EPAPER

Srinu Vaitla: వెంకీట్రైన్ ఎపిసోడ్.. స్క్రిప్ట్ లో లేదు.. వాళ్లకే థాంక్స్ చెప్పాలి

Srinu Vaitla: వెంకీట్రైన్ ఎపిసోడ్.. స్క్రిప్ట్ లో లేదు.. వాళ్లకే థాంక్స్ చెప్పాలి

Srinu Vaitla: కామెడీ అంటే  టాలీవుడ్  ప్రేక్షకులకు గుర్తొచ్చే డైరెక్టర్ జంధ్యాల.  ఎలాంటి వల్గర్ పదాలు లేకుండా కామెడీ పండించడం అనేది ఆయనకే  సాధ్యం అయ్యింది. ఇక ఆయన తరువాత అంతలా కామెడీ పండించగల  దర్శకుల్లో శ్రీను వైట్ల మొదటి వరుసలో ఉంటాడు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇప్పుడు నడుస్తున్న సోషల్ మీడియాలో సగానికి పైగా కామెడీ మీమ్స్ అన్ని ఆయన తెరకెక్కించిన సినిమాల్లోవే.


ఆనందం, వెంకీ, దూకుడు, రెడీ.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సినిమాలే ఉన్నాయి. అన్ని హిట్స్ ఇండస్ట్రీకి అందించిన  శ్రీను వైట్ల ఇప్పుడు ఒక్క హిట్ కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్నాడు. చాలా గ్యాప్ తరువాత ఆయన దర్శకత్వం వహిస్తున్న చిత్రం విశ్వం. గోపిచంద్, కావ్య థాపర్ జంటగా నటిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 11 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

ఇక రిలీజ్ డేట్ దగ్గరపడేకొద్దీ ప్రమోషన్స్ మొదలుపెట్టిన చిత్రబృందం వరుస ప్రెస్ మీట్స్, ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమాపై హైప్ పెంచుతున్నారు. ఇక విశ్వం సినిమాలో శ్రీను వైట్ల తన మార్క్ కామెడీని చూపించనున్నట్లు తెలుస్తోంది. ఆయనకు కలిసి వచ్చిన ట్రైన్ కామెడీని మరోసారి విశ్వం సినిమాలో రీక్రియెట్ చేస్తున్నట్లు శ్రీను వైట్ల చెప్పుకొచ్చాడు. తాజాగా తన కామెడీ సీన్స్ గురించి తానే చెప్పుకొచ్చాడు. టాలీవుడ్ ఉన్నంత కాలం.. వెంకీ సినిమాను, అందులో ట్రైన్ ఎపిసోడ్ ను మర్చిపోవడం చాలా కష్టం.


బొక్కా, గజలా, వెంకీ, నాగరాజు.. ఈ పాత్రలు ఎప్పుడు మన జీవితంలో ఏదోఒకసారి పిలుస్తూనే ఉంటాం. ఈ కామెడీ సీన్స్ రాయడానికి శ్రీను వైట్ల ఎంత కష్టపడ్డాడో అనుకుంటాం. కానీ, అసలు ఈ ట్రైన్ ఎపిసోడ్ మొత్తం అసలు స్క్రిప్ట్ లోనే లేదంట. ఈ విషయాన్నీ శ్రీను వైట్ల  చెప్పుకొచ్చాడు.

” వెంకీ ట్రైన్ ఎపిసోడ్ మొత్తం  స్క్రిప్ట్ లో లేదు. అసలు ఆ సీన్స్ కు స్క్రిప్ట్ రాయలేదు. ఆ సీన్ కు సంబంధించిన ప్రతి సీన్ నా మైండ్ లో ఉంది. ఆ కంటెంట్ ను యాక్టర్స్ కు వివరించి.. ఆ టైమ్ చెప్పి, నువ్వు ఇది చెప్పు.. నువ్వు ఇది చెప్పు అని చెప్పించాను. అలా చెప్పించడం వలన ఏమైందంటే.. ఎక్కడ ఫ్రేమింగ్ ఉండదు.. చాలా న్యాచురల్ గా ఏదో జరుగుతున్నట్లుగా ఉంటుంది. ఇదంతా యాక్టర్స్ వలనే జరిగింది. వాళ్లకే థాంక్స్ చెప్పాలి. రవితేజ గారు, ఏవీఎస్ గారు, బ్రహ్మానందం గారు, స్నేహ గారు చాలా బాగా నటించారు.

ఇక ఇలాంటి ట్రైన్ సీన్స్ నే విశ్వంలో చేసాం. చాలా కష్టపడి చేసాం.  గోపిచంద్, వెన్నెల కిషోర్, సత్య లాంటివారు కనిపిస్తారు. ఇది కూడా చాలా బాగా వచ్చింది” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మరి ఈ సినిమాతో చాలా గ్యాప్ తరువాత  వచ్చిన శ్రీనువైట్ల, గత కొన్ని  ఏళ్లుగా హిట్ అందుకొని  గోపీచంద్.. హిట్ అందుకుంటారా.. ? లేదా.. ? అనేది చూడాలి.

Related News

Bollywood : బిగ్ బ్రేకింగ్.. బాలీవుడ్ ప్రముఖ హాస్య నటుడు కన్నుమూత..

Mahendragiri Vaarahi: సంక్రాంతి బరిలోకి సుమంత్ మూవీ.. అందరిని పిచ్చోళ్లను చేసేలా నిర్మాత మాస్టర్ ప్లాన్…?

Shruti Haasan: ‘డెకాయిట్’ నుండి తప్పుకున్న శృతి హాసన్.. అదే కారణమా?

Jani Master: జానీ మాస్టర్ కు బెయిల్ రద్దు.. తల్లిని చూసైనా కోర్టు కనికరించలేదా..?

Tollywood Young Hero: పూరీనే రిజెక్ట్ చేసిన కుర్ర హీరో.. తప్పు చేశాడా.. తప్పించుకోవడానికి చేశాడా.. ?

Prabhas Hanu: ప్రభాస్, హను సినిమాకు ఓ రేంజ్‌లో హైప్.. ఓవర్సీస్ కోసం ఏకంగా అన్ని కోట్లు డిమాండ్?

Matka Movie: లేలే రాజా.. ఏముందిరా.. మనోహరీ.. సాంగ్ అదిరింది అంతే

Big Stories

×