Devara 2: కొరటాల శివ, ఎన్‌టీఆర్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘దేవర’ మూవీ ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటిరోజు నుండే చాలావరకు థియేటర్లలో హౌస్‌ఫుల్ షోలతో రన్ అయ్యింది. ఫస్ట్ వీకెండ్ కూడా పూర్తి చేసుకున్న తర్వాత ‘దేవర’కు భారీగా కలెక్షన్స్ వచ్చాయి. కలెక్షన్స్ ఎలా ఉన్నా సినిమాకు మిక్స్‌డ్ టాక్ వస్తోంది. ముఖ్యంగా పార్ట్ 2 ఐడియాతో చాలామంది ప్రేక్షకులు అంత హ్యాపీగా లేరు. ‘దేవర 2’కు అస్సలు స్కోప్ లేదని సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి. అయినా కూడా అవన్నీ పట్టించుకోకుండా పార్ట్ 2 కోసం ప్లానింగ్ మొదలుపెట్టాడు కొరటాల శివ. మూవీ టైటిల్ కార్డ్స్ గమనిస్తే ఆయన ఇచ్చిన హింట్ ఏంటో అర్థమవుతుంది.
మరింత బ్లడ్ బాత్
‘దేవర’ టైటిల్ కార్డ్, అక్కడ వచ్చిన బీజీఎమ్.. ప్రేక్షకుల్లో కొత్త ఊపు తీసుకొచ్చింది. సినిమాలో వైలెన్స్, బ్లడ్ బాత్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి టైటిల్ కార్డ్‌లోనే ఆ విషయాన్ని తెలిసేలా చేశాడు దర్శకుడు కొరటాల శివ. ఇక పార్ట్ 2లో అంతకు మించి బ్లడ్ బాత్ ఉంటుందని క్లైమాక్స్‌లోనే హింట్ ఇచ్చాడు. క్లైమాక్స్‌లో ‘దేవర 2’ టైటిల్ కార్డ్‌ను రివీల్ చేశాడు కొరటాల. అయితే ఈ రెండు టైటిల్ కార్డ్స్‌ను గమనిస్తే.. ‘దేవర’ కంటే ‘దేవర 2’ టైటిల్ కార్డ్‌పైనే ఎక్కువగా బ్లడ్ ఉందని నెటిజన్లు గమనించారు. అంటే పార్ట్ 2లో విపరీతమైన బ్లడ్ బాత్ ఉంటుందని దర్శకుడు చెప్పకనే చెప్పాడని ఆయన క్రియేటివిటీని ప్రశంసిస్తున్నారు.
Also Read: వివాదాస్పద నటి నాలుగో పెళ్లి.. వరుడు ఎవరో తెలిస్తే షేక్ అవ్వాల్సిందే
మిక్స్‌డ్ రివ్యూ
‘దేవర’ అనేది పూర్తిస్థాయి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కింది. అందులో రక్తపాతం కూడా చాలానే ఉంది. ముఖ్యంగా ఫైట్ సీన్స్ అనేవి సినిమాకు చాలా ప్లస్ అయ్యాయని ప్రేక్షకులు పాజిటివ్ రివ్యూలు ఇస్తున్నారు. కానీ ‘ఆర్ఆర్ఆర్’ లాంటి సినిమా తర్వాత ఎన్‌టీఆర్ సోలో హీరోగా తెరకెక్కిన మూవీ కావడంతో ‘దేవర’పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఆ అంచనాలు అందుకోలేకపోయిందని కొందరు ప్రేక్షకులు నెగిటివ్ రివ్యూలు కూడా ఇచ్చారు. కానీ చాలావరకు ఈ మూవీ ఇప్పటికీ మిక్స్‌డ్ టాక్‌తో ముందుకెళ్తోంది. కలెక్షన్స్ విషయంలో కూడా దూసుకుపోతోంది. మెల్లగా పార్ట్ 2పై పాజిటివ్ అభిప్రాయంతో ఎదురుచూడడం మొదలుపెట్టారు ఫ్యాన్స్.
కలెక్షన్స్‌పైనే భారం
ఇప్పటికే కొరటాల శివ, ఎన్‌టీఆర్ కాంబినేషన్‌లో ‘జనతా గ్యారేజ్’ అనే మూవీ వచ్చింది. అప్పట్లో ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది. మళ్లీ ఈ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా కావడంతో ‘దేవర’ కూడా బాగుంటుందని ఫ్యాన్స్ ఊహించారు. కానీ రాజమౌళితో సినిమా చేసిన ఏ హీరో అయినా తన తర్వాతి సినిమాతో ఫ్లాప్ ఎదుర్కోవాల్సిందే అని సెంటిమెంట్ ఉండేది. ‘దేవర’ రన్ పూర్తయ్యే సమయానికి ఈ సెంటిమెంట్ బ్రేక్ అయ్యిందా లేదా అనే విషయంపై క్లారిటీ వస్తుంది. అలాగే ‘ఆచార్య’ వల్ల కొరటాలపై ప్రేక్షకుల్లో నెగిటివ్ అభిప్రాయం ఏర్పడింది. అది మారిందా లేదా అనే విషయాన్ని ‘దేవర’ లైఫ్ టైమ్ కలెక్షన్స్ డిసైడ్ చేస్తాయి.
2 title cards chudandi💥💥
Devara- Normal
Devara 2 – Vara name Blood lo undi 🩸🔥ITS VARA TANDAVAM 🥵#Devara @tarak9999 @DevaraMovie pic.twitter.com/z0yPgmSzhP
— NTR Ardent fans (@NTRArdentFans) October 1, 2024