Samantha – Naga Chaitanya.. అక్కినేని కుటుంబంలో సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి ఈరోజు రాత్రి 8:30 గంటలకు అక్కినేని కుటుంబానికి సెంటిమెంట్ ప్లేస్ అయిన అన్నపూర్ణ స్టూడియోలో ఘనంగా వివాహం జరగబోతోంది. ఇక అటు అక్కినేని నాగచైతన్య(Akkineni Naga Chaitanya), ఇటు శోభిత దూళిపాళ (Shobhita dhulipala) పెళ్లి ఎప్పుడు అని ఎదురు చూస్తున్న నేపథ్యంలో ఆ తంతు కాస్త ఈరోజుతో పూర్తి కానుంది. మరోవైపు నాగచైతన్య సమంత (Samantha)కు సంబంధించిన వార్తలు కూడా సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి. ముఖ్యంగా నాగచైతన్య, సమంత గుర్తుగా వాటిని ఇప్పటికే దాచుకుందంటూ కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.
అందుకే నాగచైతన్యకు సమంత విడాకులు ఇచ్చిందా..?
ఒకానొక సమయంలో ప్రేమించి పెళ్లి చేసుకున్న వీరు, ఆ తర్వాత విడిపోయారు. పైకి సైలెంట్ గా కనిపించే నాగచైతన్యకు ఒక అలవాటు కూడా ఉందట. అందుకే సమంత అతనికి దూరమైందనే ప్రచారం కూడా జోరుగా సాగింది. నాగచైతన్యకు మనసు బాగా హర్ట్ అయితే ఎవరూ లేని ప్రదేశంలో కూర్చుని, మందు తాగేసి, గట్టిగా అరిచేస్తూ ఆ బాధను అలా బయట పెడుతూ ఉంటారట. అంతేకాదు ఆ సమయంలో ఎవరైనా ఫోన్ చేస్తే మాత్రం నోటికొచ్చినట్లు మాట్లాడేస్తారట. అలా సమంత కూడా ఎన్నోసార్లు ఈ విషయంలో ఇబ్బంది పడిందని సమాచారం. ఆ అలవాటు మానుకోమని నాగచైతన్యకు ఎంత చెప్పినా ఆయన వినలేదని, ఆ కారణంగానే సమంత విడాకులు ఇచ్చిందనే వార్తలు జోరుగా వినిపించాయి.
సమంత జ్ఞాపకాలను చెరిపేయలేకపోతున్న చైతూ..
ఇదిలా ఉండగా మరొకవైపు శోభితతో నిశ్చితార్దానికి ముందే సమంతతో ఉన్న అన్ని జ్ఞాపకాలను పూర్తిగా తొలగించేశారు నాగచైతన్య. అయితే ఆయన చేతి పైన టాటూ మాత్రం అలాగే ఉంది. దీనికి తోడు సమంత ఉన్న ఒక ఫోటోని మాత్రం నాగచైతన్య తన సోషల్ మీడియా ఖాతా డిలీట్ చేయలేదు. వీరిద్దరూ కలిసి ఉన్న మజిలీ సినిమా పోస్టర్ ను నాగచైతన్య సోషల్ మీడియాలో డిలీట్ చేయకపోవడం గమనార్హం. సమంత, నాగచైతన్య ఇద్దరూ కూడా విడాకులు తీసుకున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే వారికి సంబంధించిన వస్తువులను కూడా తీసేసినా కొన్నింటిని మాత్రం అలాగే ఉంచుకున్నారు.
ఫోటోలు డిలీట్ చేసి హింట్ ఇచ్చిన జంట..
ముఖ్యంగా ఆ జ్ఞాపకాలను చెరిపేయాలని ఎంతగానో ప్రయత్నిస్తున్నా.. ఇద్దరికీ కుదరడం లేదట. ఇక తాజాగా సమంత, నాగచైతన్య కలిసి ఉన్న మజిలీ పోస్టర్ ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది. నాగ చైతన్య, శోభిత పెళ్లి వేళ ఇప్పుడు ఈ విషయం మళ్ళీ బయటకు రావడంతో ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిందని చెప్పవచ్చు. ఇకపోతే నాగచైతన్య, సమంత 2017లో వివాహం చేసుకున్నారు. 2021 లో విడాకులు తీసుకొని అందరిని ఆశ్చర్యపరిచారు. విడాకులు తీసుకునే ముందు సోషల్ మీడియాలో ఇద్దరు కూడా ఫోటోలను తొలగించి హింట్ ఇచ్చారు. ఆ తర్వాత విడాకులు తీసుకోవడం జరిగింది. ఇకపోతే ఇద్దరు విడాకులు తీసుకొని వేరుపడినా.. కొన్ని జ్ఞాపకాలను మాత్రం అలాగే ఉంచుకోవడం గమనార్హం. ఇది చూసిన కొంతమంది నెటిజన్స్ ఇప్పుడు నీకు పెళ్లి కాబోతోంది చైతు కనీసం ఇప్పటికైనా వాటిని డిలీట్ చెయ్ అంటూ కామెంట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.