BigTV English

SS Rajamouli : రాజ‌మౌళికి హాలీవుడ్‌ ప్రెస్టీజియ‌స్ అవార్డ్‌.. RRR ఫ్యాన్స్ హాపీ

SS Rajamouli : రాజ‌మౌళికి హాలీవుడ్‌ ప్రెస్టీజియ‌స్ అవార్డ్‌.. RRR ఫ్యాన్స్ హాపీ

SS Rajamouli : తెలుగు సినిమా స్థాయిని ప్ర‌పంచానికి చాటిన ద‌ర్శ‌కుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి. బాహుబలి త‌ర్వాత ఈయ‌న ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం RRR. ప్ర‌పంచ వ్యాప్తంగా సంచనాల‌ను క్రియేట్ చేసిన ఈ మూవీ ఇప్పుడు ఆస్కార్ అవార్డుల రేసు కోసం పోటీ ప‌డుతుంది. దీని ప్ర‌మోష‌న్స్ కోసం రాజ‌మౌళి ప్ర‌మోష‌న్స్‌తో బిజీగా ఉన్నారు. ఈ నేప‌థ్యంలో RRR అభిమానుల‌కు ఓ హ్యాపీ న్యూస్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. అదేంటంటే రాజ‌మౌళికి ప్రెస్టీజియ‌స్ అవార్డ్ ‘ది న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్ స‌ర్కిల్’ అవార్డ్ వ‌చ్చింది. హాలీవుడ్ వార్తా ప‌త్రిక‌లు, మ్యాగ‌జైన్స్, ఆన్ లైన్ ప‌బ్లికేష‌న్స్ సంబంధించి ప‌లువురు ఓ బృందంగా ఏర్ప‌డి ‘ది న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్ స‌ర్కిల్’ (The New York film Critics Circle)అవార్డ్‌ని అందిస్తున్నారు. 1935 నుంచి ఈ ప్ర‌తిష్టాత్మ‌క అవార్డును ఇస్తున్నారు. కాగా.. ఇప్పుడు RRR చిత్రానికిగానూ ‘ది న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్ స‌ర్కిల్’ అవార్డును రాజ‌మౌళికి ఇచ్చారు. దీనిపై ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతూ సోష‌ల్ మీడియాలో జ‌క్క‌న్న‌కు అభినంద‌నలు తెలియ‌జేస్తున్నారు.


స్వాతంత్య్ర స‌మ‌ర యోధులైన అల్లూరి సీతారామ‌రాజు, కొమురం భీమ్ క‌లిసి బ్రిటీష్ వారిపై పోరాటం చేస్తే ఎలా ఉంటుంద‌నే ఊహాజ‌నిత‌మైన క‌థాంశంతో రూపొందిన ఫిక్ష‌న‌ల్ పీరియాడిక్ డ్రామా RRR . ఇందులో అల్లూరి సీతారామ‌రాజుగా రామ్ చ‌ర‌ణ్ న‌టించ‌గా, కొమురం భీమ్‌గా ఎన్టీఆర్ న‌టించారు. ఈ ఏడాది మార్చిలో RRR ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌లైన క‌లెక్ష‌న్స్ ప్ర‌భంజ‌నం క్రియేట్ చేసింది. ఇందులో అజ‌య్ దేవ‌గ‌ణ్‌, అలియా భ‌ట్ వంటి బాలీవుడ్ స్టార్స్‌.. రే స్టీవెన్ స‌న్‌, అలిస‌న్ డూడి వంటి హాలీవుడ్ స్టార్స్ కూడా న‌టించారు.


Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×