BigTV English

SSMB -29: మహేష్ – రాజమౌళి నుంచీ బిగ్ అప్డేట్.. ఊహించలేదుగా.. !

SSMB -29: మహేష్ – రాజమౌళి నుంచీ బిగ్ అప్డేట్.. ఊహించలేదుగా.. !

SSMB -29 : మహేష్ బాబు (Mahesh Babu)- రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో SSMB -29 అనే వర్కింగ్ టైటిల్ తో సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా గతంలో మునుపెన్నడు లేని విధంగా మహేష్ బాబు తన లుక్ ను పూర్తిగా మార్చేసుకున్నారు. ఎన్నడూ చూడని విధంగా గుబురు గడ్డం, పొడవాటి జుట్టు, కండలు తిరిగిన శరీరం అన్నీ కూడా ఆయనలోని పాత్రకు అద్దం పడుతున్నాయి. ముఖ్యంగా రాజమౌళి సినిమాలంటే హీరో పాత్రకు ఖచ్చితంగా ఒక గుర్తింపు ఉండి తీరాల్సిందే. ఇప్పుడు ఆ గుర్తింపును మహేష్ బాబుకు ఇవ్వడానికి రాజమౌళి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో సాగే ఈ కథను యాక్షన్ అడ్వెంచర్ మూవీగా తీర్చిదిద్దుతున్నారు. అందుకు తగ్గట్టుగానే తన పాత్రను కూడా మార్చుకుంటున్నారు మహేష్ బాబు. ఇక శరీరాన్ని కూడా ఒక ఆకృతికి తీసుకురావడానికి గంటలు తరబడి జిమ్ చేస్తూ వర్క్ అవుట్లతో శరీరంలో మార్పులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు మహేష్ బాబు.


రెండు భాగాలుగా మహేష్ – రాజమౌళి మూవీ..

ఇకపోతే ఈ సినిమా రచయిత విజయేంద్రప్రసాద్ సినిమా గురించి కొన్ని విషయాలు వెల్లడించారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. తాజాగా ఈ సినిమా గురించి ఒక బిగ్ అప్డేట్ తెరపైకి రావడంతో మహేష్ అభిమానులలో ఒక వర్గం సంతోషం వ్యక్తం చేసినా ఇంకొక వర్గం నిరాశ వ్యక్తం చేస్తూ ఉండడం గమనార్హం. అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ డిసెంబర్లో మొదలవుతుందని సమాచారం. అంతేకాదు జర్మనీలో మొదలుపెట్టనున్నట్టు వార్తలు రాగా ఇప్పుడు మరొక వార్త ఆసక్తికరంగా మారింది. బాహుబలి సినిమా తరహాలోని మహేష్ బాబుతో చేయబోయే ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కించే ఆలోచన రాజమౌళి చేస్తున్నట్లు సమాచారం.


నిరాశలో ఫ్యాన్స్..

అంతేకాదు ఈ విషయం గురించి మహేష్ బాబుకు ముందుగానే చెప్పాడని, అందుకు మహేష్ బాబు ఏకంగా ఐదు సంవత్సరాల డేట్స్ రాజమౌళి కోసం కేటాయించినట్లు సమాచారం. అయితే ఐదు సంవత్సరాలు అనేసరికి ప్రైమ్ టైం కాస్త పోతుంది అంటూ మహేష్ అభిమానులు చెబుతున్నారు. మరొకవైపు ఈ చిత్రానికి గోల్డ్ గరుడ ఒక టైటిల్ పరిశీలనలో ఉంది. ఏది ఏమైనా ఐదు సంవత్సరాలు ఒకే సినిమా కోసం కేటాయించడం అంటే తమ హీరోపై బజ్ తగ్గిపోతుందని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే మహేష్ బాబు – రాజమౌళి ప్రతి రోజు కూడా ఈ ప్రాజెక్టు గురించి డిస్కషన్ చేస్తున్నారని వార్తలు వినిపిస్తూ ఉండడం గమనార్హం. ఏదేమైనా ఈ సినిమా రెండు భాగాలుగా రాబోతోందని సంతోషపడాలో లేక తమ అభిమాన హీరోకి ఇండస్ట్రీలో గుర్తింపు తక్కువ అవుతుందని బాధపడాలో అర్థం కావడం లేదు అంటూ అభిమానులు వాపోతున్నారు. మరి ఈ లోపు రీమేక్ సినిమాలతో సరిపెట్టుకుంటారేమో చూడాలి.

Related News

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Actress Mohini: అలా చేయాలని బలవంతం చేశారు.. చాలా ఏడ్చాను, బాలయ్య హీరోయిన్ షాకింగ్ కామెంట్స్!

Shriya Saran: నేను హీరోయిన్ అని నా భర్తకు తెలీదు.. ఆ మూవీ చూసి భయపడ్డారు – శ్రియా

Barrelakka: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన బర్రెలక్క.. బేబీ ఎంత క్యూట్ గా ఉందో?

Heroes Remuneration : హైయెస్ట్ పెయిడ్ హీరోలు… మన తెలుగు హీరోలు ఎంత మంది ఉన్నారో చూడండి

Nainika Anasuru : మా నాన్న అలాంటివాడు, అందుకే ఎక్కువ చెప్పను

Nainika Anasuru : నా ఫోటో పెట్టి రేట్ చెప్పే వాళ్ళు, నాకు కూతురు ఉంటే ఇండస్ట్రీకి పంపను

Nainika Anasuru : చచ్చి పోదాం అనుకున్నాను, కన్నీళ్లు పెట్టుకున్న నైనిక

Big Stories

×