Intinti Ramayanam Today Episode December 4th : నిన్నటి ఎపిసోడ్ లో.. రాజేంద్ర ప్రసాద్ ఇంటికి స్వామీజీ రాగానే అందరూ ఆయన ఆశీర్వాదం తీసుకుంటారు. ఇంట్లో అనుకోని కలహాలు గొడవలు వస్తున్నాయని పార్వతి అడుగుతుంది. ఇంట్లో ఒక దుష్టశక్తి ప్రవేశించింది దానివల్లే ఈ గొడవలన్నీ జరుగుతున్నాయి ఇంట్లో ఎవరికీ మనశ్శాంతి లేకుండా చేయాలని అనుకుంటుంది అనేసి అంటాడు. ఆ మాట అనగానే పల్లవి తన గురించి నిజం తెలిసిపోతుంది అని టెన్షన్ పడుతుంది. ఇది ఇంట్లో ఒక హోమం చేస్తే సరిపోతుందని స్వామీజీ చెప్తారు. చండీ హోమం జరిపిస్తే ఇంట్లో అంతా మంచే జరుగుతుందని నా మీద చెప్తారు. ఈ హోమం చేయాలంటే ఇంటి మంచి కోరే వాళ్లే చేయాలి అనేసి అడుగుతారు. అక్షయ అవనీలు ఈ పూజలో కూర్చొని పూజ చేస్తారు అని పార్వతి అంటుంది. ఇంట్లో అందరు పూజకు రెడీ చెయ్యాలని అనుకుంటారు. ఇక కమల్ తన సమస్యకు పరిష్కారం దొరుకుతుందని స్వామీజీని అడుగుదామని వెళ్తాడు. డబ్బుల కోసం కమల్ కు పూజ చేస్తామని అబద్దం చెప్తారు. ఏదో పూజ చేసి 50000 తీసుకుంటారు. ఇక పల్లవి లో మార్పు రావడం తో కమల్ ఫుల్ ఖుషి అవుతాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. కమల్ పై పల్లవి ప్రేమను వలకబోస్తుంది. ఇంట్లో నా ఆటలు సాగాలంటే దీన్ని మచ్చిక చేసుకోవాలని అనుకుంటుంది పల్లవి. నేనెప్పుడూ నీ దగ్గరికి వచ్చినా కోప్పడతావు చిరాకు పడతావు నేను మాట్లాడాలన్నా విసుక్కుంటావ్ కానీ ఇప్పుడు నీలో ఇంత మార్పు ఏంటి పల్లవి ఇదంతా అనేసి కమల్ ఆశ్చర్యపోతాడు. నువ్వంటే ప్రేమ లేదని నీకు ఎవరు చెప్పారు నువ్వంటే ప్రేమ ఉంది బావ లేకపోతే నువ్వు కట్టిన తాళిని నేను ఎందుకు ఉంచుకుంటాను తీసి పడేయకుండా అనేసి అంటుంది. నువ్వు చేసే పనులే నాకు నచ్చవు అందుకే నేను దూరం పెడుతున్నాను లేకున్నా అంటే నిన్ను ఎందుకు దూరం పెడతాను బావ అనేసి అంటుంది. 50,000 పోతే పోయినాయి కానీ పల్లవిలో ఇంత మార్పు నేను అసలు ఊహించలేదు అనేసి కమల్ మనసులో అనుకొని సంబరపడిపోతాడు. పల్లవి ముద్దు పెట్టగానే సోయ లేకుండా బయటికి వెళ్లిపోతాడు. నిన్ను ఇలా మచ్చిక చేసుకుంటేనే నాకు పని వర్కౌట్ అవుతుందని పల్లవి అనుకుంటుంది.
