మాత‌ల‌కు లాభాల‌ను తెచ్చి పెడుతుందని ట్రేడ్ వ‌ర్గాలు అంటున్నాయి. ఈ త‌రుణంలో శ్రీకాంత్ ఓదెల నెక్ట్స్ మూవీ ఎవ‌రితో ఉండొచ్చు అనే డిస్క‌ష‌న్ సినీ ఇండ‌స్ట్రీలో జరుగుతుంది. స‌క్సెస్ కొట్టిన ద‌ర్శ‌కుడితో సినిమా చేయ‌టానికి నిర్మాత‌లు ఆస‌క్తి చూపిస్తారు. అడ్వాన్స్‌లిచ్చి లాక్ చేస్తారు.


ఈ నేప‌థ్యంలో సినీ వ‌ర్గాల సమాచారం మేర‌కు.. శ్రీకాంత్ ఓదెల నెక్ట్స్ మూవీ క‌న్‌ఫ‌ర్మ్ అయ్యింద‌ట‌. ఈ యండ్ డైరెక్ట‌ర్ నెక్ట్స్ మూవీ అక్కినేని కాంపౌండ్‌లో ఉంటుంది. మ‌రి హీరో ఎవ‌ర‌నే దానిపై కూడా ప్ర‌శ్న‌లు రావ‌చ్చు. అక్కినేని కాంపౌండ్‌లో మెయిన్‌గా ముగ్గురు హీరోలున్నారు. వీరిలో అఖిల్ అక్కినేనితోనే శ్రీకాంత్ ఓదెల నెక్ట్స్ మూవీ ఉంటుంద‌ని టాక్‌. ప్ర‌స్తుతం అక్కినేని యువ‌రాజు సినిమాల విష‌యంలో ఆచి తూచి అడుగులు వేస్తున్నారు. ఈ క్ర‌మంలో ద‌స‌రా సినిమా డైరెక్ట‌ర్‌తో సినిమా చేయ‌టానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చార‌ని స‌మాచారం. అన్ని స‌రిగ్గా కుదిరితే త్వ‌ర‌లోనే ఈ మూవీకి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డుతుంద‌నే న్యూస్ నెట్టింట వైర‌ల్ అవుతుంది.

అఖిల్ ప్ర‌స్తుతం ఏజెంట్ సినిమాతో ఆడియెన్స్ ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 28న రిలీజ్ అవుతుంది. ఇదొక స్పై థ్రిల్ల‌ర్‌. ఓ వైపు చిత్రీక‌ర‌ణను జ‌రుపుకుంటూనే పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకునే ప‌నిలో సినిమా ఉంది. ఈ చిత్రానికి సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌టంతో పాటు రామ బ్ర‌హ్మం సుంక‌ర‌తో క‌లిసి సినిమాను నిర్మిస్తున్నారు.


Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×