Srikanth Odela : మన టాలెంట్ ఏంటో ప్రూవ్ చేసుకోవడానికి ఒక అవకాశం చాలు అని అంటుంటారు చాలామంది. ఒకే ఒక అవకాశంతో తనేంటో పాన్ ఇండియా స్థాయిలో తెలిసేలా చేశాడో ఓ దర్శకుడు అతనే శ్రీకాంత్ ఓదెల. నాని హీరోగా దసరా అనే సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి దర్శకుడుగా పరిచయం అయ్యాడు శ్రీకాంత్. ఈ సినిమా నాని కెరియర్ లోనే హైయెస్ట్ కలెక్షన్స్ వసూలు చేసింది. బాక్స్ ఆఫీస్ వద్ద నాని సత్తా ఏంటో తెలిసేలా చేసింది ఈ సినిమా. ఈ సినిమా తర్వాత శ్రీకాంత్ కి వరుసగా అవకాశాలు వచ్చినా కూడా మళ్లీ నానితోనే సినిమా చేయడానికి ముందడుగు వేశాడు. శ్రీకాంత్ ప్రస్తుతం నానితో సినిమాను చేయబోతున్నాడు.
ఇక దసరా సినిమాకు సంబంధించి శ్రీకాంత్ కి మొదటి సినిమా అయినా కూడా నిర్మాత హైటెక్నిషన్స్ ని తీసుకొచ్చి ఇచ్చాడు. దసరా సినిమాకి సంతోష్ నారాయణన్ సంగీత దర్శకుడుగా కావాలని అడిగాడు శ్రీకాంత్. మొదటి సినిమా అయినా కూడా ఆ స్థాయి సంగీత దర్శకుని తీసుకొచ్చి శ్రీకాంత్ కి అందించారు. అదే స్థాయిలో సంతోష్ నారాయణ కూడా సినిమాకు న్యాయం చేశాడు. ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది. వెన్నెల అనే పాత్రలో కీర్తి సురేష్ విపరీతంగా ఆకట్టుకుంది. అయితే ఈ సినిమా మొదటి షో పడినప్పటినుంచి విపరీతమైన ఇంపాక్ట్ క్రియేట్ చేసింది.
ఇక ప్రస్తుతం నాని హీరోగా పారడైజ్ అనే సినిమాను చేస్తున్నాడు శ్రీకాంత్. ఈ సినిమా గురించి ఇదివరకే నాని కూడా భారీ ఎలివేషన్స్ ఇచ్చాడు. ఈ సినిమా నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుంది అంటూ చెప్పుకొచ్చాడు. ఇక తాజాగా శ్రీకాంత్ కు మెగాస్టార్ చిరంజీవితో సినిమా ఓకే అయింది. ఈ సినిమాకి సంబంధించిన ఒక పోస్టర్ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఆ పోస్టర్లో బ్లడ్ తో తడిచిన ఒక చేయి కనిపిస్తూ ఉంటుంది. ఇకపోతే సోషల్ మీడియా వేదిక మెగాస్టార్ చిరంజీవిని కలిసిన ఫొటోస్ షేర్ చేశాడు శ్రీకాంత్. పోస్టర్ లో ఉన్న చేయికి శ్రీకాంత్ చేయికి ఉన్న బ్రాస్లెట్స్ ఒకేలా ఉన్నాయి.
Hahaha😂
Nee eye to detail nachindi…kaani adi thappu…Adi mana Boss Chiranjeevi gari hand eh..bracelets maatram naadhi & nani anna dhi, marking our first collab 😅
Aa cheyya chudu entha rough ga undho…💥💥💥
Red paint antunnaru kada…daani gurinchi repu… https://t.co/d2Wkfwe2cn
— Srikanth Odela (@odela_srikanth) December 3, 2024
దీనిని పోస్ట్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా ఒరేయ్ అది నీ చేయా అంటూ కొంతమంది నెటిజన్స్ షాక్ అయ్యారు. ఆ పోస్టును షేర్ చేశాడు శ్రీకాంత్. ఆ చేయి నాది కాదు. చేయి చూసావా ఎంత రఫ్ గా ఉందో. అని ఆ చేతికున్న బ్రాస్ లైట్స్ మాత్రం నాది నాని అన్నది అంటూ చెప్పుకొచ్చాడు. మెగాస్టార్ తో సినిమా చేయటం అనేది చాలామంది దర్శకులకు ఉన్న కల. కానీ అది కొంతమందికి మాత్రమే వర్కౌట్ అవుతుంది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి యంగ్ డైరెక్టర్ తో సినిమాలు చేయడం మొదలు పెడుతున్నాడు. మెగాస్టార్ చిరంజీవికి శ్రీకాంత్ ఎంత పెద్ద అభిమాని అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవిని డైరెక్ట్ చేస్తున్నాడు అంటే ఏ రేంజ్ లో ఉండబోతుందో అని చాలామంది క్యూరియాసిటీతో ఎదురుచూస్తున్నారు.
Also Read : Samantha – Naga Chaitanya: జ్ఞాపకాలను చెరపలేకపోతున్న చైతూ.. ఇప్పటికైనా..?