ఇక స్వామీజీ చెప్పినట్టు అవని ఉదయమే లేస్తుంది. పూజకు కావలసిన అన్ని ఏర్పాట్లను చేస్తుంది. చలినింటి స్నానం చేసి రెడీ అవుతుంటే అక్షయ్ కూడా లేస్తాడు.. అవనిని చీరలో చూసి మురిసిపోతాడు. దొంగ చాటుగా తన పెళ్లానికి సైటు కొడతాడు. అద్దంలో అక్షయ్ లేవడం చూస్తున్న అవని పెళ్ళాన్ని దొంగ చాటుగా చూడడం ఎందుకో అనేసి సెటైర్లు వేస్తుంది. నేను చూడట్లేదు నీ జుట్టు నీళ్లు నా మీద పడుతున్నాయి అనేసి అక్షయ్ కోపంగా అంటాడు. ఇక అవనిని మళ్లీమళ్లీ తొంగి చూస్తాడు అక్షయ్. అది గమనించిన అవని అక్షయ్కి కౌంటర్ లేస్తుంది. అక్షయ్ నిన్నే నేను చూడట్లేదు నేను వాష్ రూమ్ కి వెళ్తున్నాను అనేసి వెళ్ళిపోతాడు. మళ్లీ అవనీని చూస్తూ అలా ఉండిపోతాడు. వీరిద్దరి మధ్య కాస్త రొమాంటిక్ టచ్ ఏర్పడుతుంది. ఉదయం లేవగానే పల్లవి కూడా ఉదయాన్నే లేచి రెడీ అయ్యి పూజ దగ్గరికి వస్తుంది. భానుమతి చూసి ఏంటి ఇంత ఉదయాన్నే వచ్చావు నువ్వు అసలే కడుపుతో ఉన్న దానివి ఇంత పొద్దున్నే లేవడం అవసరమానేసి అంటుంది. ఆవనేని పూజ చేస్తుందని అందరూ నెత్తిన పెట్టుకొని చూస్తున్నారు. చేసే పూజ వల్ల ఇంటికి మంచి జరిగితే ఇంకేమైనా ఉందా ఆమెకే ఏకంగా పూజలు చేస్తారు నిద్ర ఎలా పడుతుందమ్మ అనేసి పల్లవి అంటుంది. దానికి భానుమతి కూడా నువ్వు కడుపుతో ఉన్నవే లేకున్నా అంటే ఇంట్లో అందరూ నువ్వే చేయాలని ఒప్పిచ్చేదని పెద్ద రచ్చ చేసేదాన్ని అనేసి అంటుంది. ఇక పార్వతి అవని దగ్గరికి భానుమతి పల్లవి వెళ్తారు. నేను పూజ చేయకూడదు కానీ పూజ కావలసిన ఏర్పాట్లు చేయొచ్చు కదా అత్తయ్య అనేసి పల్లవి అంటుంది. నువ్వు ఏమి చేయదు అన్ని పనులు అవన్నీ చేసేసింది నువ్వు వెళ్లి అందరికీ కాఫీ తీసుకురావా అనేసి అంటుంది పార్వతి.
పల్లవి అందరికీ కాఫీ చేయడానికి లోపలికి వెళుతుంది. అక్కడ నెయ్యి కుండ ఉండడం చూసి మనకి కావాల్సిన నెయ్యి ఈ నెయ్యిని ఎలాగైనా పాడు చేస్తే హోమం ఆగిపోతుందని ఆ కుండకు హోల్ పెడుతుంది. ఇక అందరికీ కాఫీ ఇస్తుంది. అక్షయ్ రాజేంద్రప్రసాద్ అక్కడికి వస్తారు. పాపం కమల్ మాత్రం పంచ కట్టుకోవడం రాదు అని లోపలే ఉండిపోయి సతమత పడతాడు. వదిన పిలిస్తే భానుమతి నాకు గేమ్ ఆడటానికి ఫోన్ కావాలని డిమాండ్ చేస్తుంది. ఇప్పుడే పల్లవి వచ్చి నీకు పంచ కట్టుకోవడం రాకపోతే నన్ను అడగాల్సింది బావ అనేసి అంటుంది. పల్లవి కమల్ కి పంచ కడుతుంది. ఇక రాజేంద్రప్రసాద్ స్వామీజీ వస్తే పూజకి అవి ఇవి లేవంటే కోప్పడతారు మరి అన్ని ఉన్నాయో లేదో ఒకసారి లిస్టులో చెక్ చేస్తే బెటర్ కదా అనేసి అంటాడు. లిస్ట్ ప్రకారం అన్ని చదువుతాడు అయితే ఆవు నెయ్యి అక్కడ లేదని అనగానే అవని నేను వెళ్లి తీసుకొని వస్తాను లోపలికి పెట్టాను అనేసి అంటుంది. ఇక లోపలికి వెళ్లి చూడగానే నెయ్యికుండా హోల్ పడి కారుతూ ఉంటుంది. బయటికి వచ్చి నెయ్యకుండా హోల్ పడి కారుతూ ఉంది. ఏం చేయాలి అనేసి అడుగుతుంది. పొద్దున్నే నెయ్యి దొరకదు కదా అండి ఏం చేయమంటారు అని పార్వతి అంటుంది. కంగారు పడకండి అత్తయ్య నేను వెళ్లి ఎలాగోలాగా తీసుకొని వస్తాను అనేసి అవని అంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. ఇప్పుడు ఎపిసోడ్ లో స్వామీజీ పూజ చేసే వాళ్ళు లేరని కోప్పడతాడు . అవనీకి కళ్ళు తిరిగి పడిపోయి ఉంటుంది. ఏం జరుగుతుందో రేపటి ఎపిసోడ్ లో చూడాలి